• HOME
  • »
  • NEWS
  • »
  • TELANGANA
  • »
  • HYDERABAD SPECIAL POOJA AND HOMAM OFFER TO RECOVER FOR KCR FROM CORONA POSITIVE VS HYD

hyderabad: కేసీఆర్ పై అభిమానం.. త్వరగా కోలుకోవాలని హోమం..

hyderabad: కేసీఆర్ పై అభిమానం.. త్వరగా కోలుకోవాలని హోమం..

సీఎం కేసీఆర్ కోసం హోమం.

hyderabad: సీఎం కేసీఆర్ పై తమ అభిమానాన్ని నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున చాటుకుంటున్నారు. ఆయన త్వరగా కరోనా నుండి కోలుకోవాలని ప్రత్యేక పూజలు చేస్తున్నారు. అయితే తాజగా కొంతమంది ప్రత్యేక హోమాలు చేశారు.

  • Share this:
తెలంగాణ సీఎం కేసిఆర్‌ కరోనా పాజిటివ్ సోకిన విషయం తెలిసిందే..దీంతో ఆయన హోం ఐసోలేషన్‌లో ఉంటున్నారు. ఇందుకోసం రెండు రోజుల క్రితం సీఎం యశోద ఆసుపత్రిలో సైతం పరీక్షలు చేయించుకున్నారు. అయితే సీఎం కేసీఆర్ కు కరోనా సోకడంతో పార్టీ కార్యకర్తలు, నాయకులు , పెద్ద ఎత్తున ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షిస్తున్నారు. మరోవైపు కొంతమంది నాయకులు కార్యకర్తలు, పెద్ద ఎత్తున దేవాలయాల్లో ప్రత్యేక పూజలు కూడ చేస్తున్నారు.

ఇలా రోజు రాష్ట్ర వ్యాప్తంగా ఎక్కడో ఓ చోట పార్టీ అభిమానులు, కార్యకర్తలు, సీఎం త్వరగా కోలుకోవాలని దేవాలయాల్లో పూజలు చేస్తున్నారు. అయితే తాజాగా పార్టీ అభిమానులు, పార్టీ నాయకులు , కార్యకర్తలు , గ్రీన్ ఇండియా చాలెంజ్ సంస్థ కో ఫౌండర్ సభ్యులు అయిన రాఘవ , కిషోర్ గౌడ్‌లతో పాటు రాష్ట్ర్ర స్పోర్ట్స్ అధారిటి చైర్మన్ ఏ వెంకటేశ్వరెడ్డితో పాటు ఆయన కుటుంభ సభ్యులు నల్లకుంట పాత రామాలయం లో ఏకంగా సంజీవని మహా మృత్యుంజయం అనే హోమం నిర్వహించారు.
Published by:yveerash yveerash
First published: