హోమ్ /వార్తలు /తెలంగాణ /

TSRTC MD Sajjanar: ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ కీల‌క నిర్ణ‌యం.. ఇక వాటిని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ..

TSRTC MD Sajjanar: ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ కీల‌క నిర్ణ‌యం.. ఇక వాటిని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ..

ఆర్టీసీ బస్సులపై సినిమా పోస్టర్లు (ఫైల్)

ఆర్టీసీ బస్సులపై సినిమా పోస్టర్లు (ఫైల్)

TSRTC MD Sajjanar: ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ కీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు. ఆర్టీసీ బ‌స్సుల‌పై ఆశ్లీల పోస్ట‌ర్ల‌ను నిషేధించారు. ఈ మేర‌కు ఆయ‌న ఉత్త‌ర్వులు జారీ చేశారు. పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి

ఐపీఎస్ ఆఫీసర్ గా తనకంటూ ఓ మార్క్ ను క్రియేట్ చేసుకున్న సన్సెషనల్ ఐపీఎస్ వీసీ సజ్జనార్ గత కొన్న రోజుల కిందట ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. బాధ్యతులు స్వీకరించిన దగ్గర నుంచి పలు రకాల నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. తాజాగా అభిరాం అనే నెటిజన్ చేసిన ట్వీట్టర్ పోస్టుకు వీసీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అతడి పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ‘‘ఇవి మన బస్సులూ.. ఇదీ మన బహిరంగ ప్రచారం.. ఎవర్ని రెచ్చగొడుతున్నాం..? ఏం కోరుకుంటున్నాం.. సినిమాని వినోదంలా చూడమని సొల్లు కబుర్లు మాత్రం ఎవరూ చెప్పొద్దూ..’’అంటూ అతడు ట్వీట్టర్ లో ఆర్టీసీని ఉద్దేశించి.. పోస్టర్లను బస్సులకు అంటించొద్దని పరోక్షంగా చెప్పాడు.

VC Sajjanar: బస్సులో తానెవ్వరో చెప్పకుండా ప్రయాణించిన సజ్జనార్.. ఆయన ఇలా ఎందుకు చేశారంటే..


దీని ద్వారా యువత విపరీతంగా నష్టపోతుందని పేర్కొన్నాడు. ఆ ట్వీట్ విపరీతంగా వైరల్ కావడంతో @TSRTCHQ & My Self will look into it & ensure in future it doesn't happen అంటూ వీసీ సజ్జనార్ రిప్లై ఇచ్చారు. అంటే.. ఇకనుంచి ఆర్టీసీ బ‌స్సుల‌పై ఆశ్లీల పోస్ట‌ర్ల‌ను నిషేధం అంటూ చెప్పాడు. ఆర్టీసీ బ‌స్సుల‌పై అసౌక‌ర్యంగా, అభ్యంత‌ర‌క‌రంగా ఉండే పోస్ట‌ర్ల‌ను వెంట‌నే తొల‌గించాల‌ని సంబంధిత అధికారుల‌కు స‌జ్జ‌నార్ ఆదేశాలు జారీ చేశారు.

Telangana News: వామ్మో.. ఏందిది.. హుజురాబాద్ ఎన్నికల ప్రచారానికి దేవుడిని కూడా వదలట్లేదుగా.. వీడియో వైరల్..


ఇలా అభిరామ్ అనే ఓ జ‌ర్న‌లిస్టు.. ఆర్టీసీ బ‌స్సుల‌పై అంటించే ఆశ్లీల పోస్ట‌ర్ల విష‌యాన్ని స‌జ్జ‌నార్ దృష్టికి తీసుకెళ్లగా.. నెటిజ‌న్ ట్వీట్‌పై ఆర్టీసీ ఎండీ స్పందించారు. ఆర్టీసీ బ‌స్సుల‌పై ఇలాంటి పోస్ట‌ర్లు లేకుండా ఆర్టీసీ ఎండీగా చ‌ర్య‌లు తీసుకుంటాన‌ని స‌జ్జ‌నార్ ప్ర‌క‌టించారు. ఇచ్చిన ప్ర‌క‌ట‌న మేర‌కు ఆర్టీసీ బ‌స్సుల‌పై ఆశ్లీల ఫోటోల‌ను నిషేధిస్తూ ఆర్టీసీ ఎండీ ఉత్త‌ర్వులు జారీ చేశారు. దీనిపై నెటిజన్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. శుభపరిమాణం.. సజ్జానార్ సార్ రాకతొ తెలంగాణ ఆర్టీసీకి.. ప్రయాణికులకు మంచి జరుగుతోంది.. ఆర్టీసీ లాభాల్లో కి వెళ్లాలంటే.. రాజకీయ నాయకులను పుర్తిగా ఆ సంస్థ నుంచి బయటకు పంపించాలంటూ ఓ నెటిజన్ పోస్టు చేశారు.

First published:

Tags: Movie, Sajjanar, Tsrtc

ఉత్తమ కథలు