(K.Veeranna,News18,Medak)
తెలంగాణ (Telangana)ప్రభుత్వం రైతులకు ఎంతో కొంత సాయం చేయాలని పంట పెట్టుబడి కోసం రైతుబంధు(Rythu bandhu)పథకం ద్వారా రైతులకు వారి బ్యాంకు ఖాతా(Bank Account)లో దశల వారిగా డబ్బులు జమ చేస్తోంది. రాష్ట్రంలోని అర్హత కలిగిన ప్రతి రైతుకు ఎకరానికి ఇంత అని నగదు రూపంలో ఇస్తూ వస్తోంది. సిద్దిపేట(Siddipeta)జిల్లాకు చెందిన ఓ రైతు ప్రభుత్వం రైతుబంధు పథకం కింద ఇస్తున్న డప్పులను తిరిగి ప్రభుత్వానికి అందజేశారు. చెక్కు(Cheque) రిటర్న్ ఇచ్చిన రైతును కారణం తెలుసుకొని జిల్లా కలెక్టర్(Collector)అభినందించారు.
రైతు బంధు చెక్కు వాపస్..
రైతు పడే కష్టం మరో రైతుకు మాత్రమే తెలుస్తోంది. సాగు మొదలుపెట్టినప్పటికి నుంచి పంట చేతికొచ్చే వరకు రైతులు పడే అగచాట్లు అన్నీ ఇన్నీ కావు. అందుకే తెలంగాణ సర్కారు రాష్ట్రంలోని రైతులకు పెట్టుబడి సాయం కింద ఎకరానికి కొంత డబ్బును అందజేస్తూ వస్తోంది. తాజాగా సిద్దిపేట జిల్లా కేంద్రానికి చెందిన చక్రధర్ గౌడ్, కనకలక్ష్మి అనే వ్యక్తులు తమకున్న 10 ఎకరాలకు ప్రభుత్వం అందజేసిన రైతుబంధు చెక్కును వద్దని చెప్పి జిల్లా కలెక్టర్‌కు అందజేశారు.
సన్నకారు రైతుల శ్రేయస్సు కోసం..
సిద్దిపేట జిల్లా కలెక్టర్ కార్యాలయంలో గురువారం రైతు బంధు లబ్ధిదారులు గాదగోని చక్రధర్ గౌడ్, కనకలక్ష్మి తమ రైతు బంధును వెనక్కి తీసుకోవాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, వ్యవసా శాఖాధికారి శివప్రసాద్ సమక్షంలో తిరిగి ఇచ్చారు. చెక్కుతో పాటు వినతిపత్రాన్ని కూడా అందజేశారు. వాస్తవంగా రైతుబంధు నిధుల కోసం ఎదురుచూసే రైతుల గురించి ఆలోచించే అధికారులు రైతులు చెక్కును వెనక్కి తీసుకొచ్చి ఇవ్వడంతో కారణం అడిగి తెలుసుకున్నారు. రైతులు చక్రధర్‌గౌడ్, కనకలక్ష్మి తమకు 10ఎకరాల వ్యవసాయ భూమి ఉందని అంతే కాకుండా తాను ఫార్మర్స్ ఫౌండేషన్ చైర్మన్ అని రైతుల సంక్షేమం కోసం ఈ నిర్ణయం తీసుకున్నట్లుగా తెలిపారు. ఆర్థికంగా ఉన్నవారు రైతుబంధు పొందడం సరైంది కాదనే ఆలోచనతోనే ఈ చెక్కును తిరిగి ఇచ్చేస్తున్నట్లుగా తెలిపారు.
అభినందించిన జిల్లా కలెక్టర్ ..
ప్రభుత్వ ధనం ప్రజాధనంగా భావించి అర్హులకు అందితే మంచిదనే సంకల్పంతో చెక్కును తిరిగి ఇచ్చిన రైతులను కలెక్టర్ అభినందించారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న రైతు బంధు పధకం చిన్నకారులకు ఉపయోగపడాలని ఇప్పటికి కొందరు రైతులకు రైతుబంధు నగదు డిపాజిట్ కాకపోవడంతో పరిస్థితిని గ్రహించి ఈ నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. జిల్లా కలెక్టర్‌కి రైతుబంధు చెక్కును తిరిగి ఇచ్చేందుకు వెళ్లిన సమయంలో రైతులతో పాటు ఫార్మర్స్ ఫౌండేషన్ సభ్యులు శ్రవణ్ కుమార్ గౌడ్, కస్తూరి హరీష్, ప్రశాంత్, సతీశ ఉన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Rythu bandhu, Siddipeta, Telangana News