Home /News /telangana /

HYDERABAD ROWDY SHEETER SAI KIRAN BEAT HIS WIFE DUE DID NOT LIKE THE CURRY VB

OMG: కూర నచ్చలేదని అతడు తన భార్యను ఏం చేశాడో చూడండి.. ఆరు నెలల గర్భవతి అని కూడా చూడకుండా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

OMG: ఎప్పటిలాగే అతడు ఇంటికి వచ్చి భోజనం చేస్తున్నాడు. కానీ ఆ రోజు అతడు పుల్ గా తాగాడు. కూర నచ్చలేదని తీవ్ర ఆగ్రహంతో ఊగిపోయాడు. ఆరు నెలల గర్భవతిగా ఉన్న తన భార్యను ఏం చేశాడో తెలుసా.. పూర్తి వివరాల్లోకి వెళ్తే..

  మద్యానికి బానిసలుగా మారిన కొందరు మద్యం కోసం ఎలాంటి పనులు అయిన చేస్తారు. కొందరు దొంగతనాలు, దోపిడీలు చేసి మరి మద్యం కొని తాగేస్తుంటారు. మరికొందరు మద్యం కోసం డబ్బులు ఇవ్వాలంటూ.. ఇంట్లోవాళ్లనే కడతేర్చిన ఘటనలు జరిగిన విషయం తెలిసిందే. కానీ ఇక్కడే జరిగిన ఘటనలో డబ్బుల కోసం కాదు.. మద్యం ఫుల్ గా తాగి వచ్చి కూర నచ్చలేదనే కారణంతో భార్యను విపరీతంగా కొట్టాడు. ఆమె ఆరు నెలల గర్భవతి కూడా. అయినా అవేమి పట్టించుకోకుండా కర్ర తీసుకొని  కట్టడంతోపాటు.. కాలితో ఎక్కడ పడితే అక్కడ తన్నాడు. ఈ ఘటన హైదరాబాద్ (Hyderabad) లోని బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. సీఐ రవికుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

  Anchor Rashmi: అతడికి ముద్దులు పెడుతూ రచ్చ చేసిన యాంకర్ రష్మీ.. సోషల్ మీడియాలో వీడియో వైరల్..


  న్యూ బోయినపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని కంసారి బజారులో రౌడీ షీటర్ సాయి కిరణ్ అలియాస్ సాయి (25), రాజకుమారి (20) భార్యాభర్తలు. వాళ్లకు రెండేళ్ల క్రితం వివాహం అయింది. సాయి ఆటో నడుపుతూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల ఆమె గర్భం దాల్చింది. ప్రస్తుతం ఆమె ఆరు నెలల గర్భవతి. ఆటో నడుపుతున్న సాయి.. విపరీతంగా చెడు వ్యసనాలకు అలవాటు పడ్డాడు. దీంతో రోజూ మద్యం తాగి వచ్చి భార్యను ఇబ్బందులకు గురిచేసేవాడు. ఈ నేపథ్యంలో అతడు నిన్న ఆటో నడిపి రాత్రి ఇంటికి తిరిగి వచ్చాడు. అతడు ఆ రోజు మద్యం సేవించి వచ్చాడు. ఎప్పటిలాగే అతడి భార్య భోజనం వడ్డించింది.

  Extra Jabardasth: రాకింగ్ రాకేష్ ను కొట్టబోయిన జడ్జి మనో.. ఏం స్కిట్ చేశారు అంటూ ఆగ్రహం.. ఏం జరిగిందంటే..


  అప్పటికే మద్యం మత్తులో ఉన్న సాయి కూరలు నచ్చలేదని భార్యను దుర్భాషలాడుతూ చేయి చేసుకున్నాడు. ఆమె ఆరు నెలల గర్భవతి అని కూడా చూడలేదు. కర్రతో కట్డడంతో పాటు కాళ్లతో కడుపుపై తన్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు ఆమెను చికిత్స నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

  Whatsapp Chat: శ్రీరామచంద్రతో శ్రీరెడ్డి వాట్సాప్ చాట్ వైరల్.. హౌస్ నుంచి బయటకు పంపించేయండి అంటూ..


  ఇదిలా ఉండగా.. హైదరాబాద్ లో మరో ఘటన చోటు చేసుకుంది. ఇల్లు ఇప్పిస్తానంటూ అతడు ఓ వివాహితను తీసుకెళ్లి గదిలో బంధించాడు. దీంతో ఆమెపై అతడి స్నేహితులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ ఘటన గోల్కొండ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. నిర్భయ లాంటి కఠిన చట్టాలు తెచ్చినా, రేపిస్టులను ఎన్ కౌంటర్ చేస్తున్నా మన దేశంలో మానవ మృగాల ఆగడాలకు అడ్డుకట్ట పడటం లేదు.

  BiggBoss Telugu 5: బిగ్ బాస్ కొత్త కెప్టెన్ గా ‘యానీ’..! ఎలిమినేషన్లో ఊహించని ట్విస్ట్..


  మహిళలు, బాలికలకు భద్రత కరువైంది. నిత్యం ఎక్కడో ఒకచోట అత్యాచార ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. మహిళ ఒంటరిగా రోడ్డుపైకి రావాలంటేనే భయపడాల్సిన పరిస్థితులు ఉన్నాయి. చిన్న పిల్లలు, పెద్ద వాళ్లు అనే తేడా లేదు.. ఎవరికీ రక్షణ లేకుండా పోయింది. నిత్యకృత్యంగా మారిన లైంగిక దాడులు, అత్యాచారాలు ఆందోళనకు గురి చేస్తున్నాయి. మహిళల భద్రతను ప్రశ్నార్థకం చేశాయి.
  Published by:Veera Babu
  First published:

  Tags: Crime, Crime news, Wife and husband

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు