హైదరాబాద్ రోడ్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం

ప్రస్తుతం రోడ్ల గుంతలు పూడ్చివేత, కొత్త రోడ్లు, లేయర్ల వంటి వాటికి వేర్వేరు టెండర్లు పిలుస్తాని తెలిపారు. రోడ్లు, ఫుట్‌పాత్‌లు తవ్వాలంటే కనీసం ఆరు నెలల ముందే సమాచారం అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు.

news18-telugu
Updated: October 21, 2019, 10:08 PM IST
హైదరాబాద్ రోడ్లపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
హైదరాబాద్‌లో రోడ్ల పరిస్థితేంటో అందరికీ తెలుసు. వర్షాల దెబ్బకు రోడ్లన్నీ గుంతలమయంగా మారిపోయాయి. రోడ్లపై కంకర, మట్టి తేలి వాహనదారులకు నరకం చూపిస్తున్నాయి. చాలా చోట్ల ఇదే పరిస్థితి..! దీనికి తోడు పలు ప్రభుత్వ సంస్థలు రోడ్లను తవ్వి అలాగే వదిలేస్తున్నాయి. దాంతో పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్స్ కూడా అవుతున్నాయి. ఈ క్రమంలో హైదరాబాద్ రోడ్ల విషయంలో తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రోడ్ల సమస్యల పరిష్కారానికి వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. రహదారుల నిర్వహణ బాధ్యతలను ప్రైవేట్ సంస్థలకు అప్పగించాలని నిర్ణయించింది.

సోమవారం జీహెచ్‌ఎంసీ ఇంజినీరింగ్ సిబ్బంది, జోనల్ కమిషనర్లతో ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సమీక్ష నిర్వహించారు. అనంతరం రోడ్ల నిర్వహణపై కీలక నిర్ణయం తీసుకున్నారు. సమగ్ర రోడ్ల నిర్వహణ కార్యక్రమం(CRM) కింద నగరంలోని 709 కిలోమీటర్ల ప్రధాన రహదారుల నిర్వహణకు టెండర్లు పిలవాలని నిర్ణయించారు కేటీఆర్. ప్రస్తుతం రోడ్ల గుంతలు పూడ్చివేత, కొత్త రోడ్లు, లేయర్ల వంటి వాటికి వేర్వేరు టెండర్లు పిలుస్తాని తెలిపారు. రోడ్లు, ఫుట్‌పాత్‌లు తవ్వాలంటే కనీసం ఆరు నెలల ముందే సమాచారం అందించేలా చర్యలు తీసుకుంటామని చెప్పారు. రోడ్ల తవ్వకాలు, ఆ వెంటనే పూడ్చే బాధ్యత పూర్తిగా వర్కింగ్ ఏజెన్సీలదే అని స్పష్టంచేశారు కేటీఆర్.


First published: October 21, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
corona virus btn
corona virus btn
Loading