సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌.. రన్నింగ్ ట్రైన్ ఎక్కేందుకు యత్నించి కిందపడిన మహిళ.. తర్వాత ఏం జరిగిందంటే.. Video

(Image-Twitter/ANI)

ట్రైన్ కదులుతున్న సమయంలో మహిళ ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకుంది. పరుగెత్తుకుంటూ వచ్చి.. ఓ బోగీలో ఎక్కేందుకు ప్రయత్నించింది.

 • Share this:
  రన్నింగ్ ట్రైన్ ఎక్కడం అనేది చాలా ప్రమాదకరం అన్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించి రైల్వే స్టేషన్‌లో ప్రకటనలు చేస్తుంటారు. కానీ కొందరు చివరి నిమిషాల్లో.. ట్రైన్ కదులుతుండగా ఎక్కే ప్రయత్నం చేస్తారు. ఇలా ప్రమాదాల బారిన పడినవారు కూడా ఉన్నారు. అయితే తాజాగా కదులుతున్న ట్రైన్ ఎక్కుతున్న ఓ మహిళ.. రైలు కిందపడపోయింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయ్యాయి. అయితే రైల్వే పోలీస్ సకాలంలో స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. ఈ ఘటన తెలంగాణలోని సికింద్రాబాద్‌ రైల్వే స్టేషన్‌లో శుక్రవారం రోజున జరిగింది. ఈ వీడియోను ANI వార్త సంస్థ ట్విట్టర్‌లో షేర్ చేసింది.

  ఆ వీడియోలో.. ట్రైన్ కదులుతున్న సమయంలో మహిళ ప్లాట్‌ఫామ్‌పైకి చేరుకుంది. పరుగెత్తుకుంటూ వచ్చి.. ఓ బోగీలో ఎక్కేందుకు ప్రయత్నించింది. అయితే రైలు కదులుతుండంతో అదుపు తప్పి కిందకు జారిపోయింది. ప్లాట్‌ఫామ్‌పై ఉన్న ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ దినేష్ సింగ్ ఇది గమనించి వెంటనే స్పందించాడు. వెంటనే ముందు వెనక ఆలోచించకుండా మహిళను రక్షించడానికి పరిగెత్తాడు.

  ఈ దృశ్యాలు చూస్తున్న ప్రయాణికులు ట్రైన్ ఆపాలని కేకలు పెట్టారు. ఈలోపే అక్కడికి చేరుకున్న ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్ దినేష్ సింగ్.. ఆమెను క్షేమంగా ప్లాట్‌ఫామ్ మీదకు లాగాడు. దీంతో ఆమె ప్రాణాలతో బయటపడింది. ఆ తర్వాత ట్రైన్ నిలిచిపోయింది. అనంతరం మహిళను అక్కడి నుంచి తరలించారు. ఈ వీడియో చూసిన జనాలు.. ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌పై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. చాలా వేగంగా స్పందించడం వల్ల మహిళ ప్రాణాలు నిలిచాయని పేర్కొంటున్నారు. కొద్దిగా ఆలస్యమైన ఘోర ప్రమాదం జరిగి ఉండేదని.. అది తలుచుకోవడానికే భయమేస్తుందని పేర్కొంటున్నారు.
  Published by:Sumanth Kanukula
  First published: