Home /News /telangana /

HYDERABAD STUDENT VEDANT ANANDWADE WILL BE AWARDED A SCHOLARSHIP OF RS ONE CRORE THIRTY LAKHS BY AN AMERICAN UNIVERSITY PRV

Hyderabad Student scholarship: అదరగొట్టాడుగా.. హైదరాబాద్ విద్యార్థికి రూ.1.30 కోట్ల స్కాలర్​షిప్​.. 

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

(ప్ర‌తీకాత్మ‌క చిత్రం)

హైదరాబాద్‌ (Hyderabad)కు చెందిన 18 ఏళ్ల విద్యార్థి వేదాంత్‌ ఆనంద్‌వాడే అరుదైన ఘనత సాధించాడు. బ్యాచిలర్‌ డిగ్రీ చదివేందుకు రూ.1.30 కోట్ల స్కాలర్‌షిప్‌ పొందాడు.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India
    హైదరాబాద్‌ (Hyderabad)కు చెందిన 18 ఏళ్ల విద్యార్థి వేదాంత్‌ ఆనంద్‌వాడే (Vedant Anandwade) అరుదైన ఘనత సాధించాడు. అమెరికాలోని కేస్‌ వెస్ట్రన్‌ రిజర్వ్‌ విశ్వవిద్యాలయం (Case Western Reserve University in America) బ్యాచిలర్‌ డిగ్రీ చదివేందుకు రూ.1.30 కోట్ల స్కాలర్‌షిప్‌ (scholarship) పొందాడు. ఈ మేరకు ఆ వర్సిటీ అంగీకార పత్రాన్ని, స్కాలర్‌షిప్‌ లేఖను వేదాంత్​కు పంపింది. గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్‌ పాఠశాలలో ఐసీఎస్‌ఈ (ICSE) సిలబస్‌తో 12వ తరగతిని పూర్తి చేసిన వేదాంత్‌ అమెరికాలో న్యూరోసైన్స్‌ చదవనున్నాడు.

    విద్యావకాశాలు, శిక్షణ ద్వారా భవిష్యత్తు తరం నాయకులను తీర్చిదిద్దే జాతీయ స్వచ్ఛంద సంస్థ డెక్స్టేరిటీ గ్లోబల్‌ వేదాంత్​ను గుర్తించింది. అనంతరం అతనికి తగిన మార్గదర్శకం చేసింది సంస్థ. పట్టుదలతో శ్రమించిన వేదాంత్​కు కేస్‌ వెస్ట్రన్‌ రిజర్వ్‌ విశ్వవిద్యాలయం అవకాశం కల్పించింది. దీంతో ఈ నెల 12న వేదాంత్‌ అమెరికాకు బయలుదేరి వెళ్లనున్నాడు.



    17 మందికి నోబెల్​..

    ఈ సందర్భంగా విద్యార్థి వేదాంత్​ మాట్లాడుతూ వైద్యశాస్త్రంలో వర్సిటీ ప్రపంచంలోనే 16వ ర్యాంకులో ఉందన్నాడు.  17 మంది నోబెల్‌ పురస్కార గ్రహీతలను అందించిందని వేదాంత్​ తెలిపాడు. అలాంటి వర్సిటీలో చదువుకునేందుకు ట్యూషన్‌ ఫీజు మేరకు స్కాలర్‌షిప్‌  (scholarship)లభించిందని అతను చెప్పాడు. నాన్న ప్రైవేట్‌ ఆసుపత్రిలో దంత వైద్యుడిగా, అమ్మ ఫిజియోథెరపిస్ట్‌గా పనిచేస్తున్నారని వేదాంత్‌ తెలిపాడు.

    విదేశాల్లో ఉన్నత విద్యను అభ్యసించడం చాలా మంది విద్యార్థుల కల. అయితే ట్యూషన్ ఫీజులు(Tuition Fee), రోజువారీ అవసరాలకు పెద్దమొత్తంలో డబ్బు అవసరం అవుతుంది. దీంతో విద్యార్థుల్లో ఎక్కువ మంది విదేశాల్లో చదవడానికి వెనకడుగు వేస్తారు. అయితే యూకే లాంటి దేశాలు భారతీయ విద్యార్థుల కోసం స్పెషల్ స్కాలర్ షిప్‌లు ప్రకటిస్తున్నాయి. పైగా అకడమిక్ ఎక్సలెన్స్, వరల్డ్ క్లాస్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, స్కిల్ ఫ్యాకల్టీకి(Skill Faculty) యూకే కేరాఫ్ అడ్రస్‌గా(Address) నిలిచింది. దీంతో చాలా మంది విద్యార్థులను యూకే ఆకర్షిస్తుంది. ఇండియన్ కరెన్సీలో పోల్చితే ఫౌండ్ మారకం విలువ ఎక్కువ. దీంతో అక్కడ ఉన్నత విద్యను అభ్యసించడం ఆర్థికంగా భారతీయ విద్యార్థులకు సవాల్‌తో కూడుకున్న విషయం. అయితే అన్ని రంగాల్లో యూకేతో భారత్‌కు(India) సత్సంబంధాలు ఉండడంతో భారతీయ విద్యార్థుల కోసం యూకే ప్రభుత్వం గ్రేట్ స్కాలర్ షిప్‌లను మంజూరు చేస్తోంది.

    గ్రేట్ స్కాలర్‌షిప్‌లు 2022-23

    యూకేలో చదువుకోవడం కోసం ఆర్థికంగా వెసులుబాటు ఉండే గ్రేట్ స్కాలర్‌షిప్‌లనే ఎక్కువ మంది భారతీయ విద్యార్థులు ఫ్రిఫర్ చేస్తుంటారు. యూకే ప్రభుత్వం గ్రేట్ బ్రిటన్ ఆధ్యర్వంలో బ్రిటిష్ కౌన్సిల్ స్కాలర్ షిప్ లను అందిస్తాయి. వీటి సహాయంతో యూకేలో ఎక్కడైనా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీ అభ్యసించే అవకాశం ఉంటుంది.

    2022-23 అడమిక్ ఇయర్‌కు సంబంధించి భారతీయ విద్యార్థుల కోసం 20 పోస్ట్ గ్రాడ్యుయేషన్ గ్రేట్ స్కాలర్‌షిప్‌లు అందుబాటులో ఉన్నాయి. వీటి సహాయంతో యూకేలోని 16 యూనివర్సిటీల్లో ఫైనాన్స్, మార్కెటింగ్, బిజినెస్, సైకాలజీ డిజైన్, హ్యూమానిటీస్, డ్యాన్స్ తదితర సబ్జెక్టుల్లో పీజీ చేయవచ్చు. వీటికి అదనంగా న్యాయశాస్త్రానికి సంబంధించి మరో 7 గ్రేట్ స్కాలర్ షిప్‌లను భారతీయ విద్యార్థుల కోసం ప్రకటించారు. మానవ హక్కులు, క్రిమినల్ జస్టిస్, వాణిజ్య చట్టం వంటి సబ్జెక్ట్‌లపై పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేయవచ్చు.
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: America, Hyderabad, Medicine, Scholarships, Student

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు