అప్పుడప్పుడు సెలబ్రిటీలు బయట తిరుగుతూ ఉంటారు. ఎప్పుడూ వారిని ఆన్ స్క్రీన్లపై చూసిన జనం... కొన్నిసార్లు ఎదురుగా వచ్చినా గుర్తుపట్టలేరు. చాలా సందర్భాల్లో సెలబ్రిటీలు జనం కంట పడకుండా మారు వేషాల్లో కూడా పబ్లిక్ ప్లేసుల్లో తిరుగుతూ ఉంటారు. ఇక రంజాన్ వేళ చార్మినార్ చూస్తే.. ఆ కిక్కేవేరు. కాంతులతో వెలిగిపోతూ ఉంటుంది. అర్థరాత్రి 2 దాటిన షాపింగ్ కొనసాగుతూ ఉంటుంది. అలాంటి రంజాన్ వేళ ప్రముఖ డైరక్టర్ చార్మినార్లో సందడి చేశారు. తాజాగా ఆర్ఆర్ఆర్ డైరెక్టర్, దర్శక ధీరుడు ఎస్ఎస్ రాజమౌళి(SS Rajamouli) హైదరాబాద్ ఓల్డ్ సిటీలో(Old City) కనిపించారు. హైదరాబాద్(Hyderabad) పాతబస్తీలోని (Patabasthi) చార్మినార్ పరిసర ప్రాంతాలలో అర్ధరాత్రి జక్కన్న పర్యటించారు.
ఓ సాధారణ వ్యక్తిగా రాజమౌళి నైట్ బజార్ అందాలని తిలకించారు. నైట్ బజార్ మొత్తం తిరిగిన రాజమౌళి లోకల్ పబ్లిక్ తో చాలా మంది తో అతను కలిశారు. హోటల్ లో కూడా తన కుమారుడి కార్తికేయ తో కలిసి బిర్యానీ తిని వెళ్ళిపోయారు. సాధారణ వ్యక్తిగా ప్రజల్లో కలిసిపోవడంతో పాతబస్తీ ప్రజలు ఎవరు రాజమౌళి ని గుర్తు పట్టలేకపోయారు. హోటల్ నుంచి వెళ్లే సమయంలో కొంతమంది ఆయన గడ్డం చూసి ఆయనను గుర్తుపట్టారు. ఇతను రాజమౌళి డైరెక్టర్ లాగా ఉన్నాడు అనుకుంటూ డైరెక్టర్ రాజమౌళి దగ్గరికి వెళ్లి సార్ మీరు రాజమౌళి డైరెక్టర్ గారు కదా! అని అడిగారు. దీంతో రాజమౌళిని సెల్ఫీ దిగాలని కోరడంతో వారితో ఫోటోలు దిగారు. అక్కడ ఉన్న యువకులు చాలా ఉత్సాహంగా రాజమౌళితో సెల్ఫీ దిగారు.
ఇక దర్శకు ధీరుడు రాజమౌళి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. బాహుబలితో ప్రభాస్ ని పాన్ ఇండియా స్టార్ చేసినరాజమౌళి ఆర్ఆర్ఆర్ సినిమా తీసి రామ్ చరణ్, ఎన్టీఆర్లను కూడా పాన్ ఇండియా స్టార్లుగా మార్చేశాడు. ఇద్దరికీ నేషనల్ వైడ్ క్రేజ్ ఏర్పడేలా చేశాడు.రాం చరణ్, తారక్ ఇద్దరికి ఇప్పటికే నేషనల్ వైడ్ సూపర్ ఫాలోయింగ్ ఉండగా ఆర్.ఆర్.ఆర్ తో అది మరింత పెరిగిపోయింది. ఈ క్రమంలో ట్రిపుల్ ఆర్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ తో రాజమౌళి సినిమా చేస్తున్నాడు. మహేష్ సినిమాను యాక్షన్ ఎడ్వెంచరస్ మూవీగా తెరకెక్కించే ప్లాన్ లో ఉన్నాడు దర్శక ధీరుడు జక్కన్న. ఇక లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ప్రకారం మహేష్ తర్వాత రాజమౌళి కె.జి.ఎఫ్ స్టార్ యష్ తో సినిమా చేస్తాడని టాక్ బలంగా వినిపిస్తోంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.