Home /News /telangana /

HYDERABAD STATE CONGRESS HIGH COMMAND REMOVES SANGAREDDY MLA JAGGAREDDY FROM TPCC WORKING PRESIDENT POST SNR

జగ్గారెడ్డికి టీపీసీసీ షాక్..వర్కింగ్ ప్రెసిడెంట్ పదవి నుంచి తొలగించిన రేవంత్‌రెడ్డి

(జగ్గారెడ్డికి పదవులు తొలగింపు)

(జగ్గారెడ్డికి పదవులు తొలగింపు)

Jaggareddy: సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డికి కాంగ్రెస్‌ పార్టీలో పదవులు తొలగించబడ్డాయి. కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన జగ్గారెడ్డి ప్రస్తుతం టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌తో పాటు పార్లమెంట్ నియోజకవర్గాల బాధ్యతలు కలిగి ఉన్నారు. అయితే గత కొంతకాలంగా పార్టీ నిర్ణయాల్ని వ్యతిరేకిస్తూ వస్తున్న ఆయనకు పదవుల నుంచి తప్పిస్తూ ఈ విధంగా నిర్ణయం తీసుకున్నారు టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి.

ఇంకా చదవండి ...
సంగారెడ్డి ఎమ్మెల్యే (Sangareddy MLA)తూర్పుజయప్రకాష్‌రెడ్డి ఉరఫ్ జగ్గారెడ్డి  (Jaggareddy) ని కాంగ్రెస్‌ పార్టీ పదవుల నుంచి తప్పించింది రాష్ట్ర అధినాయకత్వం. ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్‌(TPCC Working President)గా ఉన్న జగ్గారెడ్డిని ఆ పదవి నుంచి తొలగిస్తున్నట్లు టీపీసీసీ ప్రకటించింది. అంతే కాదు కాంగ్రెస్‌ పార్టీ పార్లమెంట్‌ నియోజకవర్గాల బాధ్యతల నుంచి కూడా తప్పించింది. కాంగ్రెస్‌ పార్టీ ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక జగ్గారెడ్డి ఈమధ్యనే చేసిన వ్యాఖ్యలే కారణమని తెలుస్తోంది. తాను స్వతంత్రంగా ఉంటానని జగ్గారెడ్డి ప్రకటించిన నేపధ్యంలో తెలంగాణ కాంగ్రెస్‌ కమిటీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లుగా సమాచారం. ప్రస్తుతం ఆయనకు అప్పగించిన రెండు పదవుల నుంచి తప్పిస్తున్నట్లుగా ప్రకటించింది. జగ్గారెడ్డి నుంచి తొలగించిన బాధ్యతల్ని మాజీ ఎంపీ అంజన్‌కుమార్‌ యాదవ్, మాజీ క్రికెటర్ మహ్మద్ అజారుద్దీన్‌, మహేష్‌గౌడ్‌లకు అప్పగిస్తూ టీపీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి నిర్ణయం తీసుకున్నారు.





ఉన్న రెండు పదవులు పోయే..
గత కొంత కాలంగా పార్టీ నిర్ణయాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తూ వస్తున్నారు జగ్గారెడ్డి. అలాగే రేవంత్‌రెడ్డిపై అధిష్టానానికి ఫిర్యాదు చేయాలన్న జగ్గారెడ్డి ఆలోచనలకు ముందుగానే టీపీసీసీ బ్రేక్ వేసినట్లుగా కనిపిస్తోంది. అయితే పార్టీ పదవుల నుంచి తనను తప్పించడంపై జగ్గారెడ్డి ఎలా రియాక్ట్ అవుతారో చూడాలి.

కారణం అదే కావచ్చేమో..
పదవుల నుంచి తప్పించక ముందు జగ్గారెడ్డి టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డిపై కీలక వ్యాఖ్యలు చేశారు. తాను సంగారెడ్డి ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని..తనకు వ్యతిరేకంగా ఒక అభ్యర్దిని నిలబెట్టి గెలిపించగలరా అంటూ సవాల్ విసిరారు. అంతే కాదు తనను సస్పెండ్ చేసే దమ్ము ఎవరికి లేదన్న జగ్గారెడ్డి షోకాజ్ నోటీసు ఇస్తే సమాధానం చెబుతానన్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో జరుగుతున్న పంచాయితీని ఎక్కడ ఢిల్లీ అధిష్టానం దగ్గరకు తీసుకెళ్తారో అనే ఆలోచనతోనే టీపీసీసీ ఇలా వేటు వేసినట్లుగా ఉందంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
Published by:Siva Nanduri
First published:

Tags: Congress, Jagga Reddy, Mp revanthreddy, Tpcc

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు