హోమ్ /వార్తలు /తెలంగాణ /

Hyderabad: RTC బస్సు దిగి వెళ్లిపోయిన యువతి ప్రాణాలు కాపాడిన కండక్టర్ .. అంతా ఆ పర్సు వల్లే జరిగింది

Hyderabad: RTC బస్సు దిగి వెళ్లిపోయిన యువతి ప్రాణాలు కాపాడిన కండక్టర్ .. అంతా ఆ పర్సు వల్లే జరిగింది

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad: తెలంగాణ ఆర్టీసీ సిబ్బంది ఓ యువతి ప్రాణాలు కాపాడారు. బస్సులో ప్రయాణించిన యువతి సూసైడ్ చేసుకునేందుకు సిద్ధపడటం గుర్తించిన సంస్థ ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. వెంటనే పైఅధికారులకు సమాచారం ఇచ్చి ఆమె ఆచూకిని గుర్తించి సూసైడ్ చేసుకోకుండా ఆపగలిగారు.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలంగాణ ఆర్టీసీ(TSRTC) సిబ్బంది ఓ యువతి ప్రాణాలు కాపాడారు. బస్సులో ప్రయాణించిన యువతి సూసైడ్ చేసుకునేందుకు సిద్ధపడటం గుర్తించిన సంస్థ ఉద్యోగులు అప్రమత్తమయ్యారు. వెంటనే పైఅధికారులకు సమాచారం ఇచ్చి ఆమె ఆచూకిని గుర్తించి సూసైడ్ చేసుకోకుండా ఆపగలిగారు. ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. హైదరాబాద్‌(Hyderabad)లో జరిగిన ఈసంఘటన ఇప్పుడు అందర్ని ఆశ్చర్యానికి గురి చేసింది. పటాన్‌చెరువు(Patancheru)లో ఆర్టీసీ బస్సెక్కిన యువతి జూబ్లి బస్టాండ్‌(Jubilee Bus Stand)లో దిగింది. అయితే ఆమె వెంట తెచ్చుకున్న పర్సు బస్సులో పారేసుకుంది. బస్సులో ప్రయాణికులు దిగిన తర్వాత కండక్టర్(Conductor)సీటులో పర్సు(Purse)ను చూసి ప్రయాణికురాలికి అందజేయాలని ప్రయత్నించాడు. అందుకోసం వివరాలు తెలుసుకునేందుకు పర్సు తెరిచి చూడటంతో అందులో ఉన్న సూసైడ్ లెటర్(Suicide Letter) చూసి షాక్ అయ్యాడు. వెంటనే ఆర్టీసీ ఉన్నతాధికారుల సహకారంతో ప్రాణాలు తీసుకోకుండా ఆపారు.

Telangana: ఇప్ప పువ్వుతో ఆదివాసీ గిరిజనులు చేసే ఆ వంటకాలు ..అందుకు బాగా పని చేస్తాయి

ప్రాణాలు కాపాడిన పర్సు ..

బలవన్మరణం చేసుకోవాలని ప్రయత్నించిన ఓ యువతి ప్రాణాలు టీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు కాపాడారు. పఠాన్‌చెరువుకు చెందిన ఓ యువతి పఠాన్‌చెరువులో బస్సెక్కిన ఓ యువతి సికింద్రాబాద్‌లోని జేబీఎస్‌లో దిగింది. ప్రయాణికులందరూ బస్సు దిగాక కండక్టరుకు బస్సులో ఓ పర్సు కనిపించింది. అదెవరిదో తెలుసుకుందామని పర్సు తెరిచిన ఆయనకు అందులో కొన్ని డబ్బులతో పాటు ఓ లేఖ కూడా కనిపించింది. తెరిచి చూసిన ఆయన షాకయ్యాడు. తాను ఆత్మహత్య చేసుకోబోతున్నట్టు అందులో రాసి ఉండడంతో వెంటనే అప్రమత్తమయ్యాడు.

ఆర్టీసీ సిబ్బంది సమయస్పూర్తి..

వెంటనే ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్‌కు సమాచారం అందించాడు. పర్సులోని ఆధార్ కార్డు, సూసైడ్ లెటర్‌ను ఎండీకీ ట్విట్టర్‌లో షేర్ చేశాడు. అప్రమత్తమైన ఆయన యువతిని గుర్తించి కుటుంబ సభ్యులకు అప్పగించాలంటూ సిబ్బందిని ఆదేశించారు. రంగంలోకి దిగిన ఆర్టీసీ ఎస్సై దయానంద్.. మారేడుపల్లి పోలీసుల సాయంతో యువతి కోసం గాలించారు. ఎట్టకేలకు వారి ప్రయత్నాలు ఫలించాయి. యువతిని గుర్తించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. కుమార్తెను రక్షించి తమకు అప్పగించిన ఆర్టీసీ అధికారులు, పోలీసులకు యువతి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.

ప్రయాణికురాలి ప్రాణాలు సేఫ్..

అయితే యువతి ఎందుకు సూసైడ్ చేసుకోవాలనుకుంటోంది అనే విషయంపై పూర్తి వివరాలు తెలియరాలేదు. ఈవిషయంపైనే పోలీసులు యువతిని ప్రశ్నించారు. ఆమెకు కౌన్సిలింగ్ ఇచ్చారు. అయితే ఓ ప్రయాణికురాలి ప్రాణాలు కాపాడిని ఆర్టీసీ సిబ్బందిని ఎండీ సజ్జనార్‌ సైతం అభినందించారు.

First published:

Tags: Telangana News, Tsrtc, Women commits suicide

ఉత్తమ కథలు