Home /News /telangana /

HYDERABAD SHE TEAM POLICE DISGUISE IN HYDERABAD 44 EVE TEASING CASES IN FOUR WEEKS UNDER RACHAKONDA COMMISSIONERATE SNR BK

Hyderabad : ఆ ప్లేసుల్లో ఉండే అమ్మాయిల జోలికి వెళ్లారో అంతే.. పోకిరీలపై షీ టీమ్స్ షాడో

(ప్రతీకాత్మకచిత్రం)

(ప్రతీకాత్మకచిత్రం)

Hyderabad: అమ్మాయిల జోలికి వెళ్లినా...ఆడవాళ్ల పట్ల అసభ్యంగా ప్రవర్తించినా..స్టూడెంట్స్‌తో తుంటరి చేష్టలకు పాల్పడే పోకిరీల కోసం వాళ్లు అక్కడే కాపలా కాస్తున్నారు. తుంటరి చేష్టలను పసిగట్టడానికి వాళ్లను నీడలా వెంటాడుతున్నారు. ఇదంతా చేస్తోంది ఎవరో తెలుసా.

ఇంకా చదవండి ...
  (M.Balakrishna,News18,Hyderabad)
  సినిమాల్లో చూపించినట్లుగా రోడ్లపై , బస్టాండ్‌ల్లో పోకిరీ వేషాలు వేద్దామంటే ఇకపై నడవదు. ఎందుకంటే అమ్మాయిలను ఆటపట్టించే వాళ్లు, వెంట పడి వేధించే వాళ్లు, అమ్మాయిలను చూస్తూ వెకిలి చేష్టలు, వెదవ వేషాలు వేసే వారిని షాడోలా(Shadow)లేడీ పోలీసులు(Lady Police) వెంటాడుతున్నారు. హైదరాబాద్‌(Hyderabad)లో పిచ్చి వేషాలు వేస్తూ అమ్మాయిలకు ఇబ్బంది కలిగించే వాళ్లు ఎక్కడెక్కడ ఎక్కువగా ఉంటారో పసిగట్టి మరీ మఫ్టీ(Mufti)లో మకాం వేసి పట్టుకుంటున్నారు. గత నాలుగు వారాలుగా షీ టీమ్ పోలీసులు(She team police)ఇదే పనిలో ఉన్నారు. దాదాపు 44మంది భరతం పట్టారు.

