Home /News /telangana /

State Bank Of India: ఆ కస్టమర్ పోరాటానికి తలొగ్గిన ఎస్బీఐ.. ఇంతకు ఏం జరిగిందంటే..

State Bank Of India: ఆ కస్టమర్ పోరాటానికి తలొగ్గిన ఎస్బీఐ.. ఇంతకు ఏం జరిగిందంటే..

(ప్రతీకాత్మక చిత్రం)

(ప్రతీకాత్మక చిత్రం)

ఒక్కోసారి ఏటీఎం నుంచి డబ్బు రాకపోయినా.. ఖాతా నుంచి మాత్రం డబ్బు డెబిట్ అయిపోతుంటుంది. ఈ సమస్యను సంబంధిత బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్తే మళ్ళీ తిరిగి డబ్బులు ఇస్తారు. లేదా డబ్బు అదంతట అదే కొద్ది గంటల్లో ఖాతాలో జమ అవుతుంది. కానీ ఓ కస్టమర్ విషయంలో అలా జరగలేదు. చివరకు అతడు ఏం చేశాడో తెలుసా..

ఇంకా చదవండి ...
ఏటీఎం మిషన్లు వచ్చిన తరువాత లావాదేవీలు ఎంత సులభతరమయ్యాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. కానీ కొన్ని సందర్భాల్లో ఏటీఎం మిషన్లలో సాంకేతిక సమస్యలు తలెత్తడం వల్ల ట్రాన్సాక్షన్ లు ఫెయిల్ అవుతుంటాయి. ఒక్కోసారి ఏటీఎం నుంచి డబ్బు రాకపోయినా.. ఖాతా నుంచి మాత్రం డబ్బు డెబిట్ అయిపోతుంటుంది. ఈ సమస్యను సంబంధిత బ్యాంకు అధికారుల దృష్టికి తీసుకెళ్తే మళ్ళీ తిరిగి డబ్బులు ఇస్తారు. లేదా డబ్బు అదంతట అదే కొద్ది గంటల్లో ఖాతాలో జమ అవుతుంది. అయితే ఉదరు సర్వోత్తమ రెడ్డి అనే ఓ ఎస్‌బీఐ ఖాతాదారుడి విషయంలో మాత్రం అలా జరగలేదు. ఈ విషయంపై అతడు సంబంధిత బ్యాంకును ఆశ్రయించగా.. సరైన స్పందన లభించలేదు. దాంతో సదరు బాధితుడు వినియోగదారుల ఫోరమ్‌లో కేస్ ఫైల్ చేయగా.. రూ.29,500 వేలు చెల్లించాల్సిన పరిస్థితి ఎస్‌బీఐ అధికారులకి ఎదురైంది.

Twitter Video Download: ఐఓఎస్, ఆండ్రాయిడ్ ఫోన్‌లో ట్విట్టర్ వీడియోలను ఎలా సేవ్ చేయాలి.. తెలుసుకోండి..


వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ లోని చంపాపేట్ నివాసి అయిన సర్వోత్తమ రెడ్డికి.. కర్నూలు జిల్లా గడివేముల మండలంలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (SBI) లో సేవింగ్స్ అకౌంట్ ఉంది. సర్వోత్తమ రెడ్డి 2017లో జనవరి 26, 27 తేదీల్లో ఏటీఎం నుంచి రూ.10 వేలు విత్‌డ్రా చేసేటప్పుడు సాంకేతిక సమస్య ఎదురైంది. దీంతో డబ్బులు రాకపోగా అతని ఖాతా నుంచి ఫిబ్రవరి 15, 2017న మనీ కట్ అయింది. ఈ విషయంపై ఆయన బ్రాంచ్ మేనేజర్ కు ఫిర్యాదు చేశారు. కానీ సదరు బ్రాంచ్ మేనేజర్ నుంచి సరైన సమాధానం లభించలేదు. చీఫ్ జనరల్ మేనేజర్ ని కలవాలంటూ గడివేముల బ్రాంచ్ మేనేజర్ సలహా ఇవ్వడంతో సర్వోత్తమ రెడ్డి అతన్ని కలిశారు.

Realme: దసరా బొనాంజా.. రియల్ మీ నుంచి మరికొన్ని స్మార్ట్ ప్రొడక్ట్స్ లాంచ్.. అవి ఏంటంటే..


అప్పుడు ఈ ట్రాన్సాక్షన్ “ATM క్యాష్ డిస్‌బర్స్ అమౌంట్ టూ నాట్ DR REV " అనే స్టేటస్ లో ఉందని.. ఆల్రెడీ రూ.10,000 విత్‌డ్రా చేసినట్లు తమ రికార్డ్స్ చూపిస్తున్నాయని అధికారులు వెల్లడించారు. అసలు తాను డబ్బులు విత్‌డ్రా చేయలేదని సర్వోత్తమ రెడ్డి చెప్పినా వినలేదు. దీంతో జులై 24న బ్యాంకుకు ఆయన ఒక నోటీసు జారీ చేశారు. అయినప్పటికీ ఎస్‌బీఐ అధికారుల నుంచి ఎలాంటి స్పందన రాలేదు.

దీంతో చిర్రెత్తుకొచ్చిన సదరు బాధితుడు తనకి నష్టపరిహారంగా రూ.90 వేలతో పాటు తన రూ.10వేలు ఇప్పించవలసిందిగా జిల్లా కన్స్యూమర్ ఫోరమ్ III హైదరాబాద్ ను ఆశ్రయించాడు. దాంతో వినియోగదారుల ఫోరమ్‌ సాక్ష్యాధారాలను నిశితంగా పరిశీలించి ఫిర్యాదుదారుడికి రూ.లక్ష చెల్లించాలని ఎస్‌బీఐ అధికారులకు ఆదేశించింది. దీనిపై ఎస్‌బీఐ అధికారులు తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్‌ లో రివ్యూ పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసుపై విచారణ తర్వాత తెలంగాణ రాష్ట్ర వినియోగదారుల వివాదాల పరిష్కార కమిషన్ అధ్యక్షుడు జస్టిస్ ఎంఎస్‌కె జైస్వాల్ తుది తీర్పు ఇచ్చారు.

New Smart Phone: ఇండియాలో లాంచ్ కానున్న కొత్త స్మార్ట్‌ఫోన్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే..


సర్వోత్తమ రెడ్డి ఖాతాకు 2017 ఫిబ్రవరి 15న డబ్బు జమ చేసినట్టు ఎస్‌బీఐ పేర్కొంది కాబట్టి.. ఆ సమయం నుంచి ఇప్పటివరకు 9% వార్షిక వడ్డీతో సహా రూ.10 వేలు చెల్లించాలని ఎస్‌బీఐని జైస్వాల్ ఆదేశించారు. దీంతో పాటు ఫిర్యాదు దారుడికి ఇబ్బందులు కలిగించినందున రూ .10,000 నష్టపరిహారం, వ్యాజ్యం ఖర్చుల కోసం మరో రూ.5,000 చెల్లించాలని ఆదేశించారు. దీంతో ఉదరు సర్వోతమ రెడ్డికి సుమారు రూ.29,500 చెల్లించడం ఎస్‌బీఐ అధికారులకు అనివార్యమైంది.

మీ నగరం నుండి (​హైదరాబాద్)

తెలంగాణ
​హైదరాబాద్
తెలంగాణ
​హైదరాబాద్
Published by:Veera Babu
First published:

Tags: Sbi, Sbi card

తదుపరి వార్తలు