గోవా నుంచి హైదరాబాద్ వస్తున్న స్పైస్ జెట్ క్యూ400 ఎయిర్క్రాఫ్ట్ VT-SQB కు తృటిలో పెను ప్రమాదం తప్పింది. ఎయిర్ పోర్టులో ల్యాండ్ కాబోయే కొద్ది నిమిషల్లోనే విమానం నుంచి పొగలు వచ్చాయి. దీనితో ప్రయాణికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. పొగలు రావడాన్ని గమనించిన ఫైలట్ అప్రమత్తమై ఎయిర్ కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించారు. దీనితో అత్యవసర ల్యాండింగ్ అయ్యేందుకు అనుమతి ఇచ్చారు. ఫైలట్ చాకచక్యంగా వ్యవహరించి హైదరాబాద్ లోని శంషాబాద్ విమానాశ్రయంలో బుధవారం సాయంత్రం 11 గంటల సమయంలో జాగ్రత్తగా ల్యాండ్ అయింది.
@narendramodi @PMOIndia @flyspicejet @PilotSpicejet @SpiceJetRBLX @JM_Scindia Respected sir or to whomsoever it may concern. Night we were returning to hyd from goa within the ✈️ (Spicejet),suddenly there was smoke all around inside the plane starting from nagpur to hyderabad... pic.twitter.com/zZa9OUmJib
— Srikanth Mulupala (@SrikanthMulupal) October 13, 2022
కాగా ప్రమాద సమయంలో విమానంలో 86 మంది ఉన్నట్లు తెలుస్తుంది. స్పైస్ జెట్ ల్యాండింగ్ అనంతరం 9 విమానాలను దారి మళ్లించినట్టు తెలిపారు. ఆ 9 విమానాల్లో 6 డొమెస్టిక్ కాగా, 2 అంతర్జాతీయ, ఒక కార్గో విమానం ఉన్నట్లు తెలుస్తుంది. కాగా ఈ ప్రమాదం నుండి ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారని DGCA తెలిపింది. ఒకవేళ పొగలు రగిలి మంటలు అంటుకుంటే భారీ ప్రమాదం చోటు చేసుకునేది. కాగా పొగలు రావడానికి సాంకేతిక కారణమా లేక మరేదైనా లోపమా అనే కోణంలో అధికారులు పరిశీలిస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad news, Shamshabad Airport