HYDERABAD SHOCK TO MODI ANOTHER MONEY HEIST POSTER HAS APPEARED IN HYDERABAD CRITICIZING BJP PRV
Hyderabad: తగ్గేదేలే అంటున్న KCR అభిమానులు.. మరో వినూత్న పోస్టర్‌తో హల్చల్
మోదీ, పోస్టర్
బీజేపీపై, ప్రధాని నరేంద్ర మోదీపై టీఆర్ఎస్ అభిమానులు విమర్శనాస్త్రాలు ఎక్కుపెడుతూనే ఉన్నారు. తాజాగా మరో మనీహిస్ట్ పోస్టర్ హల్చల్ చేస్తోంది. ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ పార్టీ కూల్చివేస్తోందని పోస్టర్లో ఆరోపించారు.
తెలంగాణ రాజకీయాలు (Telangana Politics) వేడెక్కాయి. హైదరాబాద్‌లో ఇవాళ్టి నుంచే బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు (BJP National executive meeting 2022) జరగనున్నాయి. పార్టీ విస్తరణ, మోదీ పాలను ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా బీజేపీ ఈ సమావేశాలను నిర్వహిస్తోంది. ముఖ్యంగా వచ్చే ఏడాది జరగనున్న తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించేదుకు వ్యూహాలు రచిస్తోంది. ఇందులో భాగంగానే హైదరాబాద్ (Hyderabad)లో సమావేశాలను నిర్వహిస్తోంది. ఈ సమావేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi), అమిత్ షా (Amit Shah), జేపీ నడ్డా (JP Nadda) వంటి అగ్రనేతలతో పాటు బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులు, ఎంపీలు, మాజీ సీఎంలంతా హాజరవుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వంపై టీఆర్ఎస్ దండయాత్రకు దిగింది.
పోస్టర్ల వార్..
దీంతో హైదరాబాద్‌లో బీజేపీ (BJP), టీఆర్ఎస్ (TRS) మధ్య ఫ్లెక్సీ వార్ ఓ రేంజ్లో నడుస్తోంది. నగరంలో దొంగలు సంచరిస్తున్నారంటూ.. కౌంటర్ ఇస్తున్నారు kcr అభిమానులు. ఈ క్రమంలోనే బీజేపీ, ప్రధాని నరేంద్ర మోదీని టార్గెట్ చేస్తూ సరికొత్త స్టైల్ లో విమర్శలు చేస్తున్నారు. ఈ ఆరోపణలు అందరినీ ఆలోచనలు పడేస్తున్నాయి. తగ్గెదే లే అంటూ మనీహిస్ట్ (Money heist) స్టైల్ లో బీజేపీ, ప్రధాని మోడీ (PM Narendra modi) పై విమర్శలు గుప్పిస్తున్న పోస్టర్లు హైదరాబాద్ వెలిశాయి. రోజుకో సరికొత్త విమర్శలు, ఘాటు వ్యాఖ్యలతో మనీహిస్ట్ మస్కట్లు హల్చల్ చేస్తున్నాయి.
మరో కొత్త పోస్టర్..
తాజాగా మరో మనీహిస్ట్ పోస్టర్ (Money Heist poster) హల్చల్ చేస్తోంది. ఇందులో బీజేపీ, ప్రధాని మోదీపై ఘాటుగానే విమర్శలు గప్పించారు. ప్రజలు ఎన్నుకున్న రాష్ట్ర ప్రభుత్వాలను బీజేపీ కూల్చివేస్తోందని పోస్టర్లో ఆరోపించారు. అధికార పార్టీల ఎమ్మెల్యేలు తమ విధేయుడిని మార్చిన తర్వాత కాషాయ పార్టీ ప్రభుత్వాలను ఏర్పాటు చేసిన రాష్ట్రాల పేర్లను ఈ మనీహిస్ట్ పోస్టర్లలో పేర్కొన్నారు. ఉత్తరాఖండ్, అరుణాచల్ ప్రదేశ్, కర్నాటక, బిహార్, మహారాష్ట్ర పేర్లను ప్రస్తావిస్తూ పోస్టర్ వెలిసింది. అలాగే BYE BYE MODI అంటూ రాసుకొచ్చారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో కూడా BYE BYE MODI ట్రెండింగ్ లో కొనసాగుతోంది.
banner
అంతకముందు రోజు ‘మేం బ్యాంకుల్ని మాత్రమే దోచుకుంటాం.. మీరు దేశం మొత్తాన్ని దోచుకుంటున్నారు’ అని రాసి దానికి ‘బైబై మోదీ’అనే హ్యాష్‌ట్యాగ్ జతచేసిన ప్లకార్డులతో కొందరు వ్యక్తులు పాపులర్ టీవీ సిరీస్ ‘మనీహీస్ట్’లోని గెటప్‌తో ప్రధాని నరేంద్రమోదీపై నిరసన వ్యక్తం చేశారు.
‘మనీహీస్ట్’లోని వస్త్రధారణతో వారు నగరంలోని వివిధ బ్యాంకులు, పెట్రోల్ బంకులు, రైల్వేస్టేషన్లు వంటి ముఖ్యప్రాంతాల్లో నిలబడి ప్రజలను ఆకట్టుకున్నారు. మనీహీస్ట్ చిత్రాలతో ఎల్బీనగర్,హైటెక్‌సిటీ, లక్డీకాపూల్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో భారీ హోర్డింగులు ఏర్పాటు చేశారు. ‘మనీహీస్ట్’చిత్రంలో మాదిరిగా ముసుగులతో ఉన్న వారు సికింద్రాబాద్, కాచిగూడ రైల్వేస్టేషన్లు, పీఎన్బీ, ఎస్బీఐ, ఐసీఐసీఐ బ్యాంకులు, ఐఓసీ పెట్రోల్ బంకుల వద్ద, రోడ్లపైన కనిపించారు. ఇవి సోషల్‌మీడియాలో వైరల్‌గా మారాయి
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.