ప్రస్తుతం తెలంగాణ కాంగ్రెస్ (Telangana Congress) క్లిష్ట పరిస్థితుల్లో ఉంది. సీనియర్ నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్నారు. ఇటీవల దాసోజు శ్రవణ్ (Dasoju Sravan), మర్రి శశిధర్ రెడ్డి (Marri Sashider Reddy) పార్టీని వీడారు. ఈ క్రమంలో కాంగ్రెస్ అధిష్టానం తి కాంగ్రెస్ పై దృష్టి సారించింది. టీపీసీసీలో ప్రక్షాళన చేయాలనీ భావిస్తుంది. ఈ క్రమంలోనే టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) గత 5 రోజులుగా ఢిల్లీలోనే మకాం వేశారు. అయితే ఈ ప్రక్షాళనలో సీనియర్లకు అవకాశాలు ఇవ్వాలని అధిష్టానం భావిస్తున్నట్టు తెలుస్తుంది. అయితే కాంగ్రెస్ కుర వృధ్దిడిగా పేరున్న మర్రి శశిధర్ రెడ్డి (Marri Sashider Reddy) పార్టీని వీడడం కలకలం రేపింది. ఈ నేపథ్యంలో ఎట్టకేలకు రేవంత్ రెడ్డి స్పందించారు. నేతలు ఒక్కొక్కరుగా పార్టీని వీడుతున్న క్రమంలో రేవంత్ (Revanth Reddy) సంచలన కామెంట్స్ చేశారు.
కాంగ్రెస్ పార్టీలో అందరూ నా న్యాయకత్వాన్ని అంగీకరిస్తున్నారు. కానీ టీపీసీసీ చీఫ్ పదవిని ఆశిస్తున్న ఆ నలుగురు వ్యక్తులు మాత్రం తన న్యాయకత్వాన్ని వ్యతిరేకిస్తున్నారని రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు. అందరి అభిప్రాయాలూ తీసుకునే నిర్ణయాలు తీసుకుంటున్నామని కానీ ఫలితం తేడా వస్తే మాత్రం అధ్యక్షుడిని తప్పుబట్టడం సరికాదన్నారు. కాంగ్రెస్ ట్రస్ట్ కు సంబంధించి కోట్ల రూపాయలు శశిధర్ రెడ్డి (Marri Sashider Reddy) స్వాహా చేశారని రేవంత్ (Revanth Reddy) సంచలన ఆరోపణలు చేశారు. అయితే ఆ లెక్కలు అడిగినందుకే ఆయన బీజేపీలో చేరారని రేవంత్ (Revanth Reddy) అన్నారు.
దాసోజు శ్రవణ్ విషయంలో జరిగింది ఇదే..
ఇక దాసోజు శ్రవణ్ పార్టీని వీడడంపై కూడా రేవంత్ రెడ్డి స్పందించారు. ఖైరతాబాద్ కార్పొరేటర్ విజయారెడ్డి పార్టీలో చేరింది. అయితే ఆ సమయంలో ఎమ్మెల్సీ టికెట్ ఇస్తామని, సర్వేలు అనుకూలంగా ఉంటే మాత్రం ఖైరతాబాద్ సెగ్మెంట్ టికెట్ కూడా ఇస్తామని చెప్పామన్నారు. అయితే విజయరెడ్డిని తనకు వ్యతిరేకంగా తీసుకొచ్చామని అనుకున్న కారణంతోనే దాసోజు శ్రవణ్ పార్టీని వీడారని రేవంత్ రెడ్డి (Revanth Reddy) అన్నారు.
ముగ్గురు పోతే 30 మంది వచ్చారు..ఆ నలుగురు ఎవరు?
తాను టీపీసీసీగా బాధ్యతలు చేపట్టిన దగ్గరి నుండి కేవలం ముగ్గురు మాత్రమే పార్టీని వీడారని రేవంత్ తెలిపారు. ఇదే సందర్భంలో కాంగ్రెస్ లోకి 30 మందికి పైగా నాయకులు చేరారని రేవంత్ రెడ్డి (Revanth Reddy) చెప్పారు. అయితే రేవంత్ చెప్పిన ఆ నలుగురు సీనియర్ నాయకులు ఎవరా అని ఇప్పుడు తీవ్ర చర్చనీయాంశం అయింది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Congress, Hyderabad, Mp revanthreddy, Revanth Reddy, Telangana, TS Congress