HYDERABAD SIRISHA IS THE FIRST LINE WOMAN TO GET A JOB IN MEDCHAL TELANGANA SNR
Telangana:తెలంగాణలో తొలి లైన్ విమెన్‌గా మేడ్చల్ యువతి..శభాష్ శిరీష అంటూ ప్రశంసలు
Photo Credit:Twitter
Telangana:గతంలో ఉద్యోగ అర్హతల్లో ఆడ, మగ అనే తేడా ఉండేది. అంటే కొన్ని ఉద్యోగాలకు మగవాళ్లే అర్హులు అనే విధంగా ఉండేది. కాని కాలక్రమేణ అమ్మాయిల్లో పోటీ తత్వం పెరగడంతో అన్నీ రంగాల్లో , అన్నీ ఉద్యోగాల్లో మేము సైతం అంటున్నారు మహిళలు.
గతంలో ఉద్యోగ అర్హతల్లో ఆడ, మగ అనే తేడా ఉండేది. అంటే కొన్ని ఉద్యోగాలకు మగవాళ్లే అర్హులు అనే విధంగా ఉండేది. కాని కాలక్రమేణ అమ్మాయిల్లో పోటీ తత్వం పెరగడంతో అన్నీ రంగాల్లో , అన్నీ ఉద్యోగాల్లో మేము సైతం అనడంతో బస్ కండక్టర్ (Conductor)ఉద్యోగాల నుంచి ఇప్పుడు విద్యుత్‌శాఖ డిపార్ట్మెంట్(Electricity Department)లో లైవ్మెన్ ఉద్యోగాల వరకు దరఖాస్తులు చేస్తున్నారు యువతులు... ఉద్యోగాలు సంపాధిస్తున్నారు. తెలంగాణకు చెందిన ఓ యువతి తొలి లైన్ విమెన్ ఉద్యోగం పొందింది. సిద్దిపేట జిల్లాకు చెందిన బీ. శిరీష (Sirisha) మేడ్చల్(Medchal)లో సర్కిల్ లైన్ ఉమెన్(Line Women)గా విధులు నిర్వహిస్తోంది. తెలంగాణTelangana రాష్ట్ర దక్షిణా ప్రాంత విద్యుత్ సరఫరా సంస్థ (టీఎస్ఎస్పీడీసీఎల్)లైన్మెన్ల ఎంపికకు నిర్వహించిన దరఖాస్తులు, పోల్ క్లైంబింగ్ టెస్టుల్లో (Pole Climbing test)శిరీష ఉత్తీర్ణత సాధించి ఉద్యోగం సంపాధించింది. ఈసందర్భంగా శిరీషకు తొలి లైన్ ఉమెన్‌గా ఉద్యోగ నియామకపత్రాన్ని సంబంధిత శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డి(Jagadish Reddy)టీఎస్ఎస్పీడీసీఎల్ సీఎండీ రఘుమారెడ్డి(Raghumareddy)చేతుల మీదుగా అందుకుంది.
శిరీష ఓ వీర వనిత..
తొలి లైన్ ఉమెన్‌గా ఉద్యోగం పొందిన శిరీషది స్వస్థలం సిద్దిపేట. మేడ్చల్‌లో సర్కిల్ లైన్ ఉమన్‌గా విధులు నిర్వహిస్తోంది. మొదట ఉద్యోగానికి దరఖాస్తు చేసుకునే నాటి నుంచి ఎలాగైనై ఉద్యోగం సంపాధించాలన్న పట్టుదలతోనే శిరీష ఉండటంతో ఉద్యోగానికి కావాల్సిన ఆమె అన్నీ అర్హత పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించింది. ఉద్యోగ నియామకంలో ప్రధానమైన పరీక్ష విద్యుత్ స్తంభాలు ఎక్కడం. ఈ ఉద్యోగానికి యువతి అప్లై చేసుకోవడంతో...టీఎస్పీడీసీఎల్ గతేడాది డిసెంబర్ 20వ తేదిన శిరీషకు పోల్ క్లైంబింగ్ టెస్ట్‌కు హైకోర్టు నుంచి ఆర్డర్ అందుకున్నారు. రీసెంట్గా ఆ టెస్ట్ నిర్వహించారు. అందులో శిరీష సునాయాసంగా పోల్ క్లైంబింగ్ టెస్ట్ పాసవడంతో ఉద్యోగం వచ్చింది.
Born in Siddipet, brought up in Medchal, Sirisha is posted as Line Woman in Medchal Circle. She got job after applying to notification @jagadishTRS said she is first for TSSPDCL, TRANSCO appointed 200line woman pic.twitter.com/trPZdy7p5h
ఫస్ట్ లైన్ ఉమెన్‌గా రికార్డు..
శిరీష తలకు హెల్మెట్ పెట్టుకొని కరెంట్ స్తంభం ఎక్కుతున్న వీడియోని నవీన గహనతే అనే మహిళ ట్విట్టర్ ద్వారా షేర్ చేయడంతో న్యూస్‌తో పాటు వీడియో వైరల్ అవుతోంది.
టీఎస్ ఎస్పీడిసిఎల్ లో తొలిసారిగా లైన్ ఉమెన్ గా ఉద్యోగం పొందిన శిరిషకు నియామక పత్రాన్ని అందించి, అభినందించిన మంత్రి జగదీశ్ రెడ్డి,పాల్గొన్న టీఎస్ ఎస్పీడిసిఎల్ సీఎండీ రఘుమా రెడ్డి ఇతర ఉన్నతాధికారులు.@trspartyonline@KTRTRS@TelanganaCMOpic.twitter.com/EDH4eh3LOR
మేము సైతం అంటున్న నారీలోకం..
ఇటీవల టీఎస్ఎస్పీడీసీఎల్ విడుదల చేసిన జాబ్ నోటిఫికేషన్ ద్వారా ట్రాన్స్‌కో సంస్థ సుమారు 200మంది మహిళలకు ఉద్యోగాలు ఇచ్చింది. శిరీషతో పాటు భారతి అనే మరో యువతి కూడా లైన్ ఉమెన్ ఉద్యోగం సాధించింది. అయితే మొదటగా ఉద్యోగం సాధించిన మహిళగా శిరీష ఉద్యోగ నియామకపత్రం అందుకోవడంతో సోషల్ మీడియాలో ఆమె పేరు తెగ వైరల్ అవుతోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.