Home /News /telangana /

HYDERABAD SANGAREDDY MLA JAGGAREDDY HAS MADE SENSATIONAL ALLEGATIONS AGAINST TPCC CHIEF REVANTH REDDY AND HE WARNED THAT ALL THE SECRETS WOULD BE REVEALED SOON PRV

Congress meeting: పీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు.. ఆయన ఏం చేశారో బయటపెడుతానంటూ..

జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి (ఫైల్​ ఫొటోలు)

జగ్గారెడ్డి, రేవంత్ రెడ్డి (ఫైల్​ ఫొటోలు)

తెలంగాణ పీసీసీ (PCC)లో జరుగుతున్న పరిణామాలపై లోలోన రగిలిపోతున్న సీనియర్లంతా(Congress senior leaders) ఒక్కటయ్యారు. ఒక్కతాటిపైకి వచ్చారు. భేటీకి వెళ్లే ముందు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి సంచలన ఆరోపణలు చేశారు.

    కొంతకాలంగా తెలంగాణ పీసీసీ (PCC)లో జరుగుతున్న పరిణామాలపై రగిలిపోతున్న సీనియర్లంతా (Congress senior leaders) ఒక్కటయ్యారు. ఒక్కతాటిపైకి వచ్చారు. హైదరాబాద్ (Hyderabad) నగరంలోని ఓ ప్రైవేట్‌ హోటల్‌లో మీటింగ్ ఏర్పాటు చేసుకున్నారు. హోటల్ అశోక (Hotel Ashoka)కు నాయకులు చేరుకున్నారు.  ఇప్పటికే ఈ మీటింగ్‌కు వెళ్లొద్దంటూ సీనియర్లకు హైకమండ్‌ నుంచి ఫోన్లు వెళ్లాయి. అయినా కూడా బేఖాతరు చేస్తూ సీనియర్లు సమావేశం పెట్టారు. అయితే భేటీకి వెళ్లే ముందు సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి (Sangareddy MLA Jaggareddy) సంచలన ఆరోపణలు చేశారు. టీపీసీసీ చీఫ్​ రేవంత్ రెడ్డి (TPCC Chief Revanth reddy) బండారం బయటపెడుతున్నారు. టీడీపీలో ఉండగా రేవంత్​ ఎవరెవరిని కలిశారో లిస్టు బయట పెడుతానని చెప్పారు. తనను సస్పెండ్​ చేసినా పర్వాలేదని జగ్గారెడ్డి అన్నారు.

    మంత్రి హరీష్ రావును తన కూతురు కోసం వి. హనుమంతరావు కలిశాడని జగ్గారెడ్డి చెప్పారు. ఇందులో తప్పేం ఉందన్నారు హనుమంతరావు కూతురు డాక్టర్ అని, ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న హరీష్ రావును వి. హనుమంతరావు కలవడాన్ని కూడా తప్పు బడితే ఎలా అన్నారు. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో టీడీపీ వాళ్లు కలవలేదా, టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో కాంగ్రెస్ వాళ్లు మంత్రులను కలవలేదా అని జగ్గారెడ్డి ప్రశ్నించారు.

    తప్పుడు సమాచారం అందించారు..

    తనకు ఏ ఒక్కరు కూడా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతల సమావేశానికి (Congress meeting) హాజరు కావొద్దని చెప్పలేదని కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి చెప్పారు. తనపై పార్టీ అధిష్టానానికి రేవంత్​, మాణికం ఠాగూర్ తప్పుడు సమాచారం అందించారని చెప్పారు. పార్టీ నేత మహేష్ గౌడ్ తో తాను ఏ క్షణంలోనైనా టీఆర్ఎస్ (TRS) లో చేరుతానని పార్టీ అధినాయకత్వానికి చెప్పించారని జగ్గారెడ్డి మండిపడ్డారు.

    రాష్ట్ర నాయకత్వంపై అనుమానాలున్నాయని..

    తెలంగాణ (Telangana)లో కాంగ్రెస్​ అధికారంలోకి రాకున్నా కూడా తాను పార్టీలోనే కొనసాగుతున్నానని జగ్గారెడ్డి చెప్పారు. పార్టీ రాష్ట్ర నాయకత్వంపై తమకు అనుమానాలున్నాయని జగ్గారెడ్డి తెలిపారు. పార్టీకి మేలు చేయాలనే ఉద్దేశ్యంతోనే తాము ఈ సమావేశం (Congress meeting) ఏర్పాటు చేశామన్నారు. ఈ సమావేశం వల్ల పార్టీని నష్టం లేదని ఆయన అభిప్రాయపడ్డారు. Hanumantha Rao తనకు ఫోన్ చేసి ఈ సమావేశానికి రావాలని కోరారు. అందుకే ఈ సమావేశానికి హాజరైనట్టుగా జగ్గారెడ్డి చెప్పారు.

    చెప్పకూడదని నిర్ణయించుకున్నాం..

    ఇంతకముందు శశిధర్ రెడ్డి నివాసంలో జరిగిన సమావేశంలో ఏం జరిగిందో మీడియాకు చెప్పకూడదని నిర్ణయం తీసుకొన్నామన్నారు. తాను కూడా Sonia gandhi Rahhul ganhiల అపాయింట్ మెంట్ కోసం ప్రయత్నిస్తున్నామని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో పార్టీలో చోటు చేసుకొన్న సమస్యలపై చర్చించేందుకు గాను Manickam Tagore చొరవ చూపడం లేదన్నారు. ఈ విషయమై తాము సమావేశమై సోనియా, రాహుల్ లకు వివరించాలని ఈ సమావేశం నిర్వహిస్తున్నామన్నారు.పార్టీని బలోపేతం చేసేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ఈ సమావేశంలో నిర్ణయం తీసుకొని పార్టీ అధినాయకత్వానికి నివేదిక ఇస్తామని జగ్గారెడ్డి తెలిపారు
    Published by:Prabhakar Vaddi
    First published:

    Tags: Jagga Reddy, Revanth Reddy, TS Congress

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు