హోమ్ /వార్తలు /తెలంగాణ /

Minister Ktr: కేటీఆర్‌కు షాక్ ఇచ్చిన సింగర్ శ్రీరామచంద్ర.. !

Minister Ktr: కేటీఆర్‌కు షాక్ ఇచ్చిన సింగర్ శ్రీరామచంద్ర.. !

శ్రీరామచంద్ర ట్వీట్ వైరల్

శ్రీరామచంద్ర ట్వీట్ వైరల్

ఓ రాజకీయ నాయకుడు వెళ్తుండటంతో ఎయిర్ పోర్ట్‌కు వెళ్లే పివి నరసింహారావు ఫ్లై ఓవర్‌ను తాత్కాలికంగా మూసేసారు ట్రాఫిక్ పోలీసులు

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ మంత్రి కేటీఆర్‌ను ప్రశ్నిస్తు టాలీవుడ్ ప్రముఖ సింగర్ శ్రీరామచంద్ర చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు కలకలం రేపుతున్నాయి. సోషల్ మీడియా వేదికగా శ్రీరామచంద్ర చేసిన ట్వీట్ హాట్ టాపిక్‌గా మారింది. వివరాల్లోకి వెళ్తే.. హైదరాబాద్ నుంచి గోవా వెళ్ళడానికి శ్రీరామ్ చంద్ర శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కి కారులో బయలు దేరాడు.

అయితే అదే సమయంలో అటుగా ఓ రాజకీయ నాయకుడు వెళ్తుండటంతో ఎయిర్ పోర్ట్‌కు వెళ్లే పివి నరసింహారావు ఫ్లై ఓవర్‌ను తాత్కాలికంగా మూసేసారు ట్రాఫిక్ పోలీసులు. దీంతో ఎయిర్ పోర్ట్ కు వెళ్లే వాహనాలను దారి మళ్లించారు. దాంతో అటుగా వెళ్లే వాహనదారులంతా ఇబ్బంది పడ్డారు. అయితే అదే సమయంలో ఎయిర్ పోర్ట్‌కు వెళ్లే శ్రీరామ్ చంద్ర కూడా ఆ ట్రాఫిక్‌లో ఇరుక్కున్నాడు. ఎయిర్ పోర్టుకు ట్రాఫిక్ కారణంగా త్వరలో చేరుకోలేకపోయాడు. దీంతో తాను వెళ్లాల్సిన గోవా ఫ్లైట్ కాస్త మిస్ అయ్యింది. ఇలా శ్రీరామచంద్ర ఒక్కడే కాదు.. మరో 15 మంది ప్రయాణికులు కూడా ఎయిర్ పోర్టుకు ఆలస్యం కావడంతో విమానం మిస చేసుకున్నారు.

దీంతో సీరియస్ అయిన సింగర్.. తనతో పాటు మొత్తం 15 మంది విమానాన్ని మిస్ అయ్యామని తెలిపాడు. ఈ మేరకు ఒక సెల్ఫీ వీడియోను షేర్ చేస్తూ మంత్రి కేటీఆర్‌ను, సీఎం కేసీఆర్‌ను ట్యాగ్ చేశాడు శ్రీరామ్ చంద్ర. రాజకీయ నేతల ప్రయాణాల కోసం తమ లాంటి సామాన్యులను ఇబ్బందు పెట్టవద్దంటూ కెటిఆర్ ను వేడుకున్నాడు. దీంతో ఇప్పుడు సింగర్ చేసిన ట్వీట్ ఇటు రాజకీయాల్లో అటు సినీ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.

First published:

Tags: Brand Hyderabad, Hyderabad, Local News

ఉత్తమ కథలు