HYDERABAD SOFTWARE EMPLOYEE ARRESTED FOR HARASSING MARRIED WOMAN THROUGH SOCIAL MEDIA IN HYDERABAD SNR
Crime News: అరాచకుడిగా మారిన సాఫ్ట్వేర్ ఎంప్లాయ్ ..సోషల్ మీడియా ద్వారా వివాహితకు టార్చర్
(Photo Credit:Twitter)
Hyderabad: ఆడవాళ్లు సోషల్ మీడియాకు ఎంత ఎక్కువ దూరం ఉంటే అంత మంచిది. అక్కడ ఏర్పడే పరిచయాలను అడ్డుపెట్టుకొని కొందరు పోకిరీగాళ్లు వెదవ వేషాలు వేస్తున్నారు. చెంగిచెర్లలో వివాహితను ఇదే విధంగా టార్చర్ పెట్టిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగిని పోలీసులు గుర్తించి జైలుకు పంపారు.
ప్రేమ పేరుతో అమ్మాయిలను వేధించే వాళ్లు కొంతమంది ఉంటే ...కనిపించకుండా సోషల్ మీడియా(Social media)ను అడ్డుపెట్టుకొని ఆడవాళ్లను మానససీకంగా ఇబ్బందులకు గురి చేస్తున్న వాళ్లు ఇంకొందరు. టెక్నాలజీని అడ్డుపెట్టుకొని కొందరు తప్పించుకుంటుంటే..ఇంకొందరు చేసిన తప్పే చేస్తూ పోలీసులకు చిక్కుతున్నారు. హైదరాబాద్(Hyderabad) రాచకొండ కమిషనరెట్ పరిధిలోని చెంగిచెర్ల(Chengicherla)లో ఉంటున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి (Software employee)మూడెత్తుల ప్రశాంత్(Prashanth) అనే యువకుడు సోషల్ మీడియాను అడ్డుపెట్టుకొని ఓ వివాహితను టార్చర్ పెట్టాడు. bhavii_098 ఐడీతో ఇన్స్టాగ్రామ్(Instagram)ద్వారా ఓ వివాహిత ప్రొఫైల్ చూసి ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. బాధితురాలు యాక్సెప్ట్ చేయడంతో గతంలో ఆమె సోషల్ మీడియాలో చేసిన పోస్ట్‌ల ద్వారా వాట్సాప్ నెంబర్(WhatsApp number)సేకరించాడు ప్రశాంత్. ఆ విధంగా వాట్సాప్‌లో ఆమెతో చిన్ననాటి స్నేహితుడి పేరుతో చాటింగ్ చేశాడు.
వివాహితను వేధించిన ఇడియట్..
బాధిత మహిళ తనకు పరిచయమున్న వ్యక్తిగా భావించింది. ప్రశాంత్ ఒకరోజు ఆమెకు ఇన్స్టాగ్రామ్ ద్వారా వీడియోకాల్ చేశాడు. ఆమె కాల్ లిఫ్ట్ చేయడంతో వెంటనే తన ముఖం కనిపించకుండా ప్రైవేట్ పార్ట్స్ చూపిస్తూ వాటిని రికార్డ్ చేసి స్క్రీన్ షాట్స్ తీశాడు. వెంటనే ఆ తర్వాత బాధితురాలి ఇన్స్టాగ్రామ్ అకౌంట్ హ్యాక్ చేసి అందులోని ఫోటో, పేరుతో ఫేక్ అకౌంట్ ఓపెన్ చేశాడు. ఆ అకౌంట్ నుంచి స్నేహితులకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పంపాడు. యాక్సెప్ట్ చేసిన వాళ్లందరికి బాధితురాలితో వీడియో కాల్ చేసిన అసభ్యకరమైన వీడియోతో పాటు స్క్రీన్ షాట్ చేసిన ఫోటోలను పంపుతూ వచ్చాడు. ఈ మొత్తం ప్రాసెస్‌లో బాధితురాలికి డౌట్ రాకుండా పోలీసులకు చిక్కుండా తెలివిగా తప్పించుకున్నాడు ప్రశాంత్. అగ్లీ వీడియోలు షేర్ చేసిన తర్వాత ఇన్స్టాగ్రామ్ ప్రొఫైల్ ఐడీ, జీమెయిల్ ఐడీని డిలీట్ చేశాడు.
సోషల్ మీడియా ద్వారా టార్చర్..
ప్రశాంత్ ఫేక్ ఐడీ ద్వారా పంపిన వీడియో, ఫోటోలు వేరే వ్యక్తులకు వెళ్లడం..ఆ విషయం బాధితురాలికి తెలియడంతో ఇదంతా చేస్తున్నది ఎవరో అర్ధం కాక తీవ్ర మనోవేదనకు గురైంది. సోషల్ మీడియా ద్వారా ఇంతటి అరాచకానికి పాల్పడిన వ్యక్తి ఎవరో గుర్తించాలని బాధితురాలి భర్త రాచకొండ పోలీసులను ఆశ్రయించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సాంకేతిక బృందం ద్వారా ప్రశాంత్ డిటెయిల్స్ రాబట్టారు. నిందితుడు కరీంనగర్ జిల్లా కాల్వశ్రీరాంపూర్‌కి చెందిన ప్రశాంత్‌గా గుర్తించారు. నిందితుడు హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో జాబ్ చేస్తున్నాడని తెలిపారు. ప్రశాంత్‌ని మంగళవారం అతడ్ని అరెస్ట్ చేశారు. అతని దగ్గరున్న సెల్‌ఫోన్, సిమ్‌కార్డ్‌ను స్వాధీనం చేసుకున్నారు. జుడిషియల్ రిమాండ్‌కు తరలించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.