HYDERABAD STATUE OF EQUALITY PM MODI TO INVEIL RAMANUJACHARYA HYDERABAD 10 FACTS GH VB
Statue of Equality: ఫిబ్రవరి 5న ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ ఆవిష్కరణ.. ఈ విగ్రహం గురించి 10 విషయాలు మీ కోసం..
ప్రతీకాత్మక చిత్రం (Image:Facebook)
11వ శతాబ్దపు సాధువు, సంఘ సంస్కర్త రామానుజాచార్య 216 అడుగుల విగ్రహాన్ని ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించనున్నారు. 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ' పేరుతో పిలుస్తున్న ఈ విగ్రహాన్ని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్‌లో ఏర్పాటు చేశారు.
11వ శతాబ్దపు సాధువు, సంఘ సంస్కర్త రామానుజాచార్య(Ramanujacharya) 216 అడుగుల విగ్రహాన్ని ఫిబ్రవరి 5న ప్రధాని నరేంద్ర మోదీ(Narendra modi) ఆవిష్కరించనున్నారు. 'స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ(Statue Of Equality)' పేరుతో పిలుస్తున్న ఈ విగ్రహాన్ని రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం(Shamshabad Mandal) ముచ్చింతల్‌లో ఏర్పాటు చేశారు. విగ్రహ ప్రారంభోత్సవ కార్యక్రమానికి ప్రముఖ ఆధ్యాత్మిక గురువు చిన జీయర్ స్వామితో పాటు తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావు(Telangana Chief Minister) హోస్ట్‌గా వ్యవహరించనున్నారు. ఈ కార్యక్రమానికి పలువురు ముఖ్యమంత్రులు, రాజకీయ నాయకులు, ప్రముఖులు, నటీనటులు కూడా హాజరుకానున్నారు. 2014లో ‘స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ’ ప్రాజెక్టుకు శంకుస్థాపన చేశారు.
దీని గురించి తాజాగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చినజీయర్ స్వామి మాట్లాడుతూ, “స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ ప్రారంభోత్సవానికి ముఖ్య అతిథులు, ప్రముఖులు, భక్తులు, అన్ని వర్గాల ప్రజలతో సహా ప్రతి ఒక్కరినీ హృదయపూర్వకంగా స్వాగతిస్తున్నాం. భగవద్ రామానుజాచార్య 1,000 సంవత్సరాలుగా సమానత్వానికి నిజమైన చిహ్నంగా మిగిలిపోయారు. ఈ ప్రాజెక్ట్ ఆయన బోధనలను కనీసం మరో 1,000 సంవత్సరాలు ఆచరించేలా చేస్తుంది.” అని చెప్పారు.
స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ గురించి 10 ముఖ్యమైన విషయాలు..
- స్టాట్యూ ఆఫ్ ఈక్వాలిటీ 216 అడుగుల పొడవు ఉంటుంది. హైదరాబాద్ నగర శివారు శంషాబాద్ వద్ద 45 ఎకరాల సువిశాల ప్రాంగణంలో ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేశారు.
- ఈ విగ్రహం బంగారం, వెండి, రాగి, ఇత్తడి, జింక్ వంటి పంచ లోహాల కలయికతో రూపొందింది.
- ఈ ప్రాజెక్టు కోసం రూ. 1,000 కోట్లు ఖర్చు చేశారు. ప్రపంచవ్యాప్తంగా భక్తుల నుంచి వచ్చిన విరాళాల ద్వారా నిధులు సమకూర్చారు.
- కూర్చున్న స్థితిలో ఉన్న ప్రపంచంలోని రెండవ ఎత్తైన విగ్రహంగా నిలిచింది. థాయ్‌లాండ్‌లోని బుద్ధ విగ్రహం కూర్చున్న భంగిమలో ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన విగ్రహంగా పేరొందింది.
- రామానుజాచార్య ఈ భూమిపై సంచరించిన 120 సంవత్సరాల జ్ఞాపకార్థం పూజా మూర్తి విగ్రహాన్ని 120 కిలోల బంగారంతో తయారు చేశారు. ఫిబ్రవరి 13న రామానుజుల స్వర్ణ విగ్రహం ఉన్న లోపలి గదిని రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఆవిష్కరించనున్నారు.
- ప్రారంభోత్సవ కార్యక్రమంలో 1,035 హోమ గుండాల్లో అగ్ని నైవేద్యాన్ని నిర్వహించనున్నారు. దీన్ని చరిత్రలోనే అతిపెద్ద యాగంగా చెబుతున్నారు. ఈ కార్యక్రమంలో సామూహిక మంత్ర-పఠనం వంటి ఇతర ఆధ్యాత్మిక కార్యక్రమాలు కూడా ఉంటాయి.
- 45 ఎకరాల సువిశాల ప్రాంగణంలో 108 దివ్య దేశాలు, 108 విష్ణు ఆలయాలు, ఆళ్వార్లను నిర్మించారు.
విగ్రహంలోని 54 అడుగుల ఎత్తైన బేస్ బిల్డింగ్‌కు 'భద్ర వేదిక' అని పేరు పెట్టారు.
- దీనిలో వేద డిజిటల్ లైబ్రరీ, పరిశోధనా కేంద్రం, పురాతన భారతీయ గ్రంథాలు, థియేటర్, ఎడ్యుకేషనల్ గ్యాలరీ, శ్రీరామానుజుల రచనలను వివరించే పుస్తకాలు, ఆడియో క్యాసెట్లు అందుబాటులో ఉంటాయి.
- శ్రీ రామానుజాచార్యుల 1,000వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహాన్ని ఆవిష్కరిస్తున్నారు.
- శ్రీరామానుజాచార్యులు సమానత్వానికి శాశ్వత చిహ్నంగా ఉన్నందున ఆయన విగ్రహానికి సమానత్వ విగ్రహం అని పేరు పెట్టారు.
శ్రీ రామానుజాచార్యుల గురించి..
శ్రీ రామానుజాచార్యులు1017లో తమిళనాడులోని శ్రీ పెరంబుదూర్‌లో జన్మించారు. జాతీయత, లింగం, జాతి, కులం లేదా మతంతో సంబంధం లేకుండా ప్రతి మానవుడు సమానుడేనని ఆయన బోధించారు. సామాజిక, సాంస్కృతిక, లింగ, విద్యా, ఆర్థిక వివక్ష నుంచి లక్షలాది మందికి విముక్తి కల్పించారు. తీవ్ర వివక్షకు గురైన వర్గాలకు ఆలయ ప్రవేశం కల్పించారు. తద్వారా, ప్రపంచవ్యాప్తంగా ఉన్న సామాజిక సంస్కరణవాదులకు సమానత్వానికి శాశ్వత చిహ్నంగా చరిత్రలో నిలిచిపోయాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.