తెలంగాణ హోం మంత్రి మహమూద్ అలీ మనవడిపై పంజాగుట్ట పోలీసులకు ఓ ఫిర్యాదు అందింది. అతడు ర్యాగింగ్ చేస్తు తమను ఇబ్బందులకు గురిచేస్తున్నాడని ఓ ఇంజనీరింగ్ విద్యార్థి పోలీసులను ఆశ్రయించాడు. వివరాలు.. హోంమంత్రి మహమూద్ అలీ మనవడు ఫరాన్ బంజారాహిల్స్ రోడ్ నం.3లోని ముఫకంజా ఇంజినీరింగ్ కాలేజ్లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతున్నాడు. ఫరాన్ తమను ర్యాగింగ్ చేస్తున్నాడంటూ అదే కళాశాలకు చెందిన బీటెక్ విద్యార్థి రియాన్ పంజాగుట్ట పోలీసులను ఆశ్రయించాడు. అతనిపై చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. అనంతరం రియాన్ అనే విద్యార్థి మీడియాతో మాట్లాడాడు. ఈ సందర్భంగా తన చేతికి అయిన గాయాలను రియాన్ మీడియాకు చూపించారు. అతడి నుంచి తమను కాపాడాలని కోరాడు.
ఇక, రియాన్ ఫిర్యాదుపై పోలీసులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సి ఉంది. కాగా, ఈ ఘటనకు సంబంధించిన పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.