HYDERABAD RRR TEAM PARTICIPATES IN GREEN INDIA CHALLENGE IN HYDERABAD WITH TRS MP SANTOSH SNR
GREEN INDIA CHALLENGE:ఛాలెంజ్‌ని స్వీకరించిన ట్రిపులార్ టీమ్..మొక్కలు నాటిన ముగ్గురు మొనగాళ్లు
Photo Credit: Twitter
RRR GREEN CHALLENGE: ట్రిపులార్ స్టార్స్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో భాగస్వాములయ్యారు. హైదరాబాద్‌లో టీఆర్ఎస్ ఎంపీ జోగినపల్లి సంతోష్‌కుమార్‌తో కలిసి ఎన్టీఆర్, రామ్‌చరణ్, రాజమౌళి మొక్కలు నాటారు. సమాజహితం కోసం ఎంపీ సంతోష్ చేపట్టిన కార్యక్రమం గొప్పదని హీరోలు ప్రశంసించారు. రిలీజ్ దగ్గరపడుతున్న సమయంలో ప్రమోషన్లో బిజీగా ఉండి కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నందుకు ట్రిపులార్ టీమ్‌కి సంతోష్ కృతజ్ఞతలు తెలిపారు.
ట్రిపులార్ స్టార్స్ ఎన్టీఆర్(NTR), రామ్‌చరణ్(Ramchara), రాజమౌళి(Rajamouli) హైదరాబాద్‌లో గ్రీన్ ఇండియా ఛాలెంజ్(Green India Challenge) కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. టీఆర్ఎస్ ఎంపీTRSMP , రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్‌కుమార్Santosh మంచి లక్ష్యంతో ప్రారంభించిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో ఇద్దరు అగ్ర హీరోలతో పాటు గ్రేట్ డైరెక్టర్ పాలుపంచుకున్నారు. హైదరాబాద్ (Hyderabad) గచ్చిబౌలి(Gatchibauli)లో హీరోలు రామ్‌చరణ్, ఎన్టీఆర్‌తో పాటు రాజమౌళి సంతోష్‌కుమార్‌తో కలిసి మొక్కలు నాటారు. ట్రిపులార్ సినిమా ప్రమోషన్లో బిజీగా ఉండి కూడా గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్న ట్రిపులార్ టీమ్‌ని ఎంపీ సంతోష్‌కుమార్ అభినందించారు. అలాగే మరికొన్ని గంటల్లో రిలీజవబోతున్న ట్రిపులార్ సినిమా ఘన విజయం సాధించాలని కోరుకుంటూ ఆర్ఆర్ఆర్ టీమ్‌కి ఎంపీ సంతోష్ కుమార్ స్పెషల్ విషెస్ చెప్పారు. హీరోలు రామ్‌చరణ్, తారక్, రాజమౌళి మొక్కులు నాటిన వీడియోని తన ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేశారు ఎంపీ సంతోష్‌కుమార్.గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉందన్నారు హీరోలు తారక్, రామ్‌చరణ్. తాను ఎప్పటి నుంచో ఈకార్యక్రమంలో పాల్గొనాలని చూశానని కాని షూటింగ్‌ల బిజీ వల్ల కుదరలేదని..ఇప్పుడు ఈవిధంగా ఆ మంచి పని పూర్తి కావడం హ్యాపీగా ఉందన్నారు తారక్.
మొక్కలు నాటిన ట్రిపులార్ టీమ్..
ఎంపీ సంతోష్ కొనసాగిస్తున్న ఈ మొక్కలు నాటే కార్యక్రమం మరింత విజయవంతంగా ముందుకు సాగాలని తారక్ కోరారు. కాలుష్యం నుంచి సమాజాన్ని కాపాడాలనే లక్ష్యంతో నాలుగేళ్లలో ఎన్నో కోట్ల మొక్కులు నాటించిన ఎంపీ సంతోష్ పట్టుదల, అంకితభావం ఎంతో గొప్పదని యంగ్ టైగర్ చెప్పుకొచ్చారు.
ఎంపీ సంకల్పం మంచిదన్న స్టార్స్ ..
సమాజహితమే లక్ష్యంగా దేశ వ్యాప్తంగా హరిత స్పూర్తిని నింపుతున్న ఎంపీ సంతోష్‌కుమార్‌కి మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ అభినందించారు. తాను గతంలో ఎన్నో సార్లు గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొన్నానని మొక్కలు నాటిన ప్రతిసారి తనకు ఏదో తెలియని ఉత్సాహం వస్తుందన్నారు. ట్రిపులార్ మూవీ రిలీజ్ సందర్భంగా మరోసారి గ్రీన్ ఇండియా ఛాలెంజ్‌లో పాల్గొనడం సంతోషంగా ఉందన్నారు చరణ్.
హీరోలకు ఎంపీ కృతజ్ఞతలు...
డైరెక్టర్ రాజమౌళి సైతం గ్రీన్ ఇండియా ఛాలెంజ్ గొప్ప కార్యక్రమంగా అభివర్ణించారు. ప్రకృతి, పర్యావరణం తన మనసుకు నచ్చిన కార్యక్రమాలని అందుకే అకాశం దొరికినప్పుడల్లా మొక్కులు నాటుతూ పచ్చదనం పెంచడానికి ప్రయత్నిస్తున్నానని చెప్పారు. రాష్ట్రం, దేశం పచ్చగా ఉండాలనే మంచి సంకల్పంతో ఎంపీ సంతోష్ కుమార్ చేపట్టిన గ్రీన్ ఇండియా ఛాలెంజ్ మరింత సక్సెస్ కావాలని ఆకాంక్షిస్తున్నట్లుగా జక్కన్న చెప్పారు. పిల్లల్ని పెంచినట్లుగా నాటిన మొక్కల్ని కూడా అంతే జాగ్రత్తగా పెంచుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు రాజమౌళి.
సినిమా మాధ్యమం అత్యంత శక్తివంతమైందన్న ఎంపీ సంతోష సమాజానికి చక్కని హరిత సందేశం ఇచ్చే స్ఫూర్తి హీరోలతో పాటు, చిత్ర నిర్మాణంలో భాగం అయ్యే 24 ఫ్రేమ్స్ కళాకారులకు ఉంటుందని ఎంపీ సంతోష్ కుమార్ అన్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.