Saidabad Rape Case: సైదాబాద్ రేప్ కేసు.. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏం జరిగింది? టైమ్ లైన్

సైదాబాద్ హత్యాచార కేసులో నిందితుడు రాజు (File)

Saidabad Rape Case Latest News | హైదరాబాద్‌లోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై అత్యాచారం, హత్య కేసు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే గురువారం నిందితుడు రాజు మృతదేహాన్ని స్టేషన్‌ ఘన్‌పూర్‌ సమీపంలోని నాష్కల్‌ రైల్వే ట్రాక్‌పై గుర్తించారు.

 • Share this:
  హైదరాబాద్‌లోని సైదాబాద్‌ సింగరేణి కాలనీలో ఆరేళ్ల బాలికపై (Saidabad Rape Case) అత్యాచారం, హత్య కేసు తీవ్ర కలకలం రేపిన సంగతి తెలిసిందే. గత గురువారం జరిగిన ఈ ఘటనకు సంబంధించి తొలుత బాలిక అనుమానస్పద స్థితిలో మృతిచెందిందని భావించారు. కానీ తల్లిదండ్రులు అనుమానంతో కేసులో అసలు విషయాలు వెలుగులోకి వచ్చాయి. బాలిక ఇంటికి పక్కనే ఉండే రాజు అనే వ్యక్తి బాలికపై బాలికపై అత్యాచారం జరిపి, హత్య చేసినట్టుగా తేలింది. ఆ తర్వాత ఈ ఘటన పెను సంచలనంగా మారింది. నిందితుడిని కఠినంగా శిక్షించాలని సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున డిమాండ్ వినిపించింది. అదే స్థాయిలో బాలికపై అఘాయిత్యానికి పాల్పడిన వ్యక్తిని అరెస్ట్ చేయాలని స్థానికులు, ప్రతిపక్ష నాయకులు నిరసలు తెలిపారు. ధర్నాలు చేపట్టారు. పోలీసులు కూడా నిందితుడు రాజు ఆచూకీ తీవ్రంగా గాలించారు. అతడిని పట్టించిన వారికి రూ. 10 లక్షల రివార్డు ప్రకటించారు. అయితే చివరకు నిందితుడు రాజు ఆత్మహత్య చేసుకున్నాడు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ సమీపంలోని నాష్కల్‌ రైల్వే ట్రాక్‌పై రాజు మృతదేహాన్ని గుర్తించారు. చేతిపై పచ్చబొట్టు ఆధారంగా నిందితుడిని నిర్ధారించారు.

  అయితే ఈ ఘటనకు సంబంధించి వారం రోజులుగా కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. గురువారం(సెప్టెంబర్ 9) రోజున సాయంత్రం గురువారం సాయంత్రం పెరుగు తీసుకురావడానికి వెళ్లిన బాలిక ఆచూకి కనిపించలేదు. ఎంత వెతికినా ఆచూకి లభించకపోవడంతో కుటుంబసభ్యులకు ఇంటికి సమీపంలోనే ఉండే రాజుపై అనుమానం వచ్చి అతని ఇంటికి వెళ్లారు.

  Revanth reddy : రాష్ట్రంలో విచ్చలవిడిగా గంజాయి.. మత్తు విక్రయాలు.. దాని ఫలితమే సైదాబాద్ ఘటన  కుటుంబసభ్యులు, స్థానికులు ఆ ఇంటి తాళం పగలగొట్టి చూశారు. అక్కడ బాలిక మృతదేహం కనిపించడంతో అంతా కన్నీటి పర్యంతమయ్యారు. ఈ ఘటన తర్వాత నిందితుడు రాజు కనిపించకుండా పోయాడు. పరారీలో ఉన్న అతడి కోసం పోలీసులు తీవ్రంగా గాలింపు చేపట్టారు. సీసీటీవీ ఫుటేజ్ దృశ్యాల ఆధారంగా నిందితుడు ఆచూకీ కనిపెట్టేందుకు ప్రయత్నించారు.

  saidabad rape : సైదాబాద్ నిందితుడు ఆత్మహత్య.. కోణార్క్ ఎక్స్‌ప్రెస్ కింద పడ్డట్టు ప్రత్యక్ష సాక్షుల కథనం

  మరోవైపు ఈ ఘటనను నిరసిస్తూ స్థానికంగా, రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో నిరసనలు వెల్లువెత్తాయి. సాగర్ హైవే‌పై బాధిత కుటుంబ సభ్యులతో కలిసి స్థానికులు, రాజకీయ పార్టీలు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టాయి. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయాలని, నిందితుడిని నడి రోడ్డుపై ఎన్‌కౌంటర్ చేయాలని వారు డిమాండ్ చేశారు.

