హైదరాబాద్‌లోని (Hyderabad) మియాపూర్ పోలీస్ స్టేషన్ (Miyapur Police station) పరిధిలో ఓ సాఫ్ట్‌వేర్ ఉద్యోగి (Software employee) మృతి పలు అనుమానాలకు తావిస్తోంది. సందీప్ అనే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి మియపూర్ దీప్తిశ్రీనగర్‌లో నివాసం ఉంటున్నాడు. తాను నివాసం ఉంటున్న బిల్డింగ్ ఆరో అంతస్తు నుంచి సందీప్ కిందపడిపోయాడు. బిల్డిండ్ పై నుంచి పడ్డ సందీప్‌కు తీవ్ర రక్తస్రావం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు (Died). అయితే అతని ల్యాప్ ట్యాప్ (Laptop) కూడా పైనుంచి కిందపడి ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇది హత్యా? ఆత్మహత్యా? లేదా ప్రమాదవశాత్తు పడిపోయాడా అనేది తెలియడం లేదు. దీనికి సంబంధించి సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. సందీప్ మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం గాంధీ హాస్పిటల్‌కు తరలించారు. ఈ ఘటనకు సంబంధించి కేసు నమోదు చేసుకుని అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నట్టుగా మియాపూర్ (Miyapur) పోలీసులు తెలిపారు.
గతంలోనూ హైదరాబాద్‌లో..
గతంలోనూ హైదరాబాద్‌లో ఇలాంటి ఘటనలే జరిగాయి. ఓ యువకుడు అనుమానాస్పదస్థితిలో మృతి చెందాడు. మూడంతస్తుల భవనం పైనుంచి పడి యువకుడు మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ సంఘటన పేట్‌బషీరాబాద్ పీఎస్ పరిధిలో జరిగింది. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ మెషావాడకు చెందిన అప్పారావు కుమారుడు థామ్స్(25) జీడిమెట్ల వెంకటేశ్వరా ఎన్‌క్లేవ్‌లోని రాజరాజేశ్వరీ వసతి గృహంలో ఏడు నెలలుగా నివాసముంటున్నాడు. స్థానికంగా ఏసీ మెకానిక్‌గా పని చేస్తున్నాడు. రాత్రి బయట నుంచి కర్రీ, కల్లు తెచ్చుకుని, వసతి గృహంలో భోజనం తీసుకుని గదిలోకి వెళ్లాడు. కొద్ది సేపటికి మూడో అంతస్తుపై నుంచి కిందపడి మృతి చెందాడు.
హాస్టల్ యాజమాన్యం ఇచ్చిన సమాచారంతో ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ప్రమాదవశాత్తు జరిగిందా..? మరేదైనా కారణం ఉందా..? అనే కోణంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.
మియాపూర్ పరిధిలో..
గతంలో ఇదే మియాపూర్‌లో ఇలాంటి ఘటనే జరిగింది. అప్పటి వరకూ కళ్ల ముందున్న బాలుడు క్షణాల వ్యవధిలో కన్నుమూసిన విషాదమిది. భవనంపై నుంచి జారిపడి ఓ పదేళ్ల బాలుడు మృతి చెందిన హృదయ విదారక ఘటన మియాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో కొన్ని రోజుల కిందట చోటు చేసుకుంది. సుఖేందర్ (10) స్థానిక ఓ పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. కరోనా కారణంగా ఇంటి వద్ద ఉంటూ ఆన్లైన్ క్లాసులకు హాజరవుతున్నాడు. బుధవారం ఉదయం తండ్రి విధులకు బయలుదేరుతుండగా తల్లి వంట చేస్తున్న సమయంలో సుఖేందర్ తాము నివాసముంటున్న ఇంటి బాల్కనీ నుంచి జారి కిందకు పడటంతో తల, గుండెకు బలమైన గాయాలయ్యాయి. తొలుత మెరుగైన వైద్యం కోసం మరో ఆస్పత్రికి తరలిస్తుండగానే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Software employee suicide, Software emplye killed