హోమ్ /వార్తలు /తెలంగాణ /

TSRTC MD Sajjanar : మరోసారి బస్సులో ప్రయాణించిన ఆర్టీసీ ఎండీ.. ఆ నిర్ణయంతో ఆనందంలో ఆర్టీసీ ఉద్యోగులు..

TSRTC MD Sajjanar : మరోసారి బస్సులో ప్రయాణించిన ఆర్టీసీ ఎండీ.. ఆ నిర్ణయంతో ఆనందంలో ఆర్టీసీ ఉద్యోగులు..

ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్

ఆర్టీసీ బస్సులో ప్రయాణం చేస్తున్న ఆర్టీసీ ఎండీ సజ్జనార్

TSRTC:  ఆర్టీసీ ఎండీ సజ్జనార్‌ మరోసారి బస్సులో ప్రయాణం చేశారు. ప్రయాణికులతో ముచ్చటించారు. అతడు రాజీవ్‌గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పంజాగుట్ట వరకు పుష్పక్‌ బస్సులో ప్రయాణించి మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక, తదితర రాష్ట్రాలకు చెందిన ప్రయాణికుల అభిప్రాయాలను తెలుసుకున్నారు.

ఇంకా చదవండి ...

ఐపీఎస్ ఆఫీసర్ గా తనకంటూ ఓ మార్క్ ను క్రియేట్ చేసుకున్న సన్సెషనల్ ఐపీఎస్ వీసీ సజ్జనార్ (VC Sajjanar) గత కొన్ని రోజుల కిందట ఆర్టీసీ ఎండీగా బాధ్యతలు స్వీకరించిన విషయం తెలిసిందే. బాధ్యతలు స్వీకరించిన దగ్గర నుంచి పలు రకాల నిర్ణయాలతో దూసుకుపోతున్నారు. ఆర్టీసీని లాభాల బాటలో నడిపించేందుకు తన వంతు కృషి చేస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా కనిపించే సజ్జనార్ ప్రయాణికుల నుంచి గానీ.. నెటిజన్ల నుంచి గానీ ఏదైనా రిక్వెస్ట్ వచ్చిందంటే వెంటనే పరిష్కారం చూపుతున్నారు. పోస్ట్ ఏదైనా తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సొంతం చేసుకుంటున్నారు.. ఐపీఎస్ అధికారి వీసీ సజ్జనార్(VC Sajjanar).

TSRTC MD Sajjanar: ఆర్టీసీ ఎండీ వీసీ స‌జ్జ‌నార్ కీల‌క నిర్ణ‌యం.. ఇక వాటిని నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ..


అతడు తాజాగా  ఆర్టీసీ బస్సులో సాధారణ వ్యక్తిగా ప్రయాణించారు. రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి పంజాగుట్ట వరకు పుష్పక్ బస్​లో ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ప్రయాణించారు. మహారాష్ట్ర, తమిళనాడు, కర్ణాటక తదితర రాష్ట్రాల నుంచి వచ్చిన ప్రయాణికులను టీఎస్​ఆర్టీసీ కల్పిస్తున్న రవాణా సౌకర్యాలపై అడిగి వారి అభిప్రాయాలను తెలుసుకున్నారు. మరింత మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు సలహాలు, సూచనలు ఇవ్వాలని ఆర్టీసీ ఎండీ విజ్ఞప్తి చేశారు. విధి నిర్వహణలో అనారోగ్యానికి గురై నిమ్స్‌లో చికిత్స పొందుతున్న ఆర్టీసీ డ్రైవర్‌ అంజయ్యను సజ్జనార్‌ పరామర్శించారు. డ్రైవర్‌ కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు. నిమ్స్‌ డైరెక్టర్‌ మనోహర్‌తో మాట్లాడి మెరుగైన వైద్యం అందజేయాలని కోరారు.

