Sonu Sood: హైదరాబాద్ లో సోనూసూద్.. జ్యూస్ అమ్మిన రియల్ హీరో.. వైరల్ గా మారిన వీడియో..

జ్యూస్ అమ్మిన సోనూసూద్ (Image:twitter)

Sonu Sood: రియల్ హీరో సోనూసూద్ గత కొన్ని రోజుల నుంచి కొత్త అవతారం ఎత్తాడు. పేదలకు అండగా నిలుస్తూ.. చిరు వ్యాపారులకు మద్దతుగా నిలుస్తున్నాడు. హైదరాబాద్ లో జ్యూస్ షాప్ ఓనర్ అవతారమెత్తి సందడి చేశాడు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    కరోనా మొదటి వేవ్ లో ఎంతో మంది వలస కార్మికులకు అండగా నిలిచాడు సోనూసూద్. సొంత డబ్బులను వెచ్చించి రవాణా సౌకర్యాలను కల్పించాడు ఈ రియల్ హీరో. అప్పటి నుంచి ఎంతో మందికి అండగా నిలస్తూ ఎంతో మంది గుండెల్లో దేవుడిగా నిలిచాడు. పేదల పాలిట ఆపద్బాంధవుడిలా మారాడు. కాగా, సోనూసూద్ కొద్దిరోజుల నుంచి కొత్త అవతారం ఎత్తాడు. మరిన్ని బాధ్యతలను నిర్వర్తిస్తున్నాడు. కరోనా కారణంగా తీవ్రంగా నష్టపోయిన చిరు వ్యాపారులకు మద్దతుగా నిలుస్తున్నాడు. రహదారుల వెంట దుకాణాలు నడుపుకునే చిరు వ్యాపారులకు నేనున్నానంటూ భరోసానిస్తున్నాడు. సైకిల్‌పై గుడ్లు, బ్రెడ్ తదితర తినుబంఢారాలను పెట్టుకొని అమ్మడం నుంచి పంజాబీ దాబా ద్వారా తందూరి రొట్టెలు అమ్మడం ప్రారంభించాడు.

    సోనూసూద్ దా పంజాబీ ధాబా.. ఇక్కడ దాల్.. రోటీ ఉచితమే అంటూ ఓ వీడియోను ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పంచుకున్నాడు. కరోనా కారణంగా తీవ్రంగా ఆ తర్వాత రిక్షా మీద గడ్డి తీసుకుని వెళ్తున్న ఓ వ్యక్తి కనిపించాడు. వెంటనే కారు దిగి స్వయంగా తనే రిక్షా తొక్కుకుంటూ వెళ్లాడు సోనూసూద్. ఇలా రోజుకొక చిర వ్యాపారులకు సోనూసూద్‌ అండగా నిలుస్తున్నాడు. ఈసారి జ్యూస్‌ షాప్‌ ఓనర్‌గా మారిపోయాడు. హైదరాబాద్ లో సందడి చేశాడు. బంజారాహిల్స్ రోడ్ నెంబర్3 లో రోడ్డు పక్కన ఉన్న జ్యూస్ షాపుకి వెళ్లి సర్‌ప్రైజ్ చేశాడు. ఆ షాపు నడిపే వ్యక్తితో సరదాగా మాట్లాడాడు. ఇక్కడ బత్తాయి జ్యూస్‌ ఫ్రీ అంటూ స్వయంగా జ్యూస్‌ తయారు చేసి అమ్మాడు.


    కొద్దిసేపు అక్కడే ఉండి చిరు వ్యాపారులను ఆదుకోవాలని కోరాడు. దానికి చెందిన వీడియోను ట్విటర్‌లో షేర్‌చేశాడు. ఇలా తనదైన స్టైల్‌లో చిరు వ్యాపారులకు సోనూ సపోర్టు చేస్తుండటంతో ఆయన చేసిన ఈ పనిపై మరోసారి సర్వత్ర ప్రశంసల వర్షం కురుస్తోంది. సోనూ రియల్ హీరో అని మరో సారి రుజువైందంటూ కామెంట్స్ చేస్తున్నారు. సోనూ నిజంగా దేవుండంటూ మరొకరు ట్వీట్ చేశారు. ఇలా ఎదో ఒక సందర్భంలో సోషల్ మీడియాలో సోనూ ప్రత్యక్షమవుతూ పేదలకు అండగా నిలుస్తున్నాడు. తాజా ఈ వీడియో వైరల్ అవ్వడంతో సోనూ మరోసారి తన పేదల పాలిట తన ఉదారతను చాటుకున్నాడని పొగడ్తల వర్షం కురిపిస్తున్నారు.
    Published by:Veera Babu
    First published: