Techie Turned Farmer: రైతుగా మారిన సాఫ్ట్ వేర్ ఇంజనీర్.. ఏడాది ఆదాయం ఎంతో తెలుసా..?

మల్లికార్జున్ (ఫైల్)

అతనో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ (Soft ware Engineer).. కానీ జాబ్ వదిలి పొలంబాట పట్టాడు. ఏసీలో జాబ్ వదిలి ఎండలో కష్టపడాలని వారు నిర్ణయించుకోవడానికి ఒక బలమైన కారణముంది.

 • Share this:
  M.బాలకృష్ణ, హైదరాబాద్ ప్రతినిధి, న్యూస్18

  అతనో సాఫ్ట్ వెేర్ ఉద్యోగి.. నెలతిరిగే సరికి లక్షల్లో జీతం వస్తుంది. అతని భార్య ఎంబీఏ చదివారు. హైక్లాస్ లైఫ్. పెద్దగా చెమటోడ్చాల్సిన పనిలేదు. కానీ వారు మాత్రం సాఫ్ట్ వేర్ జీవితాన్ని వదిలేసి సేద్యాన్ని నమ్ముకున్నారు. సాఫ్ట్ వేర్ జాబ్ ను తలదన్నేలా ఆదాయాన్ని గడిస్తున్నారు. బోనస్ గా అవార్డులు కూడా సాధిస్తున్నారు. ఐతే ఏసీలో జాబ్ వదిలి ఎండలో కష్టపడాలని వారు నిర్ణయించుకోవడానికి ఒక బలమైన కారణముంది. వివరాల్లోకి వెళ్తే.., తెలంగాణలోని పెద్ద కుర్మపల్లికి చెందిన మల్లికార్జున్ హైదరాబాద్  (Hyderabad) సాఫ్ట్ వేర్ ఇంజనీర్ (Software Engineer) గా పనిచేస్తున్నారు. మంచి జీతం కావడంతో డబ్బుకు ఎలాంటి లోటు లేదు. కానీ ఓ ఘటన ఆయన జీవితాన్ని మలుపు తిప్పింది. 2014లో మల్లికార్జున్ రెడ్డి సమీప బంధువు ఒకరు క్యాన్సర్ కారణంగా చనిపోయారు. ఇది తెలుసుకున్న మల్లికార్జున్ మునుపటితరాలలో క్యాన్సర్ గురించి లోతుగా అధ్యయనం చేయడం ప్రారంభించాడు. వారి పూర్వీకుల్లో అసలు క్యాన్సర్ లేదు కానీ ఇతనికి మాత్రం ఎలా వచ్చిందా..? అని శోధించాడు. కెమికల్స్ తో కూడిన కూరగాయలు, ఆహార పదార్ధాలు తినడమే క్యానర్స్ కు కారణమని కనుగొన్నాడు.

  అంతే అనారోగ్యానికి కారణమైయ్యే కలుషిత ఆహార అలవాట్లు మార్చుకోవాలని సంకల్పించాడు. తానే రైతుగా మారాలని సేంద్రియ వ్యవసాయాన్ని ప్రారంభించాలని నిశ్చయించుకున్నాడు. ఇందుకు భార్య సాధ్య కూడా సరే అనటంతో పెద్దలు ఇచ్చిన 13 ఎకరాల భూమిలో సేంద్రియ వ్యవసాయాన్ని ప్రారభించాడు. ప్రస్తుతానికి ఈ జంట రసాయనరహిత సేంద్రియ వ్యవసాయం ద్వారా 26 రకాల వరి., కూరగాయలు, ఔషధ మొక్కలు పెంచుతున్నారు. మల్లికార్జున్ ప్రయత్నానికి ఇండియన్ కౌన్సిల్ అఫ్ అగ్రికల్చర్ రీసర్చ్ అవార్డును గెలుచుకున్నారు. ఈ ఘనత సాధించిన మొట్టమొదటి రైతుగా మల్లికార్జున్ నిలిచారు. అంతేకాదు ఇంకో 8 అవార్డులను సైతం కైవసం చేసుకున్నారు.

  ఇది చదవండి: మీరు తినే కూరగాయలు మంచివేనా..? కల్తీ జరిగిందా..? లేదా..? ఇలా తెలుసుకోండి..


  కేవలం అతను సేంద్రియ వ్యవసాయం చేసినందుకే ఈ అవార్డులు రాలేదు. దీనికి తోడు సేంద్రియ పద్ధతుల్లో వ్యవసాయ రంగంలో నూతన పద్ధతులు ప్రవేశ పెట్టినందుకు వరించాయి. మొదట మల్లి కార్జున్ చిన్న పాటి భూమిలో వ్యవసాయం చేయడం మొదలెట్టాడు. సేంద్రియ వ్యవసాయంలో తన ప్రయోగాలు చేస్తూ మెల్లగా సాగును విస్తరింప చేసాడు. వరి., ఆవుపాలు, అల్లం, నువ్వులు, వేరు శెనగ, ఆకుకూరలతో పాటుగా ఇతర పండ్ల, కూరగాయ మొక్కలు, ఔషధ మొక్కలు పెంచుతున్నాడు. ఆలా అయన వ్యవసాయ భూమితో పాటు 20 ఎకరాలకు పైగా లీజుకు తీసుకోని విస్తరింపజేశాడు. ఇలా ఏడాదికి 16 లక్షలకు పైగా ఆదాయాన్ని చూస్తున్నాడు.

  ఇది చదవండి: రోజూ నాలుగు యాలుకలు నోట్లో వేసుకుంటే కలిగే 10 ప్రయోజనాలు ఇవే


  దీనిపై మల్లికార్జున్ స్పందిస్తూ "మేము మా పిల్లలకు సురక్షితమైన మరియు ఆరోగ్యకరమైన ఆహారాన్ని అందించాలనుకుంటున్నాము. యాదృచ్ఛికంగా, అదే సమయంలో నా భార్య గర్భవతి కావడంతో సేంద్రియ చేయాలని దృఢసంకల్పించాం. నేను ఒక సీజన్‌లో ఎకరానికి 42 క్వింటాళ్ల బియ్యాన్ని పండిస్తాను, ఇది సాంప్రదాయ పద్ధతుల ద్వారా పెరిగిన సగటు దిగుబడి కంటే 10-12% ఎక్కువ. నేను సాధారణ రైతు విత్తనాలను నాటేలా నాటను. నేను వాటిని నేరుగా విత్తుతాను. ఇది నాటడానికి అవసరమైన విత్తనాల సంఖ్యను తగ్గించడంలోను, వాటి మధ్య దూరాన్ని తగ్గించడంలో సహాయపడుతుంది. సాంప్రదాయ పద్ధతిలో ఎకరాకు 25 కిలోల విత్తనాలు అవసరం, అయితే నేరుగా విత్తడానికి 5 కిలోలు అవసరం ఉంటుంది. ఈ పద్ధతి మొక్కలకు పోషణ మార్పిడి మరియు అనుబంధ పెరుగుదలకు సహాయపడుతుంది. వర్షపు నీటిని నిల్వ చేసే చెరువులో 600 చేపల పెంపకానికి నేను ఆక్వాకల్చర్‌ను కూడా ప్రారంభించాను. గొర్రెలు, కోడి, మేక మరియు ఇతర పశువులు వాటి వ్యర్థాల నుండి పంటలకు సహజ పోషకాలను అందిస్తాయి. నేను జీవామృతం, వేప వంటి సేంద్రీయ ఎరువులు మరియు ఇతర సారూప్య మార్గాలను నేలలో సారవంతం మెరుగుపరచడానికి మరియు సంక్రమణను నివారించడానికి ఉపయోగిస్తాను”అని చెప్పారు.
  Published by:Purna Chandra
  First published: