హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: ఇండియాలోనే అతిపెద్ద మండి ప్లేట్.. లాంచ్ చేసిన సోనూసూద్

Hyderabad: ఇండియాలోనే అతిపెద్ద మండి ప్లేట్.. లాంచ్ చేసిన సోనూసూద్

అతిపెద్ద మండి ప్లేట్‌ను లాంచ్ చేసిన సోనూసూద్ (Image: Twitter)

అతిపెద్ద మండి ప్లేట్‌ను లాంచ్ చేసిన సోనూసూద్ (Image: Twitter)

Hyderabad: ఆదివారం హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న 'గిస్మత్ జైల్ మండి థీమ్ రెస్టారెంట్‌'లో (Gismath Jail mandi restaurant)... ఇండియాస్ బిగ్గెస్ట్ ప్లేట్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలీవుడ్ స్టార్ హీరో సోనూసూద్ హాజరయ్యారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

హైదరాబాద్‌ (Hyderabad)లో చికెన్ బిర్యానీ (Chicken Biryani) తర్వాత.. మండి (Arabian Mandi) కూడా అంతే ఫేమస్..! ఈ అరేబియన్ వంటకానికి హైదరాబాదీలు ఫిదా అవుతున్నారు. లొట్టలేసుకుంటూ పళ్లేలకు పళ్లాలు లాగిస్తున్నారు. అందుకే నగరంలో చాలా చోట్ల మండి రెస్టారెంట్లు కుప్పలు తెప్పలుగా ఏర్పాటువుతున్నాయి. కస్టమర్లను ఆకర్షించేందుకు వెరైటీ థీమ్‌లతో ముందుకొస్తున్నాయి. జైల్ థీమ్‌తో వచ్చిన 'గిస్మత్ మండి రెస్టారెంట్.. నాన్ వెజ్ లవర్స్‌ని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఫుడ్ లవర్స్‌కి మరింత చేరువయ్యేందుకు ఇప్పుడు సరికొత్త అట్రాక్షన్‌ను తీసుకొచ్చింది. అదే ఇండియాస్ బిగ్గెస్ట్ మండి ప్లేట్. మనదేశంలోనే అతి పెద్ద మండి ప్లేట్‌ను గిస్మత్ జైల్ రెస్టారెంట్ లాంచ్ చేసింది.

ఆదివారం హైదరాబాద్‌లోని కొండాపూర్‌లో ఉన్న 'గిస్మత్ జైల్ మండి థీమ్ రెస్టారెంట్‌'లో (Gismath Jail mandi restaurant)... ఇండియాస్ బిగ్గెస్ట్ ప్లేట్ లాంచ్ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బాలీవుడ్ స్టార్ హీరో సోనూసూద్ హాజరయ్యారు. తన చేతుల మీదుగా అతి పెద్ద మండి పళ్లేన్ని ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో ఆయనతో పాటు సినీ నటి, బిగ్ బాస్ ఫేమ్ హిమజ, పలువురు సోషల్ మీడియా సెలబ్రిటీలు హాజరయ్యారు. ఈ బిగ్గెస్ట్ మండి ప్లేట్‌ వ్యాసం 8 ఫీట్లు ఉంటుంది. ఒకేసారి 15 నుంచి 20 మంది భోజనం చేయవచ్చు. ఈ ప్లేట్‌లో భోజనం ఆర్డర్ చేసే వారికి.. అన్ లిమిటెడ్ చికెన్, మటన్ వంటకాలను అందిస్తారు.

ఈ సందర్భంగా మాట్లాడిన సోనూసూద్.. ''విభిన్న ఆహార రుచులకు హైదరాబాద్ కేరాఫ్‌గా నిలుస్తుండడం చాలా సంతోషంగా ఉంది. భోజన ప్రియులకు రకాల వంటకాల రుచులను అందించేందుకు గిస్మత్ జైల్ మండి థీమ్ రెస్టారెంట్ వారు వినూత్నంగా ఆలోచించి. ఇండియాస్ బిగ్గెస్ట్ ప్లేట్ లాంచ్ చేయడం అభినందనీయం. '' అని అన్నారు. తమ రెస్టారెంట్‌కు వచ్చి అతి పెద్ద మండి పళ్లేన్ని ఆవిష్కరించినందుకు సోనూసూద్‌కు గిస్మత్ జైల్ మండి థీమ్ రెస్టారెంట్ ఓనర్స్ ధన్యవాదాలు తెలిపారు. కస్టమర్ల కోరిక మేరకే దీనిని ప్రారంభించినట్లు వెల్లడించారు.

First published:

Tags: Hyderabad, Local News, Sonu Sood, Telangana

ఉత్తమ కథలు