హోమ్ /వార్తలు /తెలంగాణ /

Secunderabad Fire Accident : సికింద్రాబాద్‌ ఫైర్ యాక్సిడెంట్‌ మృతుల కుటుంబాలకు ప్రధాని రెండు లక్షలు, కేటీఆర్‌ మూడు లక్షలు పరిహారం ప్రకటన

Secunderabad Fire Accident : సికింద్రాబాద్‌ ఫైర్ యాక్సిడెంట్‌ మృతుల కుటుంబాలకు ప్రధాని రెండు లక్షలు, కేటీఆర్‌ మూడు లక్షలు పరిహారం ప్రకటన

FIRE ACCIDENT

FIRE ACCIDENT

Fire accident | Modi: సికింద్రాబాద్‌ బైక్‌ షోరూలో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా బిల్డింగ్‌పైనున్న రూబీ లాడ్జ్‌లో ఉన్న వారిలో 8మంది మృత్యువాత పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు రెండు లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు.ఇటు రాష్ట్ర ప్రభుత్వం తరపున కేటీఆర్‌ మూడు లక్షలు ప్రకటించారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

సికింద్రాబాద్‌Secunderabad బైక్‌ షోరూలో జరిగిన అగ్నిప్రమాదం కారణంగా బిల్డింగ్‌పైనున్న రూబీ లాడ్జ్‌(Ruby lodge)లో ఉన్న వారిలో 8మంది మృత్యువాత పడిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. దీనిపై ప్రధాని నరేంద్ర మోదీ(Prime Minister Narendra Modi) విచారం వ్యక్తం చేశారు.

Peddapalli: ఈ రైతు కుటుంబానికి ఎంత కష్టం.., పిడుగుపాటుకు గురై ఒకేసారి 10 ఆవులు మృత్యువాత

ప్రధాని సాయం..

మృతుల కుటుంబాలకు రెండు లక్షల ఆర్ధిక సాయం ప్రకటించారు వారి కుటుంబాలకు సంతాపం తెలియజేశారు. మరోవైపు ఈప్రమాదంపై పోలీసులు(Police) దర్యాప్తు ముమ్మరం చేశారు. చనిపోయిన 8మందిలో నలుగుర్ని గుర్తించారు. తమిళనాడు , ఆంధ్రా, ఢిల్లీకి చెందిన ముగ్గురి పేర్లను కనుగొన్నట్లుగా నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి తెలిపారు.

రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్‌గ్రేషియా..

ఈప్రమాదంలో చనిపోయిన వారి కుటుంబాలకు తెలంగాణ ప్రభుత్వం తరపున మూడు లక్షల పరిహారం ప్రకటించారు మంత్రి కేటీఆర్(KTR). మరోవైపు టీపీసీసీ చీఫ్‌ రేవంత్‌రెడ్డి ఈఘటనపై దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం న్యాయం చేయాలని డిమాండ్ చేశారు.

ప్రధాని విచారం వ్యక్తం ..

సికింద్రాబాద్‌లో జరిగిన ఘోర అగ్నిప్రమాదంలో మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. రైల్వేస్టేషన్‌ ఎదురు రోడ్డులో.. ప్రాంతీయ పాస్‌పోర్టు కార్యాలయం సమీపంలో రూబీ లగ్జరీ ప్రైడ్‌ పేరుతో ఐదంతస్తుల భవనంలో పై ఫ్లోర్లలో లాడ్జి ఉండగా సెల్లార్‌, గ్రౌండ్‌ ఫ్లోర్లలో రూబీ ఎలక్ట్రిక్‌ వాహనాల షోరూం నడుస్తోంది. సోమవారం రాత్రి 9గంటల తర్వాత షో రూమ్ గోడౌన్ షార్ట్‌ సర్క్యూట్ కారణంగా ఒక ఈ-స్కూటర్‌ పేలిపోయింది. దాని మంటలు చూస్తుండగానే పైన ఉన్న లాడ్జీకి వ్యాపించాయి.

Flood Effect: పూర్తిగా జలగ్బంధంలో రాజన్న సిరిసిల్ల జిల్లా.. అధికారుల కీలక హెచ్చరిక

ఐదు లక్షల పరిహారం ..

నిమిషాల వ్యవధిలోనే మంటలు, పొగ లాడ్జిని కమ్మేయడంతో లోపలున్న వాళ్ల బయటకు వెళ్లడానికి కుదరకపోవడంతో లోపలే ఉన్నారు. దీంతో ఊపిరాడక లోపలున్న వాళ్లు కాలిపోయారు. ప్రమాదం జరిగిన సమయంలో లాడ్జిలో సుమారు పాతిక మంది ఉన్నట్లుగా తెలుస్తోంది. అందులో మంగళవారం ఉదయానికి 8మంది చనిపోయారు. మరొకరి పరిస్థితి సీరియస్‌గా ఉంది. మరో ఆరుగురు గాంధీ ఆసుపత్రిలో ట్రీట్‌మెంట్ పొందుతున్నారు. మృతుల్లో విజయవాడకు చెందిన హరీష్, తమిళనాడుకు చెందిన సితారామన్,ఢిల్లీవాసి వితేంద్రతో పాటు మరొకరిని గుర్తించారు పోలీసులు. సికింద్రాబాద్‌ ఫైర్ యాక్సిడెంట్‌పై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు. మృతుల కుటుంబాలకు మోదీ పిఎంఎన్‌ఆర్‌ఎఫ్ నుండి 2 లక్షలు పరిహారం ప్రకటించారు. గాయపడిన వారి కుటుంబాలకు 50 వేలు చెల్లిస్తామని ప్రకటించారు.మృతుల కుటుంబాలకు సంతాపం తెలియజేశారు.

నిబంధనలకు విరుద్దంగా ..

ప్రమాదానికి కారణమైన ఎలక్ట్రిక్ వాహనాల షోరూం నిబంధనలకు విరుద్దంగా ఏర్పాటు చేసినట్లుగా పోలీసులు తేల్చారు. ఈకేసులో బగ్గా రంజిత్‌తో పాటు మరొకరిపై కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గురైన లాడ్జిని మంత్రులు తలసాని, మహమూద్‌ అలీ పరిశీలించారు. క్షతగాత్రులకు గాంధీ, యశోధ ఆసుపత్రుల్లో మెరుగైన చికిత్స అందించాలని ఆదేశించారు. ఈప్రమాదంలో ఎలక్ట్రిక్‌ వాహనాలు కూడా పెద్ద సంఖ్యలో దగ్ధమైనట్లుగా నార్త్ జోన్ డీసీపీ చందన దీప్తి తెలిపారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశమున్నట్లుగా చెప్పారు.

Published by:Siva Nanduri
First published:

Tags: CM KCR, Fire Accident, Hyderabad news, Narendra modi

ఉత్తమ కథలు