ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తుపై తెలంగాణ సిట్ (Special Investigation Team) అధికారులు స్పీడ్ పెంచారు. నేడు కేరళ (Kerala)కు వెళ్లిన సిట్ అధికారులు తుషార్ (Tushar), జగ్గుస్వామి (Jagguswami)లకు మరోసారి నోటీసులు అందజేశారు. తుషార్ (Tushar) ఇంటికి వెళ్లిన ఆఫీసర్లు విచారణకు హాజరు కావాలని నోటీసులు ఇచ్చారు. ఇక కొచ్చిలో జగ్గుస్వామి (Jagguswami) నివాసానికి చేరుకున్న అధికారులు అతనికి నోటీసులు అందజేశారు. కాగా గతంలో కూడా ఈ ఇద్దరికీ సిట్ (Special Investigation Team) అధికారులు నోటీసులు ఇచ్చిన విషయం తెలిసిందే.
గతంలో కూడా నోటీసులు..
ఈ కేసుకు సంబంధించి గతంలో కూడా బీజేపీ నేత BL సంతోష్, తుషార్, జగ్గుస్వామిలకు సిట్ (Special Investigation Team) అధికారులు నోటీసులు ఇచ్చారు. కానీ వారు విచారణకు మాత్రం హాజరు కాలేదు. ఆ నోటిసులు ఇచ్చిన సమయంలో సంతోష్ గుజరాత్ ప్రచారంలో ఉండడంతో విచారణకు రాలేనని చెప్పారు. కానీ తుషార్, జగ్గుస్వామి (Jaggu swami) మాత్రం సిట్ నోటిసులపై స్పందించలేదు. దీనితో అధికారులు తుషార్, జగ్గుస్వామి (Jaggu swami) లపై సిట్ (Special Investigation Team) లుకౌట్ నోటీసులు ఇచ్చారు.
హైకోర్టుకు జగ్గుస్వామి..
తనకు ఇచ్చిన 41-A CRPC, లుకౌట్ నోటీసులపై స్టే ఇవ్వాలని జగ్గుస్వామి (Jaggu swami) పిటిషన్ దాఖలు చేశారు. తనకు ఈ కేసుకు సంబంధం లేదని, అక్రమంగా నన్ను ఇరికించారని జగ్గుస్వామి (Jaggu swami) పిటీషన్ లో పేర్కొన్నారు. ఈ పిటీషన్ పై సోమవారం హైకోర్టు విచారణ చేపట్టనుంది. రామచంద్రభారతికి (Rama chandra bharathi), తుషార్ కు కేరళ (Kerala)కు చెందిన జగ్గు అనే వ్యక్తి మధ్యవర్తిత్వం చేశాడని తెలుస్తుంది. ఆ అనుమానంతోనే సిట్ (Special Investigation Team) అధికారులు నోటీసులు ఇచ్చినట్టు తెలుస్తుంది.
గతంలో కేరళలో సోదాలు..
కాగా గతంలో దాదాపు 5 రోజుల పాటు సిట్ బృందం కేరళలో పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. ఈ సోదాల్లో పలు కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే కేరళ (Kerala)లో డాక్టర్ జగ్గుజీస్వామి కోసం సిట్ అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. కానీ సిట్ బృందం కేరళ (Kerala)కు వస్తుందన్న విషయం తెలుసుకున్న జగ్గు (Jaggu swami) అనే డాక్టర్ పారిపోయాడు. కేరళతో పాటు ఏపీ, తెలంగాణ , కర్ణాటక , హర్యానా రాష్ట్రాల్లో కూడా సోదాలు చేపట్టింది సిట్ బృందం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad, Telangana, Telangana News, TRS MLAs Poaching Case