  ఈ క్రమంలోనే ఆందోళనకారుల వద్దకు హైదరాబాద్ జిల్లా కలెక్టర్ శర్మన్, పోలీసు ఉన్నతాధికారులు చేరుకున్నారు. వారితో మాట్లాడారు. ప్రభుత్వం తరపున బాలిక కుటుంబాన్ని ఆదుకుంటామని, నిందితుడిని వీలైనంత త్వరగా పట్టుకుని శిక్షపడేలా చేస్తామని హామీ ఇచ్చారు.

  ఈ ఘటనపై రాష్ట్ర మంత్రి రాష్ట్ర మంత్రి సత్యవతి రాథోడ్ కూడా స్పందించారు. దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పారు. బాలిక కుటుంబాన్ని ఆదుకునేందుకు తక్షణం రూ.50వేల ఆర్ధిక సాయం ప్రకటించారు. అయితే న్యాయం కోసం నిరసన వ్యక్తం చేసిన తమపై పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని కుటుంబ సభ్యులు, స్థానికులు ఆరోపించారు.

  మీడియాపై నెటిజన్ల ఫైర్..
  ఈ ఘటనకు మీడియాలో ప్రాధాన్యం లభించలేదని పలువురు నెటిజన్లు మండిపడ్డారు. మీడియాలో కొన్ని ఘటనలు ఎక్కువగా చూపిస్తున్నారని.. ఇంత దారుణమైన ఘటనపై మాత్రం సరైన స్పందన లేదని కొందరు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టు చేశారు.

  saidabad rape : సైదాబాద్ నిందితుడు రాజు ఆత్మహత్య.. రైల్వే ట్రాక్ పై మృతదేహం..  నిందితుడిని పట్టించిన వారికి రూ. 10 లక్షల రివార్డు..
  నాలుగు రోజులు గడిచిన రాజు ఆచూకీ దొరక్కపోవడంతో పోలీసులు తమ చర్యలను మరింత విస్తృతం చేశారు. నిందితుడు రాజు ఆచూకీ తెలిపిన వారికి పోలీసులు రూ.10లక్షల రివార్డు కూడా ప్రకటించారు. ఈ క్రమంలోనే మంగళవారం పోలీసులు.. నిందితుడు రాజు ఫొటోను , అతడికి సంబంధించిన గుర్తులకు సంబంధించిన వివరాలను సోషల్ మీడియా వేదికగా విడుదల చేశారు. అతని ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలని కోరారు. ఆటోలు, బస్సులు, ఇతర బహిరంగ ప్రదేశాల్లో పోస్టర్లతో విస్తృతంగా ప్రచారం చేశారు. ఆటోల వెనకాల.. జన సంచారం ఉన్న ప్రదేశాలలో నిందితుడి ఫొటోలతో కూడిన పోస్టర్లను అంటించారు.

  సోషల్ మీడియా వేదికగా ఫైర్ అయిన ప్రముఖులు..
  ఈ ఘటనపై పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. హీరో మంచు మనోజ్‌(Manchu Amnoj) బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. నిందితుడుని పట్టుకుని 24గంటల్లో ఉరితీయాలని డిమాండ్‌ చేశారు. ఆరేళ్ల చిన్నారిపై జరిగిన ఈ దారుణం సమాజంలో పరిస్థితులు ఎంతలా దిగజారాయో గుర్తుచేస్తోందని ప్రముఖ సినీ హీరో మహేష్ బాబు(Mahesh Babu) ఆవేదన వ్యక్తం చేశారు. ‘మన కుమార్తెలు ఎప్పుడైనా సురక్షితంగా ఉంటారా?.. అనేది ఎల్లప్పుడూ ఒక ప్రశ్న. బాధిత కుటుంబం ఎంతటి బాధని అనుభవిస్తుందో ఊహించలేను’అని మహేష్ ట్వీట్ చేశారు.

  Siricilla : రియల్ బిచ్చగాళ్లు.. అమ్మకోసం వినాయకుడి లడ్డుల దొంగతనం ..  ఇక, మరో హీరో నాని కూడా తీవ్ర స్థాయిలో స్పందించారు. ‘నిందితుడు బయట ఎక్కడో ఉన్నాడు.. ఉండకూడదు’ అని ట్విట్ చేశారు. ఇక, నిందితుడిని నిందితుడిని పట్టించిన వారికి తన వంతుగా మరో రూ.50 వేలు ఇస్తానని సంగీత దర్శకుడు ఆర్పీపట్నాయక్‌ తెలిపారు.

  బాధిత కుటుంబాన్ని పరామర్శించిన రాజకీయ ప్రముఖులు..
  బాలిక కుటుంబ సభ్యులను సోమవారం.. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి(Revanth Reddy), కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క, బీఎస్పీనేత ప్రవీణ్‌కుమార్‌‌తో పాటుగా పలువురు పరామర్శించారు. ఘటన జరిగి నాలుగు రోజులు గడుస్తున్న ప్రభుత్వం నిందితుడిని అరెస్ట్ చేయకపోవడంపై మండిపడ్డారు. బాధిత కుటుంబానికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ తీరుపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.

  బాలిక హత్యాచార ఘటనపై ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు సీతక్క అన్నారు. నిందితుడికి గంజాయి మాఫియాతో సంబంధాలు ఉన్నాయనే అనుమానం కలుగుతోందని వ్యాఖ్యానించారు.

  మరోవైపు ఈ ఘటనపై స్పందించిన మంత్రి మల్లారెడ్డి.. నిందితుడిని ఎన్‌కౌంటర్ చేయాల్సిందేనన్నారు. సింగరేణి కాలనీలో బాలికపై అత్యాచారం చేసి, హత్య చేసిన నిందితులను ఎన్‌కౌంటర్ చేస్తామని చెప్పుకొచ్చారు.

  బుధవారం.. బాధిత బాలిక కుటుంబాన్ని కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి పరామర్శించారు. ప్రజలకు రక్షణ లేకపోతే ప్రభుత్వం ఎందుకని ప్రశ్నించారు. నిందితుడిని 24 గంటల్లో పట్టుకుని శిక్షించాలని డిమాండ్‌ చేశారు. బాధిత కుటుంబాన్ని ఓదార్చేందుకు రాష్ట్ర హోంమంత్రి, స్థానిక ఎమ్మెల్యే, కేసీఆర్, కేటీఆర్‌లు రాకపోవడం బాధాకరమన్నారు.

  ఇక, జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ బుధవారం సాయంత్రం బాధిత బాలిక కుటుంబ సభ్యులను పరామర్శించారు. వారితో మాట్లాడారు. ఇంట్లోంచి బయటకు వెళ్లిన చిన్నారిని దారుణంగా హత్యచేయడం దుర్మార్గమని పవన్ ఆవేదన వ్యక్తం చేశారు. కుటుంబసభ్యులు అనుమానం వ్యక్తంచేసినప్పుడే పోలీసులు స్పందించలేదని విమర్శించారు. అందుకే ఇప్పటికీ నిందితుడు ఆచూకీ దొరకడం లేదని అన్నారు.

  వైఎస్ షర్మిల దీక్ష..
  బుధవారం సైదాబాద్‌కు వచ్చిన వైఎస్సార్‌టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల.. బాధిత బాలిక కుటుంబాన్ని పరామర్శించారు. అనంతరం ఈ ఘటనపై సీఎం కేసీఆర్ స్పందించేవరకు తాను అక్కడి నుంచి కదలనని.. దీక్షకు దిగారు. అయితే బుధవారం అర్ధరాత్రి దాటాక పోలీసులు ఆమె దీక్షను భగ్నం చేశారు. అనంతరం షర్మిలను లోటస్ పాండ్‌లోని నివాసానికి తరలించారు. ఆమె ఇంట్లో కూడా దీక్షను కొనసాగిస్తున్నట్టుగా వైఎస్సార్‌టీపీ వర్గాలు తెలిపాయి.

  బాలిక కుటుంబాన్ని పరామర్శించిన మంత్రులు..
  బాధిత బాలిక కుటుంబానికి గురువారం ఉదయం మంత్రులు మహమూద్ అలీ, సత్యవతి రాథోడ్ పరామర్శించారు. బాధలో ఉన్నవారికి ధైర్యం చెప్పారు. వారి కుటుంబానికి అన్ని రకాలుగా అండగా ఉంటామని మంత్రులు హామీ ఇచ్చారు. అయితే మంత్రులు అక్కడికి చేరుకున్న సమయంలో స్థానికులు కొందరు వారికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అక్కడ భారీ భద్రత ఏర్పాటు చేశారు.
  రైల్వే ట్రాక్‌పై నిందితుడి మృతదేహం..
  వారం రోజులుగా పోలీసులకు కనిపించకుండా తిరిగిన నిందితుడు రాజు మృతదేహాన్ని స్టేషన్‌ ఘన్‌పూర్‌ సమీపంలోని నాష్కల్‌ రైల్వే ట్రాక్‌పై గుర్తించారు. ఈ విషయాన్ని డీజీపీ మహేందర్ రెడ్డి ధ్రువీకరించారు. స్టేషన్‌ ఘన్‌పూర్‌ వద్ద మృతదేహాన్ని గుర్తించామని.. నిందితుడి శరీరంపై ఉన్న గుర్తుల ఆధారంగా ఐ నిర్ధారించినట్లు ఆయన తెలిపారు. హైదరాబాద్ వైపు వస్తున్న కోణార్క్ ఎక్స్‌ప్రెస్ కింద పడి రాజు ఆత్మహత్య చేసుకున్నట్టు ప్రత్యక్ష సాక్ష్యులు చెప్పినట్టుగా తెలుస్తోంది.
  Published by:Sumanth Kanukula
  First published: