(M.Balakrishna,News18,Hyderabad)
రోజుకి కొన్ని లక్షల మంది ప్రయాణించే హైదరాబాద్(Hyderabad)మెట్రో ఇప్పుడు ప్రయాణికులకు మరింత చేరువ అవడానికి వినూత్న ప్రయత్నాలు చేస్తోంది. ఇప్పటికే టిక్కెట్ రేట్లపై ఆఫర్స్‌తో ప్రయాణికులకు చేరువ అవుతున్న మెట్రో ఇప్పుడు మరో అడుగు ముందుకేసి... ప్రయాణికులు మెట్రో స్టేషన్స్(Metro Stations)లోనే షాపింగ్ (Shopping)చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది. అయితే ఇక్కడ కూడా మెట్రో తనదైన మార్క్ వేసుకుంది. మహిళ ఎంట్రప్రెన్యూర్(Entrepreneur)ను ప్రొత్సహించే ఉద్దేశంతో వారు ఉత్పత్తి చేసిన ఉత్పత్తులకు మెట్రో స్టేషన్స్‌లో అందుబాటులో ఉంచుతున్నారు. పైలెట్ ప్రాజెక్ట్(Pilot project)క్రింది తొలుత అమీర్‌పేట(Ameerpet)మెట్రో స్టేషన్ లో ఈ సేవాలను బుధవారం(Wednesday)ఆడిషినల్ డీజీపీ ఉమెన్ సేఫ్టీ(Auditional DGP Women Safety)స్వాతి లక్రా (Swathi Lakra)ప్రారంభించారు.
మెట్రో స్టేషన్లో షాపింగ్..
ఈ స్టేషన్లో మహిళలు తయారు చేసిన ఉత్పత్తులను ప్రత్యేకమైన స్టాల్స్ లో పెట్టి అమ్ముతున్నారు. ప్రయాణికులు నాణ్యమైన ఉత్పత్తులను చాలా అనువైన ధరలకు కొనుగోలు చేసుకునే వెసులుబాటు కల్పిస్తోంది హైదరాబాద్ మెట్రో. కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని ఉత్పత్తులు చేస్తోన్న మహిళలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో హైదారాబాద్ మెట్రో ఈ ముందడుగు వేసిందాన్నారు మెట్రో ఎండీ ఎన్ వీఎస్ రెడ్డి. రాబోయే రోజుల్లో మరిన్ని మెట్రో స్టేషన్స్ లో కూడా ఇలా షాపింగ్ సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పారాయన. ప్రస్తుతం ఎక్కువ రద్దీ ఉన్న అమీర్‌పేట్ మెట్రో స్టేషన్లో ఈ సేవలు ప్రారంభించామని ఇక్కడ వచ్చిన స్పందన చూసి మరిన్ని మెట్రోస్టేషన్స్ లో ఈ షాపింగ్ సదుపాయాన్ని కల్పిస్తామని చెప్పారు.
మహిళలకు ఇదో మంచి ఛాన్స్..
మహిళ సాధికరతకు ఇది ఒక మంచి అవకాశ అన్నారు ఆడిషినల్ డీజీపీ, షీ టీమ్స్ స్వాతి లక్రా. మహిళలు తమ ఉత్పత్తులను ప్రజలకు చేరువ చేయడానికి మెట్రో ఒక అద్బుతమైన అవకాశం కల్పిస్తోందన్నారు. మహిళలు ఏర్పాటు చేసిన స్టాల్స్‌ని సందర్శించిన స్వాతి లక్రా తనకు నచ్చిన కొన్ని వస్తువులను కూడా కొనుగోలు చేశారు.
మరిన్ని సేవలందిస్తాం..
లాక్డౌన్ ఎత్తివేసిన తర్వాత అంతంత మాత్రంగా ఉన్న మెట్రో రైలు సర్వీసులు కొన్ని కంపెనీలు, సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ తొలగించడంతో మెట్రో రైల్‌కు ఆదరణ పెరిగింది. రోజుకి దాదాపు 3 లక్షల మంది ప్రయాణికులు ప్రస్తుతం మెట్రో సేవాలను వాడుకుంటున్నట్లుగా తెలుస్తోంది. మరికొన్ని సంస్థలు వర్క్ ఫ్రమ్ హోమ్ తొలగిస్తే మెట్రో రైల్‌కు ప్రయాణికుల తాకిడి మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు మెట్రో అధికారులు. వినూత్న పద్దతులతో మెట్రో ప్రజలకు చేరువచేయడానికి ప్రయత్నిస్తున్నామని చెబుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Hyderabad Metro rail, Telangana