  మఫ్టీలో పోకిరీలపై నిఘా..
  హైదరాబాద్‌లో అమ్మాయిలను వేధించే వాళ్ల కోసమే షీ టీమ్ పోలీసులు పక్కా వ్యూహంతో యాక్షన్ ప్లాన్ అమలు చేస్తున్నారు. గ‌డిచిన నాలుగు వారాల్లో ప్ర‌త్యేక డ్రైవ్ నిర్వహించిన రాచకొండ కమిషనరెట్‌ పరిధిలోని షీ టీమ్ పోలీసులు ఈవ్ టీజర్లపై 40 కేసులు న‌మోదు చేశాయి. ఇందులో  13 ఎఫ్‌ఐఆర్‌లు, 19 చిన్న కేసులు, 8 కౌన్సెలింగ్ కేసులుగా బుక్ చేయగా, 19 మంది మైనర్‌లతో సహా 44 మంది ఈవ్ టీజర్‌లను పట్టుకున్నారు క‌ట‌క‌టాల వెన‌క్కి పంచారు పోలీసులు. ఈవ్-టీజర్లు కు వారి కుటుంబాలకు  భూమిక ఉమెన్స్ కలెక్టివ్ (NGO)కి చెందిన ప్రొఫెషనల్ కౌన్సెలర్లు కౌన్సెలింగ్ ఇప్పించి మ‌రి పోలీసు ప‌వ‌ర్ చూపించారు.  షీ టీమ్‌ కాదు షాడో పోలీసులు..
  చౌటుప్పల్, మల్కాజ్‌గిరి తోపాటు సిటీ, శివారు ప్రాంతాల్లో షీ టీమ్స్ కొన్ని రోజులుగా డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించి చాలా మందిని అరెస్టు చేశారు. షీ టీమ్‌లు మెట్రో రైళ్లలు, బ‌స్సు స్టాండ్, ఇత‌ర ర‌ద్దీ ప్రాంతాల్లో ఈ డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించి అక్క‌డ మ‌హిళ‌ల ప‌ట్ల అస‌భ్యంగా ప్రవర్తిస్తున్న వాళ్లను అదుపులోకి తీసుకున్నారు. మారు వేషంలో  మహిళల కంపార్ట్‌మెంట్‌లోకి వెళ్లి తొమ్మిది మందిని పట్టుకున్నారు. రాచకొండలోని వివిధ ప్రాంతాల నుంచి వాట్సాప్/ఎస్‌ఎంయూసీ ఫిర్యాదుల ద్వారా గత ఎనిమిది వారాల్లో రాచకొండ షీ టీమ్‌లు డెకాయ్‌ ఆపరేషన్స్‌లో 44 మంది ఈవ్‌టీజర్లను పట్టుకున్నారు. వారు మెట్రో రైళ్లలోతోపాటు ఇత‌ర‌ జంక్షన్లు, బస్టాప్‌లు, కార్యాలయాలు, కళాశాలల వద్ద మహిళలను వేధిస్తున్నారు.  దీంతో పాటు షీ టీమ్స్  బాల్య వివాహాల‌పై కూడా ఒక కొన్నేశారు.  గత నెలలో రాచకొండ షీ టీంలు మూడు బాల్య వివాహాలను అడ్డుకున్నారు.చౌటుప్పల్, ఇబ్రహీంపట్నం, వనస్థలిపురం షీ టీంలు ఒక్కొక్కటిగా బాల్య వివాహాలను నిలిపివేశారు. ఇప్ప‌టి వ‌ర‌కు రాచకొండ షీ టీమ్స్  148 బాల్య వివాహాలను నిలిపివేశారు.

  ఇది చదవండి : రాబోయే మూడు రోజుల్లో దంచికొట్ట‌నున్న వ‌ర్షాలు.. IMD ఎల్లో అల‌ర్ట్..  అమ్మాయిలతో జాగ్రత్త..
  నగరంలో షీ టీమ్స్ దూకుడు ప్రదర్శించడంపై రాచకొండ పోలీస్ కమిషనర్ మహేష్ భగవత్ అభినందించారు. ఇదే స్పూర్తితో ప‌ని చేయాల‌ని సూచించారు. మ‌హిళ‌లు ఎప్పుడైన ఎక్క‌డైన ఇబ్బందులు ఎదుర్కొంటే వాట్సాప్ కంట్రోల్ నంబర్ 9490617111 ద్వారా షీ టీమ్‌లను సంప్రదించాలిని విజ్ఞ‌ప్తి చేశారు సీపీ. ఈవ్ టీజింగ్‌కు గురైనప్పుడు 100కి డయల్ చేయాలని విజ్ఞప్తి చేశారు. కోవిడ్ త‌రువాత అంత ఇప్పుడు సాదార‌ణ ప‌రిస్థితుల‌కు వ‌స్తోన్న నేప‌ధ్యంలో ఆఫీసులుకు కూడా వేళ్లే మ‌హిళ‌ల సంఖ్య భారీగానే పెరుగుతుండటంతో న‌గ‌రంలో ఉన్న షీ టీమ్స్ ఎక్క‌డిక్క‌డ మారు వేషంలో రెక్కి నిర్వహిస్తున్నారు. బస్టాండ్, మెట్రో స్టేష‌న్స్‌లో షీ టీమ్స్ మారు వేషాల్లో మాటువేసి పోకిరీల భరతం పడుతున్నాయి. బాధితులు ఫిర్యాదు చేసేందుకు ఇబ్బంది పడుతున్నా...ఎవరైనా కాస్త తేడాగా ప్రవర్తించిన మారువేషంలో ఉన్న షీ టీమ్ పోలీసులు వెంటనే పట్టుకొని జైలుకు పంపుతున్నారు.
  Published by:Siva Nanduri
  First published:

  Tags: She teams, Telangana crime news

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు