Gandhi Hospital: గాంధీ ఆస్పత్రిలో దారుణం.. అక్కాచెల్లెళ్లపై సిబ్బంది సామూహిక అత్యాచారం.. గదిలో బంధించి దారుణం..

గాంధీ అసుపత్రి

హైదరాబాద్‌లో గాంధీ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు అక్కాచెల్లెళ్లపై సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ మేరకు ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

  • Share this:
    హైదరాబాద్‌లో గాంధీ ఆస్పత్రిలో దారుణం చోటుచేసుకుంది. ఇద్దరు అక్కాచెల్లెళ్లపై సిబ్బంది అత్యాచారానికి పాల్పడ్డారు. వారికి మత్తు మందు ఇచ్చి గదిలో బంధించి నాలుగు రోజులుగా ఈ దారుణానికి ఒడిగట్టారు. అక్కడి నుంచి తప్పించుకున్న ఓ బాధితురాలు.. పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. తాను తప్పించుకున్నాని.. కానీ సోదరి ఆచూకీ తెలియడం లేదని బాధితురాలు పేర్కొంది. వివరాలు.. మహబూబ్ నగర్‌ జిల్లా కేంద్రానికి చెందిన ఓ వ్యక్తి కిడ్నీ సమస్యతో బాధపడుతున్నాడు. దీంతో కుటుంబ సభ్యులు చికిత్స కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. ఈ నెల 4వ తేదీన అతడిని ఆస్పత్రిలో అడ్మిట్ చేశారు. అతనికి సాయంగా భార్య, ఆమె చెల్లెలు గాంధీ ఆస్పత్రికి వచ్చారు.

    అయితే అతడిని వేరే రూమ్‌కు మార్చడంతో అతని భార్య, ఆమె చెల్లలు ఎక్కడికి తీసుకెళ్లారో తెలియక తికమకపడ్డారు. ఈ సమయంలో ల్యాబ్ టెక్నీషియన్ ఉమమహేశ్వర్.. వారికి వార్డు చూపిస్తానని నమ్మించాడు. ఇలా వారిని ఓ గదిలోకి తీసుకెళ్లి.. మత్తు మందు ఇచ్చాడని బాధితురాలు ఆరోపిస్తుంది. తమపై నలుగురు అత్యాచారం చేసినట్టు ఆమె పేర్కొంది. నాలుగు రోజులపాటు తనను బంధించారని.. అయితే తాను వారి నుంచి తప్పించుకొని బయటపడ్డానని.. కానీ తన అక్క ఆచూకీ తెలియడం లేదంటూ ఆవేదన వ్యక్తం చేసింది.

    ఈ ఘటనపై బాధితురాలు తొలుత.. మహబూబ్‌నగర్‌ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కానీ వారు గాంధీ ఆస్పత్రి పరిధిలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేయమని చెప్పడంతో.. తిరిగి హైదరాబాద్‌కు చేరుకున్నారు. చిలకలగూడ పోలీస్ స్టేషన్‌లో ఇందుకు సంబంధించి బాధితురాలు ఫిర్యాదు చేసింది. ల్యాబ్‌ టెక్నీషియన్‌ ఉమామహేశ్వర్‌ అత్యాచారం చేసినట్టు ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు. ఉమ మహేశ్వర్‌తో మరో ఇద్దరు గార్డులు అత్యాచారం చేసినట్లు అనుమానిస్తున్నారు. ల్యాబ్ టెక్నీషియన్ ఉమమహేశ్వర్‌ను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు నిందితుల కోసం గాలిస్తున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: