హోమ్ /వార్తలు /తెలంగాణ /

HCU | HYDERABAD : హెచ్‌సీయూలో స్టూడెంట్స్ రగడ .. క్యాంపస్‌లో ధర్నాతో టెన్షన్‌ వాతావరణం

HCU | HYDERABAD : హెచ్‌సీయూలో స్టూడెంట్స్ రగడ .. క్యాంపస్‌లో ధర్నాతో టెన్షన్‌ వాతావరణం

HCU (FILE PHOTO)

HCU (FILE PHOTO)

HCU | HYDERABAD: హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీలో స్టూడెంట్స్‌ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. స్టూడెంట్స్‌ దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీ అధికారుల తీరును వ్యతిరేకిస్తూ క్యాంపస్‌లో ధర్నాకు దిగారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణలో యూనివర్సిటీల్లో విద్యార్ధుల ఆందోళనలకు తెర పడే పరిస్థితి కనిపించడం లేదు. తాజాగా హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీ(Hyderabad Central University)లో స్టూడెంట్స్‌ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌(Common Entrance Test)లో క్వాలిఫై అయిన స్టూడెంట్స్‌(Students) దగ్గర నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్సిటీ అధికారుల తీరును వ్యతిరేకిస్తూ క్యాంపస్‌లో ధర్నా(Protest)కు దిగారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో యూనివర్సిటీ సెక్యురిటీ సిబ్బంది(Security personnel) ధర్నా చేస్తున్న విద్యార్ధులను బలవంతంగా కాళీ చేయించారు.

Suicide: ఆ టార్చర్ భరించలేక ఎంసెట్ ర్యాంకర్‌ సూసైడ్ .. ప్రాణాలు తీసిన 15వేల అప్పు

హెచ్‌సీయులో టెన్షన్ ..

విద్యార్ధుల ఆందోళనను అడ్డుకునే ప్రయత్నంలో భాగంగా సెక్యురిటీ సిబ్బందికి స్టూడెంట్స్‌కి మధ్య స్వల్ప తోపులాట జరిగింది. పలువురు విద్యార్ధులకు గాయలవడంతో క్యాంపస్‌లో విద్యార్దులు వర్సిటీ అధికారులు డౌన్‌ డౌన్‌ అంటూ నినాదాలు చేశారు. క్యాంపస్‌లో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. పెంచిన ఫీజులు వెంటనే తగ్గించి..తమ నుంచి వసూలు చేసిన డబ్బులు తిరిగి చెల్లించాలని స్టూడెంట్స్ డిమాండ్ చేశారు.

అధిక ఫీజు వసూలుపై ధర్నా..

హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీకి చెందిన విద్యార్థులు కామన్ ఎంట్రెన్స్ టెస్ట్‌ క్వాలిఫై అయ్యారు. వారిలో 1,57,000 మంది నుంచి ఒక్కొక్కరి దగ్గర రూ.600 అధికంగా ఫీజు వసులు చేశారని యూనివర్సిటీ విద్యార్థుల ఆందోళన చేపట్టారు. విద్యార్థుల నుంచి వసూలు చేసిన డబ్బులను తిరిగి ఇచ్చేంత వరకు ఆందోళన కొనసాగిస్తామని వారు హెచ్చరించారు. అయితే దీనిపై వర్సిటీ అధికారులు, వీసీ ఇంత వరకు స్పందించకపోవడంతో క్యాంపస్‌లో టెన్షన్ వాతావరణం నెలకొంది.

Danger Spot : అది యమపురికి రహదారి .. అటుగా వెళ్లాలంటే భయపడిపోతున్న వాహనదారులు

వరుస సంఘటనలు..

ఇప్పటికే తెలంగాణలోని బాసర ట్రిపుల్‌ ఐటీ క్యాంపస్‌, తెలంగాణ యూనివర్సిటీలో హైదరాబాద్‌ ఐఐటీలో వరుస సంఘటనలతో వర్సిటీలకు చెడ్డ పేరు ఆపాదించుకుంది. అలాంటి సమయంలో మళ్లీ హైదరాబాద్‌ సెంట్రల్ యూనివర్సిటీలో ఇలాంటి రగడ నెలకొనడంతో మళ్లీ టెన్షన్‌ నెలకొంది.

Published by:Siva Nanduri
First published:

Tags: Hyderabad Central University, Telangana News

ఉత్తమ కథలు