Home /News /telangana /

HYDERABAD STUDENTS AND THEIR PARENTS PROTESTED AFTER A PRIVATE SCHOOL IN HYDERABAD WAS ORDERED NOT TO COME WITH A HIJAB PRV

Hijab controversy: హైదరాబాద్​లోని ఆ పాఠశాలలో మళ్లీ హిజాబ్​ వివాదం.. రంగంలోకి పోలీసులు.. లాఠీచార్జి.. 

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

హిజాబ్​ రగడ మళ్లీ మొదలైంది. హైదరాబాద్​లోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం హిజాబ్​  (Hijab )తో రావొద్దని విద్యార్ధినులకు ఆదేశాలు జారీ చేసింది. దీంతో వివాదం మొదలైంది.

    హిజాబ్​ రగడ మళ్లీ మొదలైంది. హైదరాబాద్ (Hyderabad)​లో బహదూర్‌పుర (Bahadurpura)లోని ఓ ప్రైవేట్ స్కూల్ యాజమాన్యం హిజాబ్​  (Hijab )తో రావొద్దని విద్యార్ధినులకు తెలిపింది. దీంతో స్కూల్ ప్రాంగణంలో విద్యార్ధులు, వారి కుటుంబ సభ్యులు బుధవారం ఆందోళనకు దిగారు. ఈ ఆందోళనతో ఉద్రిక్తత నెలకొనడంతో పోలీసులు లాఠీ చార్జీ చేశారు. బహదూర్‌పుర వద్ద ఉన్న ప్రైవేట్ స్కూల్ (Private school) యాజమాన్యం పాఠశాలలోకి హిజాబ్ ను అనమతించకపోవడంతో విద్యార్ధులు, వారి కుటుంబ సభ్యులు బుధవారం స్కూల్ వద్ద ఆందోళనకు (Protest) దిగారు. స్కూల్లోకి పిల్లలను అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. దీంతో స్కూల్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు (Police) స్కూల్ వద్ద ఆందోళన చేస్తున్న వారిని సముదాయించేందుకు ప్రయత్నించారు. కానీ ఆందోళనకారులు వినిపించుకోలేదు. పరిస్థితి చేయిదాటిపోయే పరిస్థితి రావడంతో పోలీసులు లాఠీచార్జీ చేశారు. ఈ ఘటనలో పలువురికి గాయాలయ్యాయి.

    జనవరి 1న ఉడిపిలో..

    కర్ణాటకలో హిజాబ్ (Hijab) వివాదం 2022 సంవత్సరం మొదలు కాగానే ప్రారంభమయింది. హిజాబ్ ధరించి క్లాస్ రూంలకు రానివ్వడం లేదని కర్ణాటకకు (Karnataka) చెందిన ఐదుగురు ముస్లిం విద్యార్థినులు కర్ణాటక హై కోర్టును (high court) ఆశ్రయించారు. వారు దాఖలు చేసిన పిటిషన్​ను (plea) కోర్టు విచారించేందుకు స్వీకరించింది. దీంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. జనవరి 1న ఉడిపిలోని ఓ ముస్లిం ప్రీ యూనివర్సిటీ కళాశాలలో కొంత మంది విద్యార్థినులు హిజాబ్ (Hijab) ధరించి క్లాస్​కు హాజరయ్యారు. కానీ క్లాస్ తీసుకుంటున్న టీచర్ వారిని తరగతి గదిలోనికి రానిచ్చేందుకు నిరాకరించారు. దీంతో ఈ హిజాబ్ (Hijab) ఉద్యమం మొదలైంది. అలా తమను క్లాస్ రూంలోకి రానీయకుండా చేసినందుకు ఆ విద్యార్థినులు హై కోర్టును ఆశ్రయించారు.

    ఈ వివాదం ముదురుతూ వచ్చింది. పోటీగా కొంత మంది హిందూ విద్యార్థులు కాషాయ కండువాలను ధరిస్తూ క్లాసులకు రావడం మొదలు పెట్టారు. హిందూ ముస్లిం విద్యార్థులు పోటాపోటీగా కండువాలు, హిజాబ్ (Hijab) ధరించడం మొదలు పెట్టారు. ఇలా హిజాబ్ (Hijab) ధరించి క్లాస్ రూంకి రావడానికి ప్రిన్సిపల్ రుద్ర గౌడ వారిని అనుమతించలేదని ఆ విద్యార్థినులు ఆరోపించారు. తరగతి గదుల్లో ఏకరూపత ఉండాలని ఇలా చేసినట్లు రుద్రగౌడ తెలిపారు.

    శివమొగ్గలో ముస్లింలు హిజాబ్ (Hijab) ధరించి రావడం, హిందువులు కాషాయ కండువాలు ధరించి రావడంతో ఉద్రిక్తత నెలకొంది. ఈ వివాదంతో అక్కడ రాళ్లదాడి జరిగింది. దీంతో శివమొగ్గలో 144 సెక్షన్ విధించారు. జనవరి 19న ఉడిపి కళాశాలలో హిజాబ్ (Hijab) ఘటనపై సమస్యను శాంతియుతంగా పరిష్కరించుకునేందుకు తల్లిదండ్రులు ఉపాధ్యాయులు సమావేశమయ్యారు. కానీ అక్కడ కూడా ఎటువంటి పరిష్కారం లభించలేదు.

    హిజాబ్ వివాదంపై 11 రోజుల పాటు హైకోర్టు విచార‌ణ జ‌రిపింది. అనంతరం హైకోర్టు ఫిబ్రవరి 25న తీర్పును రిజర్వ్ చేసింది. కాగా ఈ తీర్పు వెల‌వ‌డే వారం రోజుల ముందు నుంచి బెంగ‌ళూరు వంటి ముఖ్య ప‌ట్ట‌ణాల్లో పెద్ద స‌మావేశాల‌ను క‌ర్ణాటక ప్ర‌భుత్వం నిషేదించింది. రాష్ట్రంలో శాంతి భద్రతలకు విఘాతం కల్గిస్తున్నందున వివాదానికి కారణమైన దుస్తులను ప్రభుత్వం ఈ ఏడాది పిబ్రవరి 5న నిషేధం విధించిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మార్చి 15న కర్ణాటక హైకోర్టు విద్యా సంస్థల్లో హిజాబ్ అవసరం లేదని తేల్చి చెప్పింది.ఈ తీర్పుపై పిటిషనర్లు సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Hijab, Hyderabad

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు