Home /News /telangana /

HYDERABAD REVIEW ON MONKEYS IT SHOULD CONTROL NOT DAMMAGE CROPS MINISTER INDRAKARANREDDY SAID VRY

Hyderabad : కోతుల నియంత్రణపై సమీక్ష.. రాష్ట్రంలో ఆరులక్షల కోతులు... వాటిని ఏం చేద్దాం...?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

Hyderabad : తెలంగాణలో చేతికి వచ్చిన పంటను నాశనం చేస్తున్న కోతుల బెడద, వాటి నియంత్రణపై అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి అధికారులతో సమీక్ష నిర్వహించారు..

    గ్రామీణ ప్రాంతాల్లో పంట మార్పిడిలపై ప్రభుత్వం రైతులకు అవకగాహణ కల్పిస్తున్న నేపథ్యంలోనే రైతులు ముందుకు వస్తున్నారు..అయితే వాణిజ్య పంటను కాదని నిత్యవసరాలు, లేదా పండ్ల తోటల వైపు వెల్లడం వల్ల కోతుల నుండి రక్షణ లేకుండా పోతుందని రైతులు వాపోతున్నారు. దీంతో అటవీ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి, అధికారలతో సమీక్ష నిర్వహించారు.

    ఈ క్రమంలోనే కోతులను నియంత్రణ చేపట్టాలని అధికారులకు అదేశాలు జారీ చేశారు. వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్స్ చేయాలని సూచించారు. ముఖ్యంగా రాష్ట్రంలో 5 నుండి 6 లక్షల కోతులు ఉన్నట్టు అధికారులు మంత్రికి వివరించారు. వీటి నియంత్రణకు ఒక్కో జిల్లాలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ భాగస్వామ్యంతో కుటుంబ నియంత్రణ చికిత్సలు చేయాలని చెప్పారు. ఈ క్రమంలోనే పంటలపై కోతుల బెడద తీవ్రంగా ఉందని చెప్పారు. చేతికి అందివచ్చిన పంటలు కోతుల పాలవుతుంటే.. రైతులు మనోవేదనకు గురవుతున్నారని అన్నారు. దీంతో వాటి నియంత్రణకు చట్టపరిధిలో ఏం చేయాల్సి ఉంటుందో చర్చించి అమలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో కోతుల నియంత్రణకు అనుసరిస్తున్న విధానాలను అధ్యయనం చేయాలని సూచించారు.

    Telangana : అవును మేమే చంపాము.. జగిత్యాల జంట హత్య కేసులో ట్విస్ట్..

    ముఖ్యంగా పల్లె పకృతి వనంతో పాటు జాతీయ రహాదారుల వెంట పండ్ల మొక్కలను పెంచాలని చెప్పారు. అప్పుడే సరైన ఫలితాలు వస్తాయని సూచించారు. దీంతో కోతుల నియంత్రణకు ప్రభుత్వం కట్టుబడి ఉందనే సంకేతాలను రైతులకు చేరవేయాలని చెప్పారు.

    ఈ సమీక్ష కార్యక్రమంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డితో పాటు వ్యవసాయ మంత్రి నిరంజన్ రెడ్డి రాజ్యసభ ఎంపీ సురేశ్ రెడ్డితో పాటు,కోతుల బెడద నివారణ కమిటీ కన్వీనర్ రఘునందన్ రావు తోపాటు సంబంధిత అధికారుల బృందం పాల్గొన్నారు.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Hyderabad, Monkeys

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు