హోమ్ /వార్తలు /తెలంగాణ /

Road accident: దుండిగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి..11 మందికి తీవ్ర గాయాలు

Road accident: దుండిగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం..ఇద్దరు మృతి..11 మందికి తీవ్ర గాయాలు

దుండిగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం

దుండిగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ రూట్, నిద్ర మత్తు రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే జరిగిన ప్రమాదం ఒక్కటే అయిన ఆ దుర్ఘటనలో ఎంతో మంది ప్రాణాలు పోతున్నాయి. ఇక తాజాగా హైదరాబాద్ శివారులోని దుండిగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది.

ఇంకా చదవండి ...
  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad, India

తెలుగు రాష్ట్రాల్లో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. అతివేగం, మద్యం సేవించి వాహనం నడపడం, రాంగ్ రూట్, నిద్ర మత్తు, నిర్లక్ష్యం, ర్యాష్ డ్రైవింగ్ వంటివి రోడ్డు ప్రమాదాలకు ప్రధాన కారణంగా చెప్పుకోవచ్చు. అయితే ప్రమాదం ఒక్కటే అయిన ఆ దుర్ఘటనలో ఎంతో మంది ప్రాణాలు కోల్పోతుంటారు. ఇక తాజాగా హైదరాబాద్ శివారులోని దుండిగల్ లో ఘోర రోడ్డు ప్రమాదం (Fatal Raod Accident) చోటు చేసుకుంది. ఓ డీసీఎం వాహనం దుండిగల్ వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. దీనితో అక్కడిక్కడే ఇద్దరు మృతి చెందగా..11 మంది తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా..ఘటనా స్థలానికి చేరుకొని క్షతగాత్రులను స్థానిక ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది.

Big News: తెలంగాణ అసెంబ్లీలో బీఆర్ఎస్ వర్సెస్ ఎంఐఎం ..అక్బరుద్దీన్ ఒవైసీకి కేటీఆర్ కౌంటర్

గౌడవెల్లి నుంచి హైదరాబాద్ వెళ్తుండగా ఘటన..

కాగా గౌడవెల్లి నుంచి హైదరాబాద్ (Hyderabad) లోని ఎన్టిఆర్ గార్డెన్ లో ఓ ఫంక్షన్ కు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద సమయంలో వాహనంలో 16 మంది ఉన్నట్లు సమాచారం. కాగా ఇందులో ఇద్దరు తీవ్ర గాయాలతో రక్తస్రావం కావడంతో అక్కడిక్కడే మృత్యువాత పడ్డారు. అలాగే 11 మంది గాయాలపాలయ్యారు. మృతి చెందిన వారి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. ఈ ప్రమాదంతో బాధిత కుటుంబాల్లో తీవ్ర విషాదం నెలకొంది. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Ys Sharmila: కేసీఆర్ సర్కార్ పై నిప్పులు చెరిగిన వైఎస్ షర్మిల

ప్రమాదానికి కారణం ఏంటి?

కాగా ఈ ప్రమాదానికి అతివేగమే కారణమని తెలుస్తుంది. డీసీఎం వాహనం అవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. ఆటో లాంటి వెహికల్ అయితే మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉండేదని స్థానికులు చేబుతున్నారు. ప్రమాదానికి అతివేగమే కారణమా? లేక ఇతర కారణాలు ఉన్నాయా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.

ఒక చిన్న నిర్లక్ష్యం నిండు ప్రాణాలను బలి తీసుకుంటుంది. రెప్పపాటులో జరిగిన ప్రమాదం (Accident) బాధిత కుటుంబాల్లో జీవితకాలం చీకట్లను నింపుతుంది. కళ్లు మూసుకొని తెరిచే లోపు ఊహించని దుర్ఘటన పెను విషాదాన్ని నింపుతుంది. ఏదేమైనా వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్తగా ఉండి ప్రాణాలను కాపాడుకోండి. మీకోసం మీ ఇంటి దగ్గర ఎంతగానో ఎదురు చూస్తూ ఉంటారు. ఆ విషయాన్ని గుర్తు పెట్టుకుంటూ డ్రైవింగ్ చేయండి. ప్రమాదాల్ని అరికట్టండి.

First published:

Tags: Crime, Road accident, Telangana

ఉత్తమ కథలు