హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad : మత్తివ్వకుండానే బ్రెయిన్ సర్జరీ .. రోగికి ఆ సినిమా చూపించి సక్సెస్ అయిన గాంధీ వైద్యులు

Hyderabad : మత్తివ్వకుండానే బ్రెయిన్ సర్జరీ .. రోగికి ఆ సినిమా చూపించి సక్సెస్ అయిన గాంధీ వైద్యులు

(SUPER SURGERY)

(SUPER SURGERY)

Telangana : వైద్యవృత్తిపై, ప్రభుత్వాసుపత్రిలోని డాక్టర్లపై మరింత నమ్మకం కలిగే విధంగా చేశారు సికింద్రాబాద్‌లోని గాంధీ ఆసుపత్రి వైద్యులు. అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌ని రోగికి మత్తు ఇవ్వకుండానే విజయవంతంగా పూర్తి చేశారు. ఆపరేషన్‌ చేస్తున్న సమయంలో రోగికి ఏమిచ్చారో తెలుసా.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

వైద్యం పేరుతో రోగికి పునర్జన్మ ప్రసాదించే డాక్టర్లను దేవుళ్లుగానే రోగి చూస్తారు. ఎందుకంటే అత్యంత క్లిష్టమైన పరిస్థితుల్లో రోగి ప్రాణాలు కాపాడే బాధ్యతను తీసుకొని వృత్తి ధర్మాన్ని కొనసాగిస్తారు కాబట్టి అందుకే డాక్టర్ల(Doctors)కు సమాజంలో ప్రత్యేకమైన గుర్తింపు, గౌరవం ఉంది. వైద్యవృత్తిపై, డాక్టర్లపై మరింత నమ్మకం కలిగే విధంగా చేశారు సికింద్రాబాద్‌(Secunderabad)లోని గాంధీ ఆసుపత్రి(Gandhi Hospital)వైద్యులు. అత్యంత క్లిష్టమైన ఆపరేషన్‌(Surgery)ని రోగికి మత్తు ఇవ్వకుండానే విజయవంతంగా పూర్తి చేశారు. డాక్టర్లు సర్జరీ మొదలుపెట్టిన దగ్గర నుంచి పూర్తి చేసే వరకు రోగికి ఇష్టమైన సినిమా (Movie)చూపించి ..తమ పని పూర్తి చేయడం ఇప్పుడు సంచలన వ్యార్తగా నిలిచింది.


Crime news : భార్య ఆ ఒక్క మాట అన్నందుకు భర్తలో ఉన్మాదం తారాస్థాయికి చేరింది .. ఆ కసితో ఏం చేశాడో తెలుసాఅడవి దొంగ సినిమా చూపిస్తూ..
ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్య సేవలపై రోగులకు నమ్మకం సన్నగిల్లుతున్న వేళ ...సికింద్రాబాద్‌ గాంధీ ఆసుపత్రి వైద్యులు సంచలనం సృష్టించారు. వృత్తి ధర్మాన్ని బాధ్యతగా తీసుకొని ఓ 50సంవత్సరాలు పైబడిన మహిళకు మెదడు ఆపరేషన్‌ని కొత్త విధానంలో చేసి అందర్ని ఆశ్చర్యపరిచారు. యాదాద్రి భువనగిరి జిల్లాకు చెందిన ఓ మహిళ అనారోగ్యంతో బాధపడుతూ గాంధీ హాస్పిటల్‌లో చేరింది. డాక్టర్లు అన్నీ టెస్ట్‌లు చేశారు. ఎక్సేరేలు తీయడంతో మెదడులో కణితి ఉన్నట్లుగా గుర్తించారు. అయితే సాధారణంగా ఆపరేషన్ చేస్తే ఆమె ప్రాణాలకు ప్రమాదకరం కాబట్టి 'అవేక్ క్రానియోటమీ' నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. మెదడు దెబ్బతినకుండా ఉండటానికి రోగికి మత్తు ఇంజక్షన్ ఇవ్వకుండా స్పృహలో ఉంచి చేసే సర్జరీ.గాంధీ హాస్పిటల్‌ వైద్యుల గొప్పతనం..

సుమారు రెండు గంటల సమయం పట్టే ఈ సర్జరీ చేయడానికి గాంధీ డాక్టర్లు పేషెంట్‌కి మత్తివ్వకుండా సర్జరీ చేసేందుకు ఆమెకు ఇష్టమైన సినిమా ఏదో తెలుసుకున్నారు. ఆపరేషన్‌ థియేటర్‌లో తీసుకురాగానే స్మార్ట్ ఫోన్ ఆమె చేతికిచ్చిఇష్టమైన సినిమా అడవిదొంగ చూపిస్తూ సర్జరీని విజయవంతంగా ముగించారు. ఆపరేషన్ చేస్తున్న రెండు గంటల సమయంలో డాక్టర్లు సర్జరీపై దృష్టి పెడితే మిగిలిన సిబ్బంది ఆమెను పలకరిస్తూ సినిమాలోని స్టోరీ అడుగుతూ కాలక్షేపం చేశారు. రెండు గంటల్లో మెదడులోని కణితులను తొలగించారు. రోగికి మెదడు ఆపరేషన్ జరుగుతోందనే ఆలోచనే రాకుండా మెదడులోని కణతులను తొలగించినట్టుగా గాంధీ ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రాజారావు తెలిపారు.

First published:

Tags: Gandhi hospital, Surgery twit, Telangana News

ఉత్తమ కథలు