హోమ్ /వార్తలు /తెలంగాణ /

OMG:రోగుల్ని పట్టించుకోరు..శవాల్ని తారుమారు చేసి అప్పగిస్తారు..ఏ ఆసుపత్రిలోనో తెలుసా

OMG:రోగుల్ని పట్టించుకోరు..శవాల్ని తారుమారు చేసి అప్పగిస్తారు..ఏ ఆసుపత్రిలోనో తెలుసా

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

OMG:ప్రభుత్వాసుపత్రిలో పనిచేస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం పరాకాష్టకు చేరిందనడానికి ఇదో నిదర్శనం. హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రి సిబ్బంది చనిపోయిన ఇద్దరు రోగుల మృతదేహాల్ని మార్చి బంధువులకు అప్పగించారు. ఒకరోగి అంత్యక్రియలు వేరే రోగి బంధువులు నిర్వహించిన తర్వాత ఈ నిజం బయటపడింది.

ఇంకా చదవండి ...

తెలంగాణ(Telangana)లో సర్కారు దవఖానలో పనిచేస్తున్న సిబ్బంది నిర్లక్ష్యం చెప్పుకోవడానికి వీల్లేనంత స్థాయికి చేరింది. రోగంతో ఆసుపత్రికి వచ్చే వాళ్లని హీనంగా చూసే స్థాయి నుంచి చివరకు చనిపోయిన తర్వాత మృతదేహాలను అప్పగించే విషయం వరకు అంటి ముట్టనట్లుగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్‌(Hyderabad)లో రెండో రెండవ అతిపెద్ద ప్రభుత్వ ఆసుపత్రిగా పేరున్న ఉస్మానియా జనరల్ ఆసుపత్రి (Osmania Hospital)మార్చురి(Mortuary)సిబ్బంది వెలగబెట్టిన నిర్వాకం ఆలస్యంగా బయటపడింది. ఇద్దరు వ్యక్తులు చికిత్స పొందుతూ చనిపోతే ..ఒకరి మృతదేహాన్ని మరొకరి కుటుంబ సభ్యులకు అప్పగించడంపై బంధువులు ఆసుపత్రి సిబ్బంది తీరుపై మండిపడుతున్నారు. పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. మైలార్‌దేవ్‌పల్లి (Mylardevpalli)కి చెందిన పాండురంగాచారి(Pandurangachari)అనే వ్యక్తితో పాటు ఎస్‌ఆర్‌ నగర్‌(SR Nagar)కి చెందిన మరో రోగి ఉస్మానియాలో ట్రీట్‌మెంట్‌ పొందుతూ చనిపోయారు. అయితే మార్చురిలో ఉన్న డెడ్‌బాడీ(Deadbody)ల్లో పాండురంగాచారి మృతదేహాన్ని ఎస్‌ఆర్‌నగర్‌కి చెందిన మృతుని కుటుంబ సభ్యులకు అప్పగించి చేతులు దులుపుకున్నారు ఆసుపత్రి సిబ్బంది. మృతదేహాన్ని కనీసం చూడకుండానే అంత్యక్రియలు (Funerals)నిర్వహించారు ఎస్‌ఆర్‌నగర్ మృతుని కుటుంబ సభ్యులు. మైలార్‌దేవ్‌పల్లికి చెందిన పాండురంగాచారి కుటుంబ సభ్యులు మృతదేహం కోసం ఉస్మానియా మార్చురికి వెళ్లి అడగడటంతో అసలు విషయం బయటపడింది. దీంతో పాంగురంగాచారి కుటుబం సభ్యులు తమ కుటుంబ పెద్ద డెడ్‌బాడీని అప్పగించాల్సిందేనంటూ ఆసుపత్రి ముందు ఆందోళనకు దిగడంతో దుమారం చెలరేగింది.

శవాల్నే మార్చేశారు..

మృతదేహాల మార్పుపై పాండురంగాచారి కుటుంబ సభ్యులు తమ కుటుంబ సభ్యుడి డెడ్‌బాడీని అప్పగించాల్సిందేనంటూ పట్టుబట్టారు. దీంతో ఉస్మానియా మార్చురి సిబ్బందితో పాటు అధికారులు సైతం అంత్యక్రియలు నిర్వహించిన మృతదేహాన్ని వెలికితీసి అప్పగిస్తామని చెప్పడం విడ్డూరంగా ఉంది. తప్పును అంగీకరించినప్పికి పాండురంగాచారి కుటుంబ సభ్యుల ఆవేదన, ఆత్మసంతృప్తిని ఎలా తీర్చగలరని మరికొందరు ప్రశ్నిస్తున్నారు.

నిలువెత్తు నిర్లక్ష్యం..

బతికున్నప్పుడు సరైన వైద్యం చేయలేక ప్రాణాల్ని పొట్టనపెట్టుకుంటున్నారనే విమర్శలు ప్రభుత్వాసుపత్రి సిబ్బందిపై ఉన్నాయి. కనీసం చనిపోయిన తర్వాత శవాల్ని 48గంటల పాటు భద్రపరిచి కుటుంబ సభ్యులకు అప్పగించాలన్న ఇంగితజ్ఞానం లేకపోవడంపై మండిపడుతున్నారు. బంధువుల చివరి చూపుతో పాటు అంతిమ సంస్కారాలు నిర్వహించుకునే అదృష్టాన్ని కూడా రోగి కుటుంబ సభ్యులకు కల్పించకపోవడంపై పెద్దఎత్తున విమర్శలు ఎదుర్కొంటున్నారు. అయితే బతికుండగానే రోగుల్ని ఎలుకలకు అప్పగించే ప్రభుత్వ ఆసుపత్రి సిబ్బంది చనిపోయిన వాళ్ల మృతదేహాల్ని ఏమాత్రం భద్రంగా చూస్తారులే అని సామాన్య ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు  బాధ్యులైన సిబ్బంది దగ్గర నుంచి ఆసుపత్రి సూపరింటెండెంట్‌తో పాటు ఉద్యోగులపై కఠిన చర్యలు తీసుకుంటే ఇలాంటివి పునరావృతం కాకుండా ఉంటాయని అభిప్రాయపడుతున్నారు.

Published by:Siva Nanduri
First published:

Tags: Greater hyderabad, Hospitals

ఉత్తమ కథలు