జంటనగరాల పరిధిలో జరిగిన ఓ విద్యార్ధిని అనుమానాస్పదమృతి కేసు ఇప్పుడు సంచలనంగా మారింది. రంగారెడ్డి జిల్లా(Rangareddy district) శంషాబాద్ (Shamshabad) లోని రాయల్ విల్లా కాలనీలో ఓ గది అద్దెకు తీసుకొని అందులో సివిల్స్‌కు(Civils student)ప్రిపేర్ అవుతున్న 27సంవత్సరాల పూజిత(Pujitha)గదిలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. అయితే గదిలోని కిటికీకు చున్నీతో మెడకు ఉరివేసుకున్నట్లుగా మృతదేహం కనిపిస్తోంది. గదిలోంచి మృతదేహం దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారు. అనుమానాస్పదమృతి కింద కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే పూజిత మూడ్రోజుల క్రితం చనిపోయినట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రి(Osmania Hospital)కి తరలించారు. ఆత్మహత్యకు చేసుకోవడానికి గల కారణాలు తెలుసుకుంటున్నారు. మరోవైపు విద్యార్ధిని కుటుంబ సభ్యులు మాత్రం పూజితతో క్లోజ్‌గా ఉన్నటువంటి మహ్మద్ అలీ (MOhammad Ali)అనే వ్యక్తిపై అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అతడ్ని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.
పూజిత చావుకు కారణం ఏమిటి..?
రంగారెడ్డి జిల్లాలో సివిల్స్‌కు ప్రిపేర్ అవుతున్న పూజిత అనే 27సంవత్సరాల యువతి మృతి కలకలం రేపుతోంది. శంషాబాద్‌లోని రాయల్ విల్లా కాలనీలో నాలుగు నెలల క్రితమే ఓ గదిని అద్దెకు అందులో తీసుకొని ఉంటోంది పూజిత. తల్లిదండ్రులకు దూరంగా ఉంటూ సివిల్స్‌కు ప్రిపేర్ అవుతోంది. పూజిత స్వస్థలం ఇబ్రహీంపట్నం. పూజిత మరణవార్త తెలుసుకున్న కుటుంబ సభ్యులు బిడ్డ మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. అయితే మహ్మద్ అలీ అనే వ్యక్తి పూజితతో సన్నిహితంగా మెలిగేవాడని..తమ బిడ్డ మృతికి మహ్మద్ అలీనే కారణమంటూ కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. అతడ్ని అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.
Love Jihad - Telangana - Mohd Ali
Ranga Reddy district Royal villa colony 27 yr old pujitha preparing for Civils is dead Muhammed Ali was close to her Parents are demanding to arrest Mohd Ali #Telangana #Hyderabad pic.twitter.com/eQUunveFGH — #Telangana (@HiiHyderabad) December 28, 2022
అతనిపైనే అనుమానాలు..
అయితే అనుమానాస్పదమృతి కింద కేసు నమోదు చేసుకున్న శంషాబాద్ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. పూజిత 2018లో భారత్ ఇంజనీరింగ్ కాలేజీలో బీటెక్ పూర్తి చేసింది. నాలుగు నెలల క్రితమే సివిల్స్ ప్రిపేర్ కావడానికి శంషాబాద్ వచ్చింది. తల్లిదండ్రుల నుంచి దూరంగా ఉంటూ చదువుకుంటున్న యువతికి మహ్మద్ అలీ అనే వ్యక్తి పరిచయమైనట్లుగా తెలుస్తోంది. పూజిత చావుకు ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. మరోవైపు సివిల్స్ ప్రిపేర్ అవుతున్న విద్యార్ధిని చావుకు మహ్మద్ అలీ కారణమనే కుటుంబ సభ్యుల ఆరోపణలతో సోషల్ మీడియాలో సైతం లవ్ జిహాద్ అంటూ స్లోగన్స్, పోస్ట్‌లు పెడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad crime, Love affiar, Telangana News