Home /News /telangana /

Shocking Incident: బావ.. పత్తి చేనుకు వెళ్దాం అంటూ తన భర్తను తీసుకెళ్లింది.. కాని చివరకు ఇది ఊహించలేకపోయాడు..

Shocking Incident: బావ.. పత్తి చేనుకు వెళ్దాం అంటూ తన భర్తను తీసుకెళ్లింది.. కాని చివరకు ఇది ఊహించలేకపోయాడు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Shocking Incident: వివాహేతర సంబంధాలతో కొన్ని వేల కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయి. కొన్ని వేల కుటుంబాలు నిరాధార పరిస్థితిలో ఉన్నాయి. వేరే వ్యక్తి మోజులో పడి కుటుంబాన్ని చిన్నాబిన్నం చేస్తున్నారు. ఇలా ఓ భార్య ప్రియుడి మోజులో పడి కుటుంబాన్ని రోడ్డు పాలు చేసింది. వివరాల్లోకి వెళ్తే..

ఇంకా చదవండి ...
  వివాహేతర సంబంధాలతో (Extramarital Affair) కొన్ని వేల కుటుంబాలు ఇబ్బందులకు గురవుతున్నాయి. కొన్ని వేల కుటుంబాలు నిరాధార పరిస్థితిలో ఉన్నాయి. వేరే వ్యక్తి మోజులో పడి కుటుంబాన్ని చిన్నాబిన్నం చేస్తున్నారు. పడకగది సుఖం కోసం ఆశపడి.. కట్టుకున్న భర్త (Husband) లేదా భార్యలను (Wife) క్షోభకు గురిచేస్తున్నారు. అక్రమ సంబంధాల కారణంగా హత్యలు (Murder) , ఆత్మహత్యలు (Rape), అత్యాచారాలు (Rape)  కూడా చోటు చేసుకున్నాయి. వీటిపై పోలీసులు, ప్రభుత్వం హెచ్చరిస్తున్నా ఎక్కడో ఒక దగ్గర జరుగుతూనే ఉన్నాయి. వీటిపై చట్టాలు తీసుకొచ్చినా ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారు. అత్యాచార ఘటనలు వెలుగుచూస్తున్న సమయంలో ఇలాంటి అక్రమ సంబంధాలు కూడా ఎక్కువగా చోటు చేసుకుంటున్నాయి.

  Affair: అక్రమ సంబంధంపై తల్లిని ప్రశ్నించాడు.. సమాధానం రాలేదు.. దీంతో కోపంతో అతడు బెడ్ రూంకి వెళ్లి..


  తాజాగా జరిగిన ఓ ఘటనలో తమ వివాహేతర సంబంధానికి అడ్డు వస్తున్నాడని ప్రియుడితో కలిసి పత్తి చేనులోకి తీసుకెళ్లి తన భర్తను హత్య చేసింది ఓ భార్య. ఈ ఘటన రంగారెడ్డి జిల్లాలోని చన్గోముల్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటుచేసుకుంది. దీనికి సంబంధించి స్థానికులు, ఎస్‌ఐ శ్రీశైలం తెలిపిన వివరాల ప్రకారం ఇలా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా చన్గోముల్‌ గ్రామానికి చెందిన ఎరుకల వెంకటయ్య(30), మాధవి(26) దంపతులు. అతడి భార్య గత కొంత కాలంగా శేఖర్ అనే వ్యక్తితో వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. ఈవిషయమై వెంకటయ్య పలుమార్లు భార్య మాధవిని హెచ్చరించినా ఫలితం లేకుండా పోయింది.

  Minor: రాత్రి తండ్రి, పగలు కొడుకులు.. బాలికపై అత్యాచారానికి పాల్పడిన కుటుంబసభ్యులు.. ఆ ఇంటి ఇల్లాలు కూడా..


  మాధవితో పాటు అతడు శేఖర్ ను కూడా ఓ రోజు హెచ్చిరించాడు. ఈ విషయం ఇద్దరికీ అస్సలు నచ్చలేదు. తమ వివాహేతర సంబంధానికి తన భర్త అడ్డు వస్తున్నాడని భావించింది వెంకటయ్య భార్య. దీంతో అతడిని ఎలాగైనా చంపేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని తన ప్రియుడితో కలిసి పంచుకుంది. ఇద్దరు కలిసి ఓ మాస్టర్ ప్లాన్ చేశారు. సమయం కోసం ఎదురు చూసిన వెంకటయ్య భార్య.. ఓ రోజు అతడిని పత్తి చేనుకు వెళ్తాం పదా.. బావ అంటూ స్వీట్ గా పలిచింది. ఎప్పడు లేనిది ఎందుకు ఇలా పిలుస్తుందో అతడికి అప్పటికే ఏదో చన్నపాటి అనుమానం వచ్చింది.

  Very Sad: పొలంలో కూలీ పనులు చేస్తున్న మహిళ.. ఏం చేస్తున్నావ్ అంటూ.. వెనుక నుంచి వచ్చిన భూ యజమాని.. ఒక్కసారిగా..


  ఎందుకు ఇటు తీసుకొస్తున్నావని అనుమానంతో వెంకటయ్య అడిగాడు. కొంచెం పని ఉంది బావా.. నువ్వు ఏం మాట్లాడకుండా రా అంటూ ఆమె చెప్పి.. ఎలాగోలా ఆ పత్తి చేను వరకు తీసుకెళ్లింది. అక్కడ అప్పటికే కాపు కాస్తున్న తన ప్రియుడితో కలిసి మాధవి కూడా వెంకటయ్యను హత్య చేశారు. వెంకటయ్య కుటుంబీకుల ఫిర్యాదుతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్‌ఐ శ్రీశైలం వెల్లడించారు.

  మీ నగరం నుండి (​హైదరాబాద్)

  తెలంగాణ
  ​హైదరాబాద్
  తెలంగాణ
  ​హైదరాబాద్
  Published by:Veera Babu
  First published:

  Tags: Brand Hyderabad, Crime, Crime news, Hyderabad crime, Rangareddy

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు