సికింద్రాబాద్(Secunderabad)స్వప్నలోక్ కాంప్లెక్స్(Swapnalok complex)లో గురువారం జరిగిన భారీ అగ్నిప్రమాదంలో ఆరుగురు మృతి(Six died ) చెందారు.భారీగా ఆస్తినష్టం సంభవించింది. సాయంత్రం సుమారు 7గంటల ప్రాంతంలో కాంప్లెక్స్‌లోని 8వ అంతస్తులో అంటుకున్న మంటలు నిమిషాల వ్యవధిలోనే 5,6,7 అంతస్తులకు వ్యాపించాయి. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న ప్రభుత్వ సిబ్బంది, ఫైర్ సిబ్బంది హుటాహుటిన స్పాట్‌కు చేరుకున్నారు. ఫైర్ ఇంజన్ల సాయంతో మంటలు ఆర్పేందుకు 15ఫైరింజన్ల (Firenjans)సాయంతో మంటల్ని కంట్రోల్ చేశారు. ఈ మొత్తం ప్రమాదంలో ఫైర్ సిబ్బంది 12మందిని కాపాడగా ..ఆరుగురు ప్రాణాలు విడిచారు. స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో ఫైర్ యాక్సిడెంట్‌లో చనిపోయిన వాళ్లలో కాల్ సెంటర్‌లో పని చేస్తున్న నలుగురితో పాటు మరో ఇద్దరు ఉన్నారు.
కాంప్లెక్స్‌లో కలవరం..
సికింద్రాబాద్ దక్కన్‌మాల్‌లో ఫైర్ యాక్సిడెంట్ జరిగిన కొద్ది రోజులకే అంతకంటే ఘోర అగ్నిప్రమాదం మరొకటి అదే ప్రాంతంలో జరిగింది. సికింద్రాబాద్ స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో గురువారం రాత్రి మంటలు ఎగసిపడ్డాయి. 8వ అంతస్తులో రాజుకున్న మంటలు నిమిషాల్లోనే 5,6,7 అంతస్తులకు వ్యాపించడంతో ప్రమాద తీవ్రత పెరిగింది. స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో ఫైర్ సిబ్బంది సహాయకచర్యలు చేపట్టారు. సుమారు 15ఫైరింజన్లతో మంటలు అదుపుచేసేందుకు మూడు గంటల పాటు శ్రమించారు. విషయం తెలుసుకున్న మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఘటనా స్థలానికి చేరుకున్నారు. సహాయక చర్యలను దగ్గరుండి మరీ పర్యవేక్షించారు.
Telangana | Huge fire broke out in Swapnalok Complex in Secundrabad, fire engine rushed to the spot. Around 7:30pm a fire broke out due to a short circuit, we are trying to rescue people who are stuck inside, and so far we don't know how many are stuck. Fire engines have rushed… https://t.co/EXKpCpvKbf pic.twitter.com/x5Uv0qNgWN
— ANI (@ANI) March 16, 2023
కింద నుంచి వెళ్లిన అగ్గిరవ్వ..
అయితే కింద నుంచి ఒక మంట రాకెట్‌లా కాంప్లెక్స్‌లోకి దూసుకెళ్లడం చూశామని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఈదుర్ఘటనలో మంటల్లో చిక్కుకొని హాహాకారాలు చేస్తున్న 12మందిని ఫైర్ సిబ్బంది కాపాడగలిగారు. ఈ అగ్ని ప్రమాదంలో ఆరుగురు మృతి చెందారు. వాళ్లంతా ఐదో అంతస్తులోని కాల్ సెంటర్‌లో పని చేస్తున్నట్లుగా గుర్తించారు.మృతులంతా 20 నుంచి 24 ఏళ్లలోపు వారేనని పోలీసులు తెలిపారు. దట్టమైన పొగ పీల్చడం వల్ల ఊపిరి ఆడక చనిపోయారు. గాంధీ ఆసుపత్రికి తరలించినప్పటికి ప్రయోజనం లేకపోయింది. మంటలు అంటుకోవడానికి గల కారణాలు తెలియాల్సి ఉందని మంత్రి తలసాని తెలిపారు.
Fire engines have rescue teams have reached the spot & have controlled fire. There are still 5-6 people stuck in a room inside the building. Rescue teams are using iron rods to break the wall & rescue everyone inside, so far they have brought 11 people down: Minister Talasani… https://t.co/JbE52LMrHo pic.twitter.com/9vdl5PLY5P
— ANI (@ANI) March 16, 2023
సినిమా స్టైల్లో రెస్క్యూ..
స్వప్నలోక్ కాంప్లెక్స్‌లో రాజుకున్న అగ్గిమంటలు కంట్రోల్ చేయడానికి లోపల చిక్కుకున్న వారిని సేఫ్‌గా బయటకు తీసుకురావడానికి పోలీసులు, ఫైర్ సిబ్బంది, డీఆర్ఎఫ్ బృందాలు విస్తృతంగా ప్రయత్నించారు. వర్షం పడుకుంటే కూడా క్రేన్ సాయంతో ఐరన్ గ్రిల్స్‌ను సిబ్బంది తొలగించారు.చాలా మంది బయటకు వచ్చేసినప్పటికీ.. దాదాపు 16 మంది లోపలే చిక్కుకుపోయారు. అగ్నిమాపక సిబ్బంది స్కై లెవల్ క్రేన్‌తో భవనంలో చిక్కుకున్న వారిని కిందకు దించారు. పలు అంతస్తుల్లో ఉన్న అద్దాలు పగులగొట్టారు. చుట్టుపక్కల నివాసాల్లో ఉన్నవారిని ఖాళీ చేయించారు.
పాతికేళ్లలోపు వారే..
ఈ ప్రమాదంలో మరణించిన ఆరుగురినీ కాల్ సెంటర్‌లో పనిచేస్తున్న త్రివేణి, శ్రావణి, వెన్నెల, ప్రమీల, శివ, ప్రశాంత్‌గా గుర్తించారు. వీరిలో ప్రశాంత్ అపోలో ఆస్పత్రిలో మరణించగా.. మిగతా ఐదుగురూ గాంధీ ఆస్పత్రిలో మరణించారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Fire Accident, Secunderabad, Telangana News