కొన్ని రోజుల క్రితం కూడా ఇలానే తనెవరో చెప్పకుండా జీడిమెట్ల డిపోకు చెందిన 9ఎక్స్ /272.. గండి మైసమ్మ నుంచి సీబీఎస్ రూట్‌లో వెళ్తున్న బస్సును లక్డీకాపూల్ బస్టాపులో సజ్జనార్ సాధారణ ప్రయాణికుడి మాదిరిగా ఎక్కారు. కండక్టర్‌కు తానెవరో చెప్పకుండా.. టికెట్ తీసుకుని ఎంజీబీఎస్ వరకు ప్రయాణించారు. ఆ తర్వాత ఎంజీబీఎస్‌లో(MGBS) కూడా సాధారణ వ్యక్తిలాగా తిరిగారు. బస్టాండు ప్రాంగణములోని పరిశుభ్రతను, ఏఏ ప్లాట్ ఫాం లలో ఏఏ రూట్ బస్సులు వెళ్తాయో తెలియజేసే సెక్టర్ వైజ్ రూట్ బోర్డును, విచారణ కేంద్రం, రిజర్వేషన్ కేంద్రాల పని తీరును పరిశీలించారు. అలాగే బస్టాండులోని మరుగుదొడ్ల పరిశుభ్రతను స్వయంగా పరిశీలించారు. ఫ్లాట్‌పామ్‌పై ఉన్న బస్సు సిబ్బందితో మాట్లాడి ఆదాయ వివరాలు అడిగారు. బస్సులోని ప్రయాణీకులతో మాట్లాడి రవాణా సేవల తీరును అడిగి తెలుసుకున్నారు.

అంతే కాకుండా మరో ఘటనలో అభిరాం అనే నెటిజన్ చేసిన ట్వీట్టర్ పోస్టుకు వీసీ స్పందించి కీలక నిర్ణయం తీసుకున్నారు. అతడి పోస్టు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో దానిపై నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఇవి మన బస్సులూ.. ఇదీ మన బహిరంగ ప్రచారం.. ఎవర్ని రెచ్చగొడుతున్నాం.. ఏం కోరుకుంటున్నాం.. సినిమాని వినోదంలా చూడమని సొల్లు కబుర్లు మాత్రం ఎవరూ చెప్పొద్దూ..అంటూ అతడు చేసిన ట్వీట్ కు స్పందించిన సజ్జనార్ వెంటనే పోస్టర్లను బస్సులకు అంటించొద్దని అధికారులకు జారీ చేశారు.

VC Sajjanar: బస్సులో తానెవ్వరో చెప్పకుండా ప్రయాణించిన సజ్జనార్.. ఆయన ఇలా ఎందుకు చేశారంటే..


సంతోషం వ్యక్తం చేస్తున్న ఆర్టీసీ ఉద్యోగులు..

వీసీ సజ్జనార్ ఆర్టీసీ ఎండీ బాధ్యతలు చేపట్టిన దగ్గర నుంచి ఎన్నో సమస్యలకు పరిష్కారం చూపించాడు. ఉద్యోగుల జీతాలకు సంబంధించి కీలక నిర్ణయం తీసుకొని.. ప్రతీ నెల ఒకటో తేదీన జీతం పొందే విధంగా చర్యలు తీసుకన్నారు. దీంతో ఉద్యోగులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. సజ్జనార్ ఎండీ అయిన దగ్గర నుంచి తమకు ఎంతో ప్రశాంతంగా ఉందని.. చాలా సమస్యలు పరిష్కారం అయ్యాయని ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ట్వీట్టర్ వేదికగా ఓ నెటిజన్ ఇలా కామెంట్ చేశాడు.. సార్ మీరు వచ్చిన తరువాత అనేక మార్పులకు వేదిక అయ్యింది TSRTC.... మా అక్క నర్సంపేట డిపో లో కండెక్టర్ గా పనిచేస్తుంది... ఈ మధ్యన చాలా సంతోషంగా ఉంది... ఒకటవ తేదీన జీతం పొందుతున్నందుకు... మీకు నా కృతజ్ఞతలు సర్ అంటూ ట్వీట్ చేశారు. ఇలా చాలామంది సంతోషంగా ఉన్నామంటూ ట్వీట్లు చేస్తున్నారు.

First published:

Tags: Sajjanar, Tsrtc

ఉత్తమ కథలు