Home /News /telangana /

HYDERABAD SEVEN BUSINESSMEN WHO HAVING GOOD FAMILY BACKGROUND WERE ARRESTED BY POLICE WHO INVOLVED IN TONY DRUGS TRANSPORT CASE HYDERABAD PRV

Hyderabad drugs case: డ్రగ్స్​ కేసులో సంచలన విషయాలు.. నిందితుల ఫ్యామిలీ బ్యాక్​గ్రౌండ్​ చూస్తే షాక్​ అవ్వాల్సిందే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

డ్రగ్స్​ కేసులో మొత్తం 23 మందిని నిందితులుగా చూపించారు. వీరిలో 10 మంది పరారీలో వున్నట్లు పోలీసులు తెలిపారు. ఏడుగురు వ్యాపారవేత్తలతో పాటు ఇతర సహాయకులను కూడా అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు.

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసు (Hyderabad drugs cases) రిమాండ్ రిపోర్ట్‌లో పోలీసులు కీలక అంశాలు ప్రస్తావించారు . ఈ కేసులో మొత్తం 23 మందిని నిందితులుగా చూపించారు. వీరిలో 10 మంది పరారీలో వున్నట్లు పోలీసులు తెలిపారు. ఏడుగురు వ్యాపారవేత్తలతో (Seven businessmen) పాటు ఇతర సహాయకులను కూడా అరెస్ట్ చేసినట్లు వెల్లడించారు. డ్రగ్స్ కేసులో ప్రధాన నిందితుడు టోనీ (Tony)తో పాటు ముఠా సభ్యులు ఇద్దరు అరెస్ట్ అయ్యారు. పరారీలో వున్న 10 మంది కోసం గాలిస్తున్నట్లు వెల్లడించారు. మహ్మద్ ఆసిఫ్, షేక్ మహమ్మద్, షాహిద్ ఆలం, అఫ్తాబ్, రెహమత్, ఇర్ఫాన్, ఇమ్రాన్, సోమ శశికాంత్, గజేంద్ర ప్రకాశ్, సంజయ్, అశోక్ జైన్‌లు పరారీలో వున్నట్లు పోలీసులు తెలిపారు. పరారీలో వున్న వారిని పట్టుకునేందుకు ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. మత్తు మందుకు బిగ్‌షాట్స్, పెద్ద పెద్ద వ్యాపారులు కస్టమర్లుగా వున్నట్లు పోలీసులు గుర్తించారు.

ఈ కేసులో ఏడుగురు వ్యాపారులను పోలీసులు అరెస్ట్ చేశారు. వందలాది కోట్ల రూపాయలు వ్యాపారం చేస్తూ  బిజినెస్‌మెన్‌లు డ్రగ్స్‌కు అలవాటు పడ్డారు (Businessmen). ముంబై డ్రగ్ మాఫియాకు చెందిన టోనీతో వ్యాపారవేత్తలు డ్రగ్స్ తెప్పించుకున్నారు . ఈ కేసులో పాతబస్తీ కేంద్రంగా నడుస్తున్న మసాలా దినుసుల ఫ్యాక్టరీ ఎండీ ఆనంద్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అలాగే ఏ1 కాంట్రాక్టర్ నిరంజన్ కుమార్ జైన్‌, రియల్ ఎస్టేట్ వ్యాపారి శాశ్వత్ జైన్, కాంట్రాక్టర్ దండు సూర్య సుమంత్ రెడ్డి, బండి భార్గవ్, ప్రముఖ ఎక్స్‌పోర్ట్ అండ్ ఇంపోర్ట్ వ్యాపారి వెంకట్ చలసాని కూడా అదుపులోకి తీసుకున్నారు.

హైదరాబాద్‌ నార్త్‌జోన్‌ టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు గురువారం పట్టుకున్న సంపన్న కుటుంబాలకు చెందిన ఏడుగురి గురించి పలు ఆసక్తికర అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. వీరిలో కొందరికి గతంలో పోలీసులు కౌన్సెలింగ్‌ కూడా నిర్వహించారు.  నిందితుల రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్న కీలకాంశాలను ‘సాక్షి’ మీడియా తన కథనంలో వెల్లడించింది... ఆ కథనం ప్రకారం.. ఈ కేసులో నిందితుడైన బంజారాహిల్స్‌ నివాసి శాశ్వత్‌ జైన్‌ది కూడా కన్‌స్ట్రక్షన్‌ వ్యాపారమే. రూ.1,000 కోట్లకుపైగా ఆస్తి ఉన్న ఈ కుటుంబం నగర శివార్లలో ప్రముఖ డిటర్జెంట్‌ సబ్బుల కంపెనీ (Detergent‌ Soap Company) నిర్వహిస్తోంది. సీఎస్సార్‌ కింద ఏటా 400 మంది పేదలకు ఉచితంగా కిడ్నీ తదితర ఆపరేషన్లు చేయిస్తోంది. వీరి కుటుంబ సభ్యుడి పేరుతో ఉప్పల్‌ క్రికెట్‌ స్టేడియంలో ఓ పెవిలియన్‌ కూడా ఉంది. 2011లో టాస్క్‌ఫోర్స్‌ పోలీసులకు చిక్కిన ముంబైకి చెందిన అర్వింద్‌ అనే డ్రగ్‌ పెడ్లర్‌ కస్టమర్ల జాబితాలో శాశ్వత్‌ పేరు ఉండటంతో కౌన్సెలింగ్‌ చేసినా అతడితో మార్పు రాలేదు.

నగరంలోని హిమాయత్‌నగర్‌కు చెందిన నిరంజన్‌ కుమార్‌ జైన్‌కు కొన్నాళ్ళ క్రితం ముంబైలోని ఓ పబ్‌లో టోనీతో పరిచయమైంది. అప్పటి నుంచి 30 సార్లు డ్రగ్స్‌ కొనడంతోపాటు మరికొందరు స్నేహితులకు అలవాటు చేశాడు. నిరంజన్‌ కుటుంబం ఏటా రూ.600 కోట్ల టర్నోవర్‌ ఉన్న పెద్ద కన్‌స్ట్రక్షన్‌ కంపెనీ నడుపుతోంది. నగరంలో నిర్మించిన, నిర్మాణంలో ఉన్న ఫుట్‌ ఓవర్‌ బ్రిడ్జ్‌ల్లో అనేకం వీరు చేపట్టినవే.

గౌలిపురకు చెందిన యజ్ఞానంద్‌ అగర్వాల్‌ కుటుంబం మసాలా దినుసుల వ్యాపారంలో ఉంది. ప్రముఖ బ్రాండ్‌ ఉత్పత్తులను తయారు చేసే వీరికి తెలుగు రాష్ట్రాల్లో అనేక బ్రాంచ్‌లున్నాయి. ఇలా ఒక్కొక్కరిదీ ఒక్కో వ్యాపార నేపథ్యం. అందరూ సంపన్న కుటుంబాలకు చెందినవారే.
Published by:Prabhakar Vaddi
First published:

Tags: Businessman, Crime news, Cyberabad police, Drugs case, Hyderabad

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు