HYDERABAD SAI PALLAVI IN BURQA WATCHED SHYAM SINGA ROY MOVIE IN HYDERABAD SNR
Sai Pallavi in Burqa: బుర్ఖాలో సినిమాకెళ్లిన సాయిపల్లవి.. ఎలా ఉందో చూడండి..
బుర్ఖాలో సినిమాకు వెళ్లిన సాయి పల్లవి
SAI PALLAVI: ఫిదా హీరోయిన్ సాయిపల్లవి తాను అందరిలా కాదు అని మరోసారి రుజువు చేసుకుంది. శ్యామ్‌సింగరాయ్ సినిమాని సాధారణ ప్రేక్షకురాలిగా థియేటర్‌కి వెళ్లి చూసి అందరిని ఆశ్చర్యపరిచింది. బుర్ఖా వేసుకొని సినిమా డైరెక్టర్‌తో కలిసి ముసాపేటలోని ఓ థియేటర్లో ప్రేక్షకుల అభిప్రాయాన్ని తెలుసుకుంది సాయిపల్లవి.
సినిమాలో హీరోయిన్ కనిపిస్తే చాలు అభిమానులు థియేటర్లలో ఈల వేసి గోల చేస్తారు. అలాంటి హీరోయిన్ ఏకంగా సినిమా థియేటర్‌కే వస్తే ఇంకా ఏమైనా ఉందా..! అంతటి సాహసం ఏ హీరోయిన్ చేస్తుంది చెప్పండి అని ప్రశ్నించ వద్దు. ఆ సాహసం చేసింది ఓ హీరోయిన్. ఆమె ఎవరో కాదు.. ఫిదా సినిమాతో సౌత్ ఆడియన్స్‌ని కట్టిపడేసింది సాయిపల్లవి (Sai Pallavi). తెలుగుతో పాటు దక్షిణాది భాషల్లో యాక్ట్ చేస్తూ బిజీగా ఉన్న ఈ హీరోయిన్ తన లేటెస్ట్ మూవీ శ్యామ్‌సింగరాయ్ (Shyam Singha Roy) సినిమా చూసేందుకు హైదరాబాద్ (Hyderabad) మూసాపేటలోని శ్రీరాములు థియేటర్‌కు వెళ్లింది. అంతే కాదు.. అందులో తన పాత్ర, నటన ఎలా ఉందో పక్కన కూర్చున్న ప్రేక్షకులను అడిగి ఫీడ్ బ్యాక్ తీసుకుంది. అదేంటి ఒక హీరోయిన్ సాధారణ ప్రేక్షకురాలిగా వచ్చి సినిమా చూస్తుంటే ఎవరూ ఆమెను గుర్తు పట్టలేదా అనే కదా మీ డౌట్. గుర్తు పట్టలేదు. ఆమె చెప్పే వరకూ ఎవరూ ఆమె సాయిపల్లవి అని గుర్తించలేకపోయారు. ఎందుకంటే ఆమె నల్లని బుర్ఖా (Sai Pallavi in Burkha) వేసుకొని వచ్చి సినిమా చూసింది కాబట్టి. అంతే కాదు.. ఎవరూ తనను గుర్తు పట్టే అవకాశం లేకుండా శ్యామ్‌సింగరాయ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యన్ (Rahul Sankrityan) పక్కనే కూర్చొని సినిమా చూసింది.
ఫ్యాన్స్‌ని సర్ప్రైజ్ చేసిన ఫిదా భామ..
సినిమా స్టార్లంటే మూవీ రిలీజ్ రోజు మొదటి ఆట ..అది కూడా స్పెషల్‌గా చిత్ర యూనిట్ అంతా కలిసి షో వేసుకొని చూస్తారు. ఇంకొందరైతే పెద్ద పెద్ద మల్టీప్లెక్స్ థియేటర్లో ఫ్యామిలీతో కలిసి చూస్తారు. కానీ ఫస్ట్ టైమ్ సాయిపల్లవి ఇలా సినిమా థియేటర్‌కు వచ్చి ప్రేక్షకురాలిగా చూసిందని తెలిసి ఆశ్చర్యపోతున్నారు అభిమానులు. సినిమా అయిపోయిన తర్వాత థియేటర్ బయటకు వచ్చి బుర్ఖా తీసి అందరికి బై చెబుతూ కారెక్కి వెళ్లిపోయింది. సాయిపల్లవి సర్ప్రైజ్ విజిట్ పేరుతో నిర్మాతలే ఇలా ప్లాన్ చేశారు. సాయి పల్లవి థియేటర్‌కి వచ్చి మూవీ చూసిన విజువల్స్ సోషల్ మీడియాలో షేర్ చేసుకుంది. అయితే తర్వాత వచ్చే సమస్యల్ని దృష్టిలో పెట్టుకొని వెంటనే తొలగించింది.
మారు వేషంలో టాప్ హీరోయిన్..
మంచి డ్యాన్సర్‌గా పేరు తెచ్చుకున్న హీరోయిన్ సాయిపల్లవి శ్యామ్‌సింగరాయ్‌లో రోసిగా యాక్ట్ చేసింది. ఈ సినిమాలో కూడా అంతే ప్రత్యేకమైన పాత్రను పోషించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో రిలీజైన ఈసినిమా సక్సెస్‌ఫుల్‌గా దూసుకెళ్తోంది. ఇందులో హీరో నాని డ్యూయెల్ రోల్లో కనిపించారు. యాక్షన్ స్కోప్ ఉన్న పాత్రలను సెలక్ట్ చేసుకొని ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ స్టేటస్‌ని నిలబెట్టుకుంటోంది సాయిపల్లవి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.