International : మాకు బహుభర్తృత్వం కావాలి.. మహిళల సరికొత్త డిమాండ్...

International : మాకు బహుభర్తృత్వం కావాలి.. మహిళల సరికొత్త డిమాండ్.

International : చట్టబద్దంగా మగవాళ్లకు ఇద్దరు లేదా ముగ్గురు భార్యలు ఉన్నప్పుడు..మహిళలకు కూడా బహుభర్తృత్వం ఉండడం సాధ్యమేనా..? అయితే మాకు ఇలాంటీ వ్యవస్థ కావాలంటున్నారు దక్షిణాఫ్రికా మహిళలు...ఇందుకోసం ప్రతిపాదనలు కూడా ప్రభుత్వానికి పంపారు.. ప్రభుత్వం కూడా సీరియస్‌గా ఈ అంశంపై చర్చిస్తోంది..

  • Share this:
    ప్రాచీన కాలం నుండి నేటి ఆధునిక యుగం వరకు చట్టబద్దంగా బహుభార్యత్వం ప్రపంచవ్యాప్తంగా కొనసాగుతోంది. దీంతో కొన్ని దేశాల్లో ఏకంగా పదుల సంఖ్యలో భార్యలను మెయింటెన్‌ చేస్తున్నవారు ఉన్నారు. ఇది కూడా చట్టబద్దంగా ఆయా దేశాలు పురుషులకు కల్గించిన హక్కులు. ఈ హక్కులను ఉపయోగించుకుని ఓక్కొ మగాడు ముగ్గురు లేదా నలుగురు భార్యలను పెళ్లి చేసుకుంటున్నారు. దీంతో ఇక భారత్‌లో కూడా ఇదే పరిస్థితి కొన్ని మతాల్లో బహుభార్యత్వం కొనసాగుతోంది.

    కాని మారుతున్న ఆధునిక ప్రపంచలో మహిళలు అన్ని రంగాల్లో ముందుకు దూసుకుపోతున్నారు. ఏ రంగం చూసినా వారు పై చేయి సాధిస్తున్నారు. పురుషులతో సమానంగా అన్ని పనులు చేసి నిరూపిస్తున్నారు. ప్రతి భాద్యతను సమర్థవంతంగా నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పుడు భాద్యతలతో పాటు హక్కులు కూడా కావాలంటున్నారు దక్షిణాఫ్రికా మహిళలు..

    ఇందులో భాగంగానే ప్రపంచలో ఎక్కడా లేని విధంగా వారికి కూడా బహుభర్తృత్వం కావాలని డిమాండ్ చేస్తున్నారు. చట్టపరంగా ఈ అవకాశం కల్పించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.పురుషులు ఎక్కువ మంది మహిళలను పెళ్లీలు చేసుకుంటున్నప్పుడు, మహిళలకు మాత్రం ఎందుకు అవకాశం ఇవ్వరని నిలదీస్తున్నారు దక్షిణాఫ్రికాకు చెందిన మహిళలు, సామాజికవేత్తలు.

    అయితే దక్షిణాఫ్రికాలో ఇప్పటికే బహుభార్యత్వం, స్వలింగసంపర్కానికి చెందిన వివాహాలు చట్టపరంగానే ఉన్నాయి.దీంతో అక్కడి మహిళా సంఘాలు బహుభార్తృత్వాన్ని తీసుకురావాలని ప్రభుత్వాన్ని కోరాయి..ఇందుకోసం ప్రభుత్వానికి ప్రతిపాదనలు కూడా పంపాయి..విశేషం ఏమిటంటే సౌత్‌ఆఫ్రికా ప్రభుత్వం కూడా మహిళల ప్రతిపాదనలను చాలా సీరియస్‌గా చర్చిస్తున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ప్రభుత్వ పరంగా ఓ ఫైలును కూడా సిద్దం చేసినట్టు సమాచారం. వీరి ప్రతిపాదన కోసం ప్రజాభిప్రాయాన్ని కూడా తీసుకోవాలని నిర్ణయించింది.

    అయితే ఆ దేశ సంప్రాదాయవాదుల మాత్రం ఈ ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. దీంతో దేశ సంస్కృతి సర్వనాశనం అవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు.బహుభర్తృత్వం ద్వారా పిల్లలు పుడితే..తండ్రి ఎవరో ఎలా తెలుస్తుందని ప్రశ్నిస్తున్నారు. పుట్టబోయో పిల్లలు తండ్రిపేరును కాకుండా తల్లిపేరును స్వీకరిస్తారా అని నిలదీస్తున్నారు. బహుభార్యత్వం అనేది ఒక ఆచారమని , కాని బహుభర్తృత్వం అనేది సమాజం అంగీకరించదని చెబుతున్నారు. పిల్లలకు సంబంధించి తండ్రి ఎవరనేది తేల్చుకోవాలంటే డీఎన్‌ఏ పరీక్ష శరణ్యమని అంటున్నారు. పురుషాధిక్య సమాజంలో ఇది అమలు కాదని వాదిస్తున్నారు.

    అయితే మొత్తం మీద ప్రపంచ దేశాల్లో అంత్యంత సరళీకృత రాజ్యంగా విధానం ఉన్న దక్షిణాఫ్రికా ప్రభుత్వం మాత్రం దీనిపై క్షుణ్ణంగా పరీశీలన చేస్తున్నట్టు అక్కడి మీడియా కథనాలు వెలువరిస్తోంది. ఒకవేళ మెజారీటీ ప్రజల అభిప్రాయం ఇందుకు అనుకూలంగా వస్తే...బహుభర్తృత్వం వచ్చే అవకాశాలు ఉంటాయి..ఇది మొత్తం ప్రాచీన వ్యవస్థ నుండి ఆధునిక యుగ చరిత్రలో కీలక నిర్ణయం కానుంది. అయితే దీని పరిణామాలు ఎలా ఉంటాయో తెలియాలంటే ఆచరణతో సాధ్యమవుతుంది.
    Published by:yveerash yveerash
    First published: