Lorry Car Accident: హైదరాబాద్ శివార్లలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుల్తాన్ బజార్ సీఐ లక్ష్మణ్, ఆయన భార్య ఝాన్సీ స్పాట్లోనే దుర్మారణం చెందారు. కారును ఝాన్సీ డ్రైవ్ చేస్తున్నట్లు తెలిసింది. మృతదేహాలను ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు. రంగారెడ్డి జిల్లా... అబ్దుల్లాపూర్మెట్ దగ్గర్లో ఈ ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో సీఐ దంపతులు ప్రయాణిస్తున్నా కారు తుక్కుతుక్కైంది. సీఐ దంపతులు సూర్యాపేట నుంచి హైదరాబాద్ వస్తుండగా... ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదం జరిగినప్పుడు కారులో వారి కొడుకు కూడా ఉన్నాడు. అతనికి మాత్రం ఎలాంటి గాయాలూ కాలేదు. అతనే ఈ ప్రమాదం గురించి పోలీసులకు సమాచారం ఇచ్చాడు.
ఇక్కడ తప్పు కారుదే అని తెలుస్తోంది. ఓ ఆగి వున్న లారీని కారు బలంగా ఢీకొట్టడంతో... కూరు నుజ్జునుజ్జైంది. దాన్ని బట్టీ... ఆ సమయంలో కారు చాలా వేగంగా వస్తోందని అనుకోవచ్చు. మరో విషయమేంటంటే... అబ్దుల్లాపూర్మెట్ దగ్గర ట్రాఫిక్ తక్కువగా ఉంటుంది. అందువల్ల చాలా మంది వాహనదారులు... త్వరగా హైదరాబాద్ వెళ్లిపోవాలనే ఉద్దేశంతో విపరీతమైన వేగంతో బండ్లు నడుపుతుంటారు. ఐతే... అక్కడే ఓ ప్రమాదం పొంచివుంది.
ఇది కూడా చదవండి: Horoscope 8-5-2021: ఈ రాశుల వారికి అలర్ట్... నమ్మించి మోసే చేసే వారితో జాగ్రత్త
అబ్దుల్లాపూర్ మెట్ దగ్గర రోడ్డు కాస్త మెత్తగా ఉంటుంది. అందువల్ల కనిపించని ఎత్తుపల్లాలు ఉంటాయి. పొరపాటున వాటిలోకి వాహనం వెళ్తే... ఆ వేగంలో అస్సలు కంట్రోల్ కాదు. ఆ ఎత్తుపల్లాల్లో వాహనం వెళ్లగానే... ఎగిరెగిరి పడుతుంది. దాంతో వాహనం నడిపేవారికి కంట్రోల్ తప్పుతుంది. ఆ క్రమంలోనే ప్రమాదాలు జరిగే అవకాశాలు ఉంటాయి. మరి ఈ ప్రమాదం కూడా అలాగే జరిగిందా అనేది పోలీసులు తేల్చనున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.