HYDERABAD SOFTWARE EMPLOYEE COMMITS SUICIDE IN HYDERABAD FOR DOWRY HARASSMENT SNR
Software suicide:పెళ్లైన ఏడాది నుంచి మొగుడిలో ఆ కక్కూర్తిని భరిస్తూ వచ్చింది..వేరే దారిలేక
( కట్నం వేధింపులకు బలి)
Hyderabad:ఇచ్చిన కట్నం చాలలేదని కట్టుకున్న భార్యను అదనపు కట్నం కోసం వేధించాడో వ్యక్తి. భర్త పెట్టే టార్చర్ భరించలేకపోయిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని హైదరాబాద్‌లోని పుట్టింటికి వచ్చి సూసైడ్ చేసుకుంది.
కోట్లలో కట్నం ఇస్తున్నా..లక్షల్లో జీతం తెచ్చే అమ్మాయిని ఇచ్చి కల్యాణం జరిపిస్తున్న వరకట్న పిశాచులు మాత్రం మారడం లేదు. ఏడాది క్రితం పెళ్లి చేసుకొని అత్తారింటికి వచ్చిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని మెట్టినింటి వరకట్న వేధింపులు, భర్త పెట్టే టార్చర్ భరించలేక ప్రాణాలు తీసుకుంది. అత్యంత విషాదకరమైన ఘటన హైదరాబాద్(Hyderabad)కూకట్పల్లి(Kukatpalli)లో చోటుచేసుకుంది. రాజన్న సిరిసిల్ల(Rajanna Sirisilla)జిల్లాకు చెందిన జూపల్లి శ్రీనివాసరావు (Jupally Srinivasa Rao)ఫ్యామిలీ చాలా రోజుల క్రితమే హైదరాబాద్‌లో సెటిలైంది. ప్రైవేట్ జాబ్ చేస్తున్న శ్రీనివాసరావు తన పెద్ద కుమార్తె నిఖిత(Nikhita)ను సిరిసిల్ల టౌన్‌కి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి చేటి ఉదయ్‌కుమార్(Udayakumar)కి ఇచ్చి గతేడాది జూన్ 6వ తేదిన గ్రాండ్‌గా మ్యారేజ్(Marriage)చేశారు. పెళ్లి సమయంలో అల్లుడు అడిగినట్లుగా 10లక్షల క్యాష్తో పాటు 35తులాల నగలను కుమార్తె వివాహాం సందర్భంగా కట్న,కానుకల రూపంలో ముట్టజెప్పారు. పెళ్లైన కొద్ది రోజులకే నిఖితను భర్త ఉదయ్ సిరిసిల్లలో ఉన్న 4.25ఎకరాల భూమిలో సగం తన పేరుతో రాయించాలని పట్టుబట్టాడు. అదే విషయంపై తరచూ భార్య నిఖితతో గొడవపడేవాడు. ఊళ్లో భూమి తన తదనంతరం మీకే చెల్లుతుందని..ఇప్పుడు ఇవ్వనని శ్రీనివాసరావు తెగేసి చెప్పడంతో ఉదయ్ వరకట్న పిశాచిగా మారిపోయాడు. నిత్యం భార్యతో ఇదే విషయంపై రాద్ధాంతం చేసేవాడు. అతనికి తోడుగా అత్తమామలైన అశోక్‌రావు(Ashokrao), శ్యామల(Shyamala), మరిది ఉపేందర్(Upender)సైతం నిఖితను అదనపు కట్నం కోసం ఒత్తిడి చేయడం మొదలుపెట్టారు. మెట్టినింట్లో అదనపు కట్నం తీసుకురమ్మని టార్చర్ పెడుతూ వచ్చారు. అల్లుడి బాధ బరించలేకపోయిన శ్రీనివాసరావుకు మరో 10లక్షలు ఇచ్చాడు. అయినప్పటికి తీరు మారలేదు సరికదా టార్చర్ మరింత పెరిగింది. మెట్టినింట్లో పరిస్థితి ఈ విధంగా ఉండటంతో నిఖిత ఉగాది రోజున కూకట్‌పల్లిలో ఉంటున్న తల్లిదండ్రులకు దగ్గరకు వచ్చింది.
వరకట్న పిశాచులు..
నిఖిత పుట్టింటికి వచ్చినప్పటికి ఉదయ్ ఫోన్లో అదనపు కట్నం కోసం తిడుతూ ఉండేవాడని తల్లిదండ్రులు తెలిపారు. ఫోన్ ఎత్తకపోతే ఆమె సోదరి నీతకు ఫోన్ చేసి మరీ బూతులు తిట్టేవాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. అదనపు కట్నం కోసం డిమాండ్ చేస్తున్న ఉదయ్ ఈనెల 20న సిరిసిల్ల నుంచి హైదరాబాద్ కూకట్‌పల్లిలోని బాలకృష్ణనగర్‌లో ఉంటున్న నిఖిత పేరెంట్స్ ఇంటికి వచ్చాడు. భార్య, అత్త,మామలతో గొడవపడ్డాడు. అదే సమయంలో నిఖిత మెడలో మంగళసూత్రం తెంచి కొట్టాడని తెలుస్తోంది.
పెళ్లై ఏడాది గడవక ముందే..
అదనపు కట్నం కోసం భర్త తనను కొట్టడం తల్లిదండ్రుల పరువు తీయడంతో నిఖిత తీవ్ర మనస్తాపానికి గురైంది. అదే రోజు రాత్రి తన బెడ్రూమ్లోని ఫ్యాన్‌కి ఉరివేసుకొని ప్రాణాలు తీసుకుంది. అర్ధరాత్రి వరకు గదిలోంచి బయటకురాకపోవడంతో నిఖిత పేరెంట్స్ తలుపులు తెరిచి చూడటంతో ఫ్యాన్‌కి వేలాడుతూ కనిపించింది. తమ బిడ్డ చావుకు కారణమైన ఉదయ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.