• Home
  • »
  • News
  • »
  • telangana
  • »
  • HYDERABAD STAY HOME QUARANTINE WHO WENT KHUMBAMELA SAID TELANAGANA GOVT VS

Khumbhmela alert : కుంభమేళ భక్తులు బయటికి రాకండి..

ప్రతీకాత్మకచిత్రం

Khumbhmela కరోనా వ్యాప్తికి తెలంగాణ ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు పూనుకుంది. ఇప్పటికే పలు చర్యలు చేపట్టిన ప్రభుత్వం ఇందుకు కారణమయ్యె వారికి కూడ పలు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రాష్ట్రం నుండి కుంభం మేళకు వెళ్లిన వారు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించింది.

  • Share this:
కరోనా వ్యాప్తికి తెలంగాణ ప్రభుత్వం మరింత కఠిన చర్యలకు పూనుకుంది. ఇప్పటికే పలు చర్యలు చేపట్టిన ప్రభుత్వం ఇందుకు కారణమయ్యె వారికి కూడ పలు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రాష్ట్రం నుండి కుంభం మేళకు వెళ్లిన వారు హోం క్వారంటైన్‌లో ఉండాలని సూచించింది.

కరోనా వ్యాప్తిని అరికట్టందుకు తెలంగాణ ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకుంది. ఈనెల 1 నుండి 17 సాగిన కుంభమేళలో తెలంగాణ నుండి వెళ్లిన వారు పూర్తిగా క్వారంటైన్‌లో ఉండాలని తెలంగాణ వైద్య ఆరోగ్యశాఖ డైరక్టర్ సూచించింది. కాగా కుంభమేళకు వెళ్లివచ్చిన వారిలో జ్వరం , జలుబు, గొంతునొప్పి తోపాటు తలనొప్పి ఉన్నవారందరు వెంటనే కరోనా పరీక్షలు చేయించుకోవాలని చెప్పారు. ఇతర సమస్యలు ఏవైనా ఉంటే 104 కు కాల్ చేయాలని తెలిపారు.

ఉత్తరాఖండ్ లోని హరిద్వార్ లో కుంభమేళ జరిగిన విషయం తెలిసిందే..అయితే ఆ కుంభమేళలో పాల్గోన్న ముప్పై మంది సాధువులకు కూడ కరోనా సోకినట్టు వార్తలు వెలువడ్డాయి. దీంతో కుంభమేళ నిర్వహణపై అనేక విమర్శలు వచ్చాయి. కరోనా విస్తృతంగా విస్తరిస్తున్న పరిస్థితుల్లో కుంభమేళ నిర్వహించడం కరోనా వ్యాప్తికి మరింత అజ్యం పోసింది..సాధువులతో పాటు కుంభమేళలలో పాల్గోన్న వేలాది మంది భక్తులకు కూడ కరోనా సోకినట్టు నిర్ధారణ అయింది.

దీంతో పలు రాష్ట్రాలు సైతం అలర్ట్ అయ్యాయి. ఆయా రాష్ట్ర్రాల నుండి వెళ్లిన వారి కోసం వెతకడం ప్రారంభించాయి. ఈ నేపథ్యంలోనే కుంభమేళకు వెళ్లిన భక్తులు క్వారంటైన్ లో ఉండాలని తెలంగాణ ప్రభుత్వం ముందస్తుగానే సూచించింది.
Published by:yveerash yveerash
First published: