హోమ్ /వార్తలు /తెలంగాణ /

Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. ఆయన మాత్రం రాలేదు..

Revanth Reddy: టీపీసీసీ అధ్యక్షుడిగా ప్రమాణ స్వీకారం చేసిన రేవంత్ రెడ్డి.. ఆయన మాత్రం రాలేదు..

టీపీసీసీ బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి

టీపీసీసీ బాధ్యతలు స్వీకరించిన రేవంత్ రెడ్డి

తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. భారీ ర్యాలీతో గాంధీభవన్‌కు చేరుకున్న ఆయన వెంట పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్, భట్టి, పొన్నాల, రాజనర్సింహ, గీతారెడ్డి ఉన్నారు.

ఇంకా చదవండి ...

  హైదరాబాద్: తెలంగాణ పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం చేశారు. వేద పండితుల ఆశీర్వచనాల మధ్య ఆయన ఈ బాధ్యతలు స్వీకరించారు. భారీ ర్యాలీతో గాంధీభవన్‌కు చేరుకున్న ఆయన వెంట పీసీసీ మాజీ చీఫ్ ఉత్తమ్, భట్టి, పొన్నాల, రాజనర్సింహ, గీతారెడ్డి ఉన్నారు. కాంగ్రెస్ సీనియర్ నేతలంతా రేవంత్‌ను అభినందించి శుభాకాంక్షలు తెలిపారు. రేవంత్‌కు పీసీసీ ఇవ్వడంపై గుర్రుగా ఉన్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ కార్యక్రమానికి గైర్హాజరయ్యారు. పీసీసీగా బాధ్యతలు స్వీకరించిన రేవంత్‌కు హుజూరాబాద్ ఉప ఎన్నిక రూపంలో మొదటి సవాల్ ఎదురుకానుంది. టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయ రేసులో ముందున్న బీజేపీని కట్టడి చేసి, అధికార టీఆర్‌ఎస్‌ను ఢీ కొట్టగలిగితేనే రేవంత్‌ పరువు నిలుపుకున్నట్టవుతుంది.

  ఇక.. షర్మిల పార్టీ వల్ల కాంగ్రెస్ ఓటు బ్యాంకులో చీలిక రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత కూడా రేవంత్‌ ముందున్న మరో సవాల్. పార్టీలో అందరినీ కలుపుకునిపోవడం కూడా రేవంత్ రెడ్డికి కత్తిమీద సాము లాంటి వ్యవహారమేనని చెప్పక తప్పదు. ఇందులో భాగంగానే.. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్‌గా బాధ్యతలు స్వీకరించే లోపే వ్యూహాత్మకంగా అడుగులు వేశారు.


  కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సీనియర్ నేతలను నివాసాలకు వెళ్లి మరీ కలవడం, వారి ఆశీర్వాదం తీసుకోవడం రేవంత్‌కు కొంత ప్లస్ పాయింట్ అనే చెప్పాలి. టీపీసీసీ చీఫ్ రేసులో చివరి దాకా పేరు వినిపించిన శ్రీధర్‌బాబును కూడా రేవంత్ కలవడం రాజకీయంగా రేవంత్ రెడ్డి వేసిన వ్యూహాత్మక అడుగనే చెప్పాలి. ఇద్దరూ అరగంట పాటు చర్చించుకున్నారు. ఇలా పార్టీలో అందరు నేతల మద్దతు కూడగట్టుకునేందుకు రేవంత్ విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు.

  Published by:Sambasiva Reddy
  First published:

  Tags: Revanth Reddy, Telangana, Tpcc, TS Congress, Uttam Kumar Reddy

  ఉత్తమ కథలు