Home /News /telangana /

HYDERABAD STUDENTS PROTESTED BY SITTING ON THEIR KNEES FOR EXTRA CLASSROOMS IN RANGAREDDY MBNR VB

School Students: ఆ విద్యార్థులు మోకాళ్లపై ఎందుకు కూర్చున్నారో తెలుసా.. కారణం తెలిస్తే..

నిరసన తెలుపుతున్న విద్యార్థులు

నిరసన తెలుపుతున్న విద్యార్థులు

School Students: రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని చౌదరిగుడా మండలం చెగిరెడ్డి ఘనపూర్ గ్రామంలో ఒకటవ తరగతి నుండి ఐదో తరగతి వరకు విద్యార్థులు తమ చదువును  కొనసాగిస్తున్నారు. వాళ్లు ఇలా ఎందుకు నిరసన తెలుపుతున్నారో తెలుసా..

    అదనపు తరగతి గదుల కోసం మోకాళ్ళపై కూర్చొని  విద్యార్థులు నిరసన వ్యక్తం చేశారు. తమకు  తరగతి గదులు కావాలని.. సరిపడా తరగతి గదులు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని విద్యార్థులు మోకాళ్లపై కూర్చుని నిరసన వ్యక్తం చేశారు. రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ పరిధిలోని చౌదరిగుడా మండలం చెగిరెడ్డి ఘనపూర్ గ్రామంలో ఒకటవ తరగతి నుండి ఐదో తరగతి వరకు విద్యార్థులు తమ చదువును  కొనసాగిస్తున్నారు. సుమారు 80 మంది విద్యార్థులు ఉన్న పాఠశాలలో సరైన తరగతి గదులు లేక గత కొంత కాలం నుండి విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.  పాఠశాల భవనం పూర్తిగా  శిథిలావస్థకు చేరుకోవడంతో ఎప్పుడూ కూలి పోతుందోననే   భయంతో విద్యార్థులు అన్ని తరగతుల విద్యార్థులకు ఓకే తరగతి గదిలో చదువును  కొనసాగిస్తున్నారు.

    Anchor Srimukhi Hot Photos: జాకెట్‌ బటన్స్ విప్పేసి పరువాల విందు చేసిన శ్రీముఖి.. ఫొటోలు వైరల్..


    ఒకటవ తరగతి నుండి ఐదో తరగతి వరకు సుమారు 80 మంది విద్యార్థులు ఒకే దగ్గర  చదువును కొనసాగించడం వల్ల తమకు  ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆరోపిస్తున్నారు విద్యార్థులు. ఇప్పటికైనా ప్రభుత్వం అధికారులు  స్పందించి తమకు అదనపు తరగతి గదులను ఏర్పాటు చేయాలని కోరుతున్నారు. ఇప్పటికైనా అధికారులు రాజకీయ నాయకులు విద్యార్థుల అవస్థలను చూసి విద్యార్థులకు మేలు చేయాలని అక్కడ ప్రజలు వాపోతున్నారు.

    Congress-TRS: కాంగ్రెస్ కు భారీ షాక్.. గులాబీ గూటికి కీలక నేత.. ఈ నెల 8న ముహూర్తం..


    ఇదిలా ఉండగా..
    దివ్యాంగుల అన్ని సమస్యలను పరిష్కరిస్తామని జిల్లా కలెక్టర్ ఎస్. వెంకట రావు అన్నారు. అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని పురస్కరించుకొని శుక్రవారం మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని అంబేద్కర్ భవన్లో జిల్లా సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.

    ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దివ్యాంగులకు రిజర్వేషన్ల తో పాటు, ఖాళీగా ఉన్న దివ్యాంగ పోస్టుల భర్తీకి చర్యలు తీసుకొని వారికి న్యాయం చేస్తామని, అదేవిధంగా దివ్యాంగులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించేందుకు ప్రతి నెల మొదటి తేదీన ఉదయం 10 నుండి 12 గంటల వరకు ప్రత్యేక ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహిస్తామని, సంబంధిత అధికారులను కూడా ఈ కార్యక్రమానికి పిలిపించి వారి సమస్యలు పరిష్కారం అయ్యేలా చూస్తామని ఆయన తెలిపారు.

    Married Women: ముగ్గురు పిల్లల తల్లిపై అలా ఎలా చేయాలనిపించిందయ్యా నీకు.. చివరకు ఏమైందో చూడు..


    దివ్యాంగులు అన్నీ అవయవాలు బాగా ఉన్న వారికన్నా బాగా పని చేస్తారని, ఆత్మస్థైర్యంతో ముందుకు వెళ్లాలని ఆయన కోరారు. ఈ సందర్భంగా కలెక్టర్ ప్రతిభ కనబరిచిన పలువురు దివ్యాంగుల ను శాలువా, జ్ఞాపికలతో సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి రాజేశ్వరి ,దివ్యాంగుల సంఘాల అసోసియేషన్ అధ్యక్ష ,కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.

    మీ నగరం నుండి (​హైదరాబాద్)

    తెలంగాణ
    ​హైదరాబాద్
    తెలంగాణ
    ​హైదరాబాద్
    Published by:Veera Babu
    First published:

    Tags: Mahabubnagar, Rangareddy

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు