ఆదివారం అంబర్ పేటలో కుక్కల దాడిలో బాలుడు మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అటు ప్రభుత్వంపై, GHMC మేయర్ గద్వాల విజయలక్ష్మి(Vijayalakshmi Gadwala) పై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంబర్ పేట ఘటన జరిగిన వెంటనే మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులతో సమావేశం అయ్యారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని అధికారులను ఆదేశించారు. ఈ క్రమంలో ఆర్జీవీ (Ram Gopal Varma) మేయర్ పై సెటైరికల్ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
అంబర్ పేట ఘటన జరిగిన వెంటనే మేయర్ గద్వాల విజయలక్ష్మి అధికారులతో సమావేశం అయ్యారు. అంతేకాదు ఆకలితోనే కుక్కలు బాలుడిపై దాడి చేశాయని మేయర్ అన్నారు. 4 లక్షలకు పైగా వీధి కుక్కలకు స్టెరిలైజ్ చేశామని ఆమె తెలిపారు. తాను డాగ్ లవర్ ను అని కానీ కుక్కలకు ఆహారం పెట్టొద్దని అననని అన్నారు. ఓ మహిళా రోజూ కుక్కలకు మాంసం పెట్టేదని కానీ 2 రోజులుగా కుక్కలకు ఆహారం పెట్టకపోవడంతో బాలుడిపై దాడి చేసి చంపేశాయని మేయర్ అన్నారు. ఒక్కొక్కరు 20 కుక్కలను తీసుకొని స్టెరిలైజ్ చేస్తే నెలకు 600 కుక్కల చొప్పున ఎవరైనా పెంచుకుంటే బాగుంటుందని అన్నారు.
మేయర్ వ్యాఖ్యలపై వర్మ (Ram Gopal Varma) తనదైన శైలిలో సెటైరికల్ ట్వీట్ చేశారు. 'కేటీఆర్ సార్ 5 లక్షల శునకాలను తెచ్చి డాగ్ హోంలో వేయండి. ఆ మధ్యలో మేయర్ గద్వాల విజయలక్ష్మి (Vijayalakshmi Gadwala) ఉండేలా చూడండని' వర్మ ట్వీట్ చేశారు.
Sir @KTRBRS please round up all the 5 lakh dogs into a dog home and make the mayor @GadwalvijayaTRS stay in their middle ???? pic.twitter.com/rWe6sC9Ga4
— Ram Gopal Varma (@RGVzoomin) February 23, 2023
కాగా ఆర్జీవీ ట్వీట్ పై నెటిజన్లు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. మేయర్ తీరుపై వర్మ ట్వీట్ కు మద్దతుగా నెటిజన్లు స్పందిస్తుండడం గమనార్హం